తమ్ముడికి అన్న చిరు అండ

Publish Date:Jan 2, 2023

Advertisement

ఇంత కాలం తటస్థంగా ఉన్న మెగా స్టార్ చిరంజీవి కొత్త సంవత్సరంలో తన తమ్ముడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు బహిరంగ మద్దతు ప్రకటించేశారు. ఇంత కాలం కారణాలేమైతేనేం.. ఏ పార్టీకి అనుకూలం కాదు, వ్యతిరేకం కాదు అంటూ వచ్చిన చిరంజీవి.. పరోక్షంగానైనా విస్పష్టంగా తేల్చేశారు. తన తమ్ముడిని ఇష్టారీతిగా తిడుతూ తన వద్దకు వచ్చేవారిని ఉద్దేశించి చిరంజీవి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

తన తమ్ముడు, జనసేనాని పవన్ కల్యాణ్ ను విమర్శించే వారు తన వద్దకు రావద్దని కుండ బద్దలు కొట్టేసారు. ఒక వైపు పవన్ ను బండ బూతులు తిడుతూ తన వద్దకు వచ్చి వారి ఇళ్లల్లో శుభకార్యాలకు ఆహ్వానించే వారిని ఇక దూరం పెట్టనున్నట్లు చెప్పిన చిరంజీవి.. అలాంటి వారు ఆహ్వానించినా వారి ఇళ్లల్లో కార్యక్రమాలకు తాను వెళ్లననీ, అలాగే అటువంటి వారిని తాను పిలవననీ చెప్పారు. అయితే చిరు మాటల, వ్యాఖ్యలు వైసీపీని ఉద్దేశించి చేసినవేనని రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది.

ఎందుకంటే.. జనసేనాని పై అనుచి వ్యాఖ్యలు, విమర్శలు చేసేది కేవలం వైసీపీ వాళ్లే. రాజకీయ విమర్శలు కాకుండా వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చూస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడే వైసీపీ నేతలను ఉద్దేశించే చిరంజీవి ఈ కామెంట్స్ చేశారని అంటున్నారు. ఎందుకంటే పవన్ కల్యాణ్ వివాహాల విషయంలో వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్  సహా పలువురు వైసీపీ మంత్రులు, నాయకులు తరచూ విమర్శలు గుప్పిస్తుంటారు. జనసేనాని వైసీపీ ప్రభుత్వ విధానాలపై విమర్శ చేయడం తరువాయి.. వైసీపీ నాయకులు తమ గొంతులు సవరించుకుని మరీ పవన్ కల్యాణ్ పై వ్యక్తిగత దూషణలకు దిగుతారు. పేర్ని నానితో సహా అనేక మంది వైసీపీ లో ఉన్న కాపు నేతలు పవన్ కల్యాణ్ వ్యక్తిగత దూషణే తమ బాధ్యత అనుకున్నట్లుగా వ్యవహరిస్తున్నారు. వీరంతా కూడా అదే సమయంలో చిరంజీవిని తమ వాడుగా చెప్పుకుంటుంటారు.

చిరు నోట ఏ మాటా రాకపోయినా.. చిరంజీవికి జగన్ అంటే అభిమానమని చెప్పుకుంటుంటారు. సినిమా టికెట్ల వ్యవహారంలో చిరంజీవి జగన్ వద్దకు రాయబారానికి వెళ్లడం.. ఆ సందర్భంగా దణ్ణాలు పెడుతూ బతిమలాడుతున్నట్లు మాట్లాడటాన్ని పదే పదే ప్రస్తావిస్తూ మెగా స్టార్ కు జగన్ అంటే అంతులేని గౌరవమనీ చెప్పుకుంటారు. ఇప్పుడు చిరంజీవి తన వ్యాఖ్యల ద్వారా అటువంటి నేతలందరికీ చెక్ పెట్టారనే చెప్పాలి. పవన్ పై విమర్శలు గుప్పించి, వ్యక్తిగత దూషణలకు దిగే వారిని చూడటానికే తనకు ఇష్టం ఉండదని చిరు కుండబద్దలు కొట్టేశారు. వైసీపీ నేతలను ఉద్దేశించే చిరంజీవి ఈ వ్యాఖ్యలు చేశారన్నది కేవలం రాజకీయ విశ్లేషకులే కాదు సామాన్య జనం కూడా చెబుతున్నారు.

రాష్ట్ర జనాభాలో 15 శాతం పైగా ఉన్న  కాపు సామాజిక వర్గం ఏ పార్టీ వైపు మొగ్గు చూపితే, ఆ పార్టీ విజయావకాశాలు మెరుగవుతాయి. అందుకే, ‘కాపు’ఓటు ఏ పార్టీని కాపు కాస్తే, ఆపార్టీ అధికారంలోకి వస్తుందనే రాజకీయ విశ్వాసం బలంగా స్థిరపదిండి. ఆ కారణంగానే  కాపు  జనాభా అధికంగా ఉన్న ఉమ్మడి ఉభయ గోదావరి జల్లాలలో ఏ పార్టీ మెజారిటీ స్థానాలు గెలుచుకుంటే, అదే పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని, ఒక నమ్మకమూ ఏర్పడింది. ఆ కారణంగానే వైసీపీ కాపు ఓటు కోసం చిరంజీవిని ఆకాశానికి ఎత్తేస్తూ.. అదే సమయంలో ఆయన సోదరుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. అలా విమర్శించడానికి ప్రధానంగా పార్టీలోని కాపు నేతలనే నియోగిస్తోంది. ఒక వైపు మెగాస్టార్ ను ప్రశంసలతో ముంచెత్తేస్తూ, మరో వైపు పవన్ కల్యాణ్ వ్యక్తిత్వంపై విమర్శలు గుప్పిస్తూ కాపులలో చీలికను తెచ్చి లబ్ధి పొందాలన్న ఆరాటం ప్రదర్శిస్తోంది.

ఈ నేపథ్యంలోనే స్వాంత్య్ర స్వర్ణోత్సవాలలో భాగంగా భీమవరంలో జరిగిన అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు చిరంజీవిని ప్రత్యేకంగా ఆహ్వానించింది. అయితే.. జగన్ సర్కార్ పై  కాపు సామాజిక వర్గంలో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. గత ఎన్నికలలో నమ్మి జగన్ కుమద్దతుగా నిలబడిన తమను జగన్ నిలువునా ముంచేశారన్న భావన ఆ సామాజిక వర్గంలో వ్యక్తం అవుతోంది.  కాపు రిజర్వేషన్ మాట దేవుడెరుగు కాపుల సంక్షేమం ఊసే లేకుండా జగన్ ఈ మూడున్నరేళ్లూ గడిపేశారని గుర్రుగా ఉంది. దీనిని గమనించే జగన్ కాపు సామాజిక వర్గంలో బలమైన గుర్తింపు, అభిమానం ఉన్న మెగాస్టార్ ను తనకు అనుకూలుడని చిత్రీస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకూ ప్రజలలో అటువంటి అభిప్రాయం  కలిగించడంలో సక్సెస్ అవుతూ వచ్చింది. ఓ వైపు పవన్ కల్యాణ్ పై విమర్శలు, మరో వైపు చిరంజీవిపై ప్రశంసలలో కాపు సామాజిక వర్గంలో అయోమయాన్ని సృష్టించడమే కాకుండా.. చిరు పవన్ అభిమానులలో వైరుధ్యాన్ని వైషమ్యం ఏర్పడేందుకు వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ వచ్చింది.

ఇప్పుడు చిరు మాటలతో వైసీపీ పరిస్థితి  గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డ చందంగా మారింది. వైసీపీ పేరు ప్రస్తావించకపోయినా.. పవన్ కల్యాణ్ ను దూషించే వ్యక్తులతో మాట్లాడటానికే ఇష్టపడనని చిరంజీవి చెప్పిన మాటలు ఆ పార్టీని ఉద్దేశించినవేనని ఎవరికైనా ఇట్టే అవగతమైపోయింది. ఈ మాటల ద్వారా చిరంజీవి అటు వైపీసీ వ్యూహాలకు చెక్ పెట్టడమే కాకుండా.. ఇటు జనసేనకే తన మద్దతు అని చెప్పకనే చెప్పేశారు. ఈ మాటలు జనసేనకు ఎంత మేరకు బలంగా మారుతాయన్నది చూడాల్సిందే. 

By
en-us Political News

  
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్,   విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  
 నామినేషన్ల ఉపసంహరణ గడువు  ముగిసే నాటికి  రాష్ట్ర వ్యాప్తంగా  77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.  ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు.  గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో   మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు. 
 2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్   ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో  పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.