టీఆర్ఎస్ కుదరదు.. మరో పేరు పెట్టుకోండి.. కల్వకుంట్ల కవితకు ఈసీ తాఖీదు.!

Publish Date:Jul 4, 2026

Advertisement

కల్వకుంట్ల కవితకు కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ఆమె స్థాపించిన కొత్త పార్టీ తెలంగాణ రక్షణ సమితి పేరుపై భారీ ఎత్తున అభ్యంతరాలు వచ్చిన కారణంగా పార్టీ పేరు మార్చుకోవాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ మేరకు పార్టీకి అధికారిక సమాచారం ఇచ్చింది.  ఈసీ ఆదేశాల మేరకు
  కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది. 

 తన పార్టీకి తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పేర్కొంటూ..  రిజిస్ట్రేషన్ కోసం కవిత ఈసీకి దరఖాస్తు చేసుకున్న సంగతి విదితమే. అయితే..  ఈ పేరుపై  వెయ్యికి పైగా అభ్యంతరాలు వచ్చాయని అందువల్ల మూడు ప్రత్యామ్నాయ పేర్లను  కు సర్పించాలని ఈసీ  కవితకు లేఖ రాసింది.  

కాగా ఈసీ నుంచి వచ్చిన అభ్యంతరాలపై స్పందించిన కవిత..  ఈసీ కోరినట్లు ప్రత్యామ్నాయంగా కొత్త పేర్లు ఇచ్చే ప్రసక్తే లేదనీ..  ఈ విషయంలో న్యాయపోరాటం చేస్తామనీ తెలిపారు.  గత ఫిబ్రవరిలో తెలంగాణ ప్రజా జాగృతి, తెలంగాణ జాగృతి, తెలంగాణ రక్షణ సేన, తెలంగాణ రాష్ట్ర జాగృతి, తెలంగాణ ప్రజా శక్తి  పేర్లను సూచిస్తూ కవిత సీఈసీకి లేఖ రాశారు. ఈ క్రమంలో ఏప్రిల్ 25న మునీరాబాద్ లో జరిగిన పార్టీ ఆవిర్భావ సభలో తమ పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేనగా  ప్రకటించిన కవిత, అదే సభలో పార్టీ జెండాను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఇది జరిగిన మూడు రోజులకు కవిత కొత్త పార్టీ పేరును  తెలంగాణ రక్షణ సేన గా ఈసీ ప్రాథమికంగా గుర్తించింది.  తాజాగా ఈసీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ..  ప్రత్యామ్నాయ పేర్లు ఎంపిక చేసుకోవాలని సూచించడం తెలంగాణలో రాజకీయ సంచలనానికి తేరతీసింది. 

ECI, Kalvakuntla, Kavitha, TRSname, Teluguone, Telangana Politics

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ లో జగన్ పార్టీకి అదేనండీ వైసీపీకి జనం కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా అర్హత లేదని 2024 ఎన్నికలలో విస్పష్ట తీర్పు ఇచ్చేశారు. అయినా నిస్సిగ్గుగా జగన్ కోర్టును విపక్ష హోదా కోసం ఆశ్రయించారు.
ఎవరైనా సరే పార్టీ గీత దాటి మాట్లాడితే సహించేది లేదు..మహేష్ కుమార్ గౌడ్..!
ధనవంతులు, పలుకుబడి ఉన్న వ్యక్తుల భూములు, ఆస్తులను భూసేకరణ నుండి కాపాడేందుకే యాక్సెస్ రోడ్డును నిబంధలకు విరుద్ధంగా నిర్మించారనీ, ప్రధాన రహదారిలో ఎస్ కర్వ్ ఎందుకు వచ్చిందంటూ ప్రశ్నలు సంధిస్తూ సందేహాలను ప్రేరేపించే ప్రయత్నం వైసీపీ సోషల్ మీడియా ఓ రేంజ్ లో చేసింది.
ఉప ముఖ్యమంత్రి, జనసేనాని  పవన్ కళ్యాణ్  ఈ  కార్యక్రమానికి గైర్హాజరు కావడంపై చర్చ జరుగుతోంది. దీనిని కూటమి పార్టీల మధ్య విభేదాలుగా వైసీపీ సోషల్ మీడియా కలరింగ్ ఇచ్చి ఓ రేంజ్ లో వైరల్ చేస్తోంది.
తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకులపై దాడి చేశారనే ఆరోపణలతో పాటు దానికి సంబంధించిన దృశ్యాలు రికార్డై బయటకు వచ్చిన నేపథ్యంలో విరూపాక్షపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్ కు తరలించారు.
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల వరకు ప్రస్తుత రాజకీయ చిత్రం ఎంతో ఉత్కంఠభరితంగా మారింది.
అమరావతి కేవలం ప్రజా రాజధాని మాత్రమే కాదు..  దేవతల రాజధాని కూడా అని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల నుంచి, ప్రముఖ పుణ్యక్షేత్రాల నుంచి పవిత్ర మట్టి , జలాలను సేకరించి ఇక్కడ పవిత్ర పూజలు నిర్వహించిన విషయాన్ని ప్రస్తావించారు.
జగన్ హయాంలో పాలన అంటే పంచడం, పంచుకోవడం అన్న చందంగా పరిస్థితి ఉండేది. దాంతో జగన్ హయాంలో రాష్ట్రానికి కొత్తగా పెట్టుబడులు ఏవీ రాలేదు సరికదా.. ఉన్నవి కూడా తరలిపోయాయి. అసలు అప్పట్లో ఏపీ వైపు చూడాలంటేనే పారిశ్రామిక వేత్తలు భయపడేలా పరిస్థితులు ఉండేవి.
65 సెంట్ల భూమి విషయంలో కోర్టుకు వెళ్లిన రైతులపై చంద్రబాబుకు ప్రేమ లేదంటూ పేర్ని నాని ఈ సందర్భంగా విమర్శించారు. కానీ వేల ఎకరాలు రాజధాని కోసం ల్యాండ్ పూలింగ్ ద్వారా భూమిని ఇచ్చిన రైతుల విషయంలో జగన్ హయాంలో జరిగిందేంటి?
ర్యాలీకి ముందుగానే గుడివాడ వన్ టౌన్ ఎస్ఐ వీవీ సత్యనారాయణ మాజీ మంత్రి కొడాలి నానికి నోటీసులు అందజేశారు. అయితే ఆ నోటీసులను ఖాతరు చేయకుండా..  వైసీపీ శ్రేణులు, మద్దతుదారులతో   పార్టీ క్యాంప్ ఆఫీస్ దిశగా ముందుకు సాగారు.
తాజాగా  భారత్ జన వికాస్  పేరిట ఆయన ఒక కొత్త జాతీయ పార్టీ ఆలోచన వెనుక వేరే వ్యూహం ఉందన్నారు. వైసీపీ అధినేత జగన్ పై ఒత్తిడి పెంచి, లేదా బ్లాక్ మెయిల్ చేసి పార్టీలో లేదా ఢిల్లీ నెట్‌వర్క్ బాధ్యతల్లో తిరిగి పట్టు సాధించేందుకు చేస్తున్న ప్రయత్నమా అన్న అనుమానాన్ని భరద్వాజ వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో  జగన్   రాజకీయ వ్యూహం కూటమి ప్రభుత్వానికి అర్థమవుతోందా అనే అంశంపై ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ఆంధ్రప్రదేశ్ మేధావుల వేదిక కన్వీనర్ చలసాని శ్రీనివాస్ తెలుగువన్ న్యూస్ చానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.