తల్లిదండ్రులు ఇలా ఉంటే పిల్లల ఆత్మవిశ్వాసం కోల్పోతారు..!

Publish Date:Jun 15, 2026

Advertisement

తల్లిదండ్రులు తమ పిల్లలను చక్కగా పెంచడానికి ఎంతగానో ప్రయత్నిస్తారు, కానీ కొన్నిసార్లు తల్లిదండ్రులకు ఉండే  కొన్ని అలవాట్లు తెలియకుండానే పిల్లల మీద ప్రబావం చూపిస్తాయి.ఇంకొక విచిత్రమైన విషయం ఏమిటంటే.. తల్లిదండ్రుల ప్రవర్తన పిల్లల మీద ప్రబావం చూపిస్తున్నట్టు కనీసం తల్లిదండ్రులు తెలుసుకోరు, గ్రహించలేరు కూడా.  కానీ అది పిల్లల మానసిక , భావోద్వేగ ఎదుగుదలపై నేరుగా ప్రభావం చూపుతుంది. ప్రవర్తన సరిగా లేని తల్లిదండ్రుల వల్ల, పిల్లలు క్రమంగా మౌనంగా ఉండిపోతారు, తమ మనసులో ఉన్న విషయాలను  వ్యక్తపరచడానికి సిగ్గుపడతారు, వారి ఆత్మవిశ్వాసం కూడా బలహీనపడుతుంది.  తల్లిదండ్రుల ప్రవర్తన ఎలా ఉంటే పిల్లల ఆత్మవిశ్వాసం దెబ్బతింటుందో.. వారు జీవితంలో ఏ విషయాన్ని చెప్పలేక, జీవితంలో ఎదగలేక వెనుకబడిపోతారో.. పేరెంటింగ్ నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుంటే..

కొన్ని లక్షణాలను, ప్రవర్తనను బట్టి తల్లిదండ్రులు పిల్లల విషయంలో పెంపకం సరిగా లేదని అర్థం చేసుకోవచ్చు.  తల్లిదండ్రులలో మూడు సాధారణ లక్షణాలు ఉంటాయి. మొదటిది, తమ పిల్లల ప్రతి  దాన్ని నియంత్రించాలని, వారి తరపున ప్రతి నిర్ణయం తామే తీసుకోవాలని కోరుకునే తల్లిదండ్రులు. రెండవది, పిల్లలు విచారంగా, కోపంగా లేదా కలత చెందినప్పుడు, "నువ్వు అతిగా స్పందిస్తున్నావు" లేదా "ఇంత చిన్న విషయానికి ఎందుకు కోపపడుతున్నావు?" వంటి మాటలు అనడం. ఇది పిల్లల భావాలకు విలువ లేదని వారికి నేర్పుతుంది.

పిల్లలు సరిగా పెంచడం లేదనడానికి మూడవ సంకేతం ఏమిటంటే, పిల్లలు మంచి మార్కులు తెచ్చుకుంటే, ఎప్పుడూ చదువుకుంటే, తల్లిదండ్రుల మాట వింటే, వారి అంచనాలకు అనుగుణంగా జీవిస్తేనే తమకు ప్రేమ, పెద్దల అనుమతి  లభిస్తాయని భావించడం.  ఒకవేళ వారు అలా చేయకపోతే, వారి తల్లిదండ్రులు కోపగించుకోవడం లేదా కలత చెందడం,  ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం ఇలా చాలా చేస్తారు. తల్లిదండ్రులు చేసే ఈ ప్రవర్తన వల్ల పిల్లలు మానసికంగా ఎదగలేరు,  వారి ఆత్మవిశ్వాసం కోల్పోతారు.

తల్లిదండ్రులు ప్రవర్తన మార్చుకోవాలి..

తల్లిదండ్రులు తమలో తాము పైన చెప్పుకున్న లక్షణాలు గమనిస్తే, వెంటనే తమ ప్రవర్తన మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలని పేరెంటింగ్ నిపుణులు అంటున్నారు.  అంతేకాదు.. తమ పిల్లలను నియంత్రించడానికి బదులుగా, తల్లిదండ్రులు వారితో మంచి అనుబంధాన్ని పెంచుకోవడం, పిల్లలతో స్నేహితులుగా ఉండటంపై  దృష్టి పెట్టాలి. వారి సమస్యలకు పరిష్కారాలు సూచించే ముందు, పిల్లలు ఏం చెప్తున్నారో  అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అంతేకాకుండా, వారి  సమస్య ఏంటో వివరంగా తెలుసుకోవాలి. కేవలం చదువు, ఫలితాలపై దృష్టి పెట్టకుండా, వారు తమ పిల్లల అభిరుచికి విలువ ఇవ్వాలి.

ఇది ముఖ్యం..

తల్లిదండ్రుల ప్రవర్తన సరిగా లేకపోవడం అంటే.. అప్పుడప్పుడు ఒక చెడ్డ నిర్ణయం తీసుకునేవారు లేదా పొరపాటు చేసేవారు కాదు. విషపూరితమైన తల్లిదండ్రులు అంటే, వారి వల్ల పిల్లలు క్రమంగా తమ ఆత్మవిశ్వాసాన్ని, తమ అభిప్రాయాన్ని చెప్పే శక్తిని, ఏదీ చెప్పుకోలేని పరిస్థితి తీసుకురావడం.  ఇలాంటివన్నీ ఉంటే ఆ పిల్లలు జీవితంలో ఎంతో కోల్పోతారు.

                                         *రూపశ్రీ.

By
en-us Political News

  
 పిల్లల ముందు బట్టలు మార్చుకోవడం వల్ల పెద్దగా నష్టం ఏమీ ఉండదని అనుకుంటారు.  సాధారణంగా ఇంట్లో మగవాళ్లు అయినా ఆడవాళ్లు అయినా పిల్లలు ఉన్నా పెద్దగా పట్టించుకోకుండా బట్టలు మార్చుకుంటారు.
5 Habits Every Father Should Give Up for His Daughter,Every Father Needs to Hear These 5 Parenting Tips,5 Habits to Leave Behind
Signs of a Healthy Family Environment,Healthy Family or Toxic EnvironmentIs Your Family Environment Healthy
పిల్లల వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం , ఆలోచనా విధానం మొదలైన విషయాలలో  తల్లిదండ్రులిద్దరూ కీలక పాత్ర పోషిస్తారు. తల్లి ప్రేమ, శ్రద్ధ పిల్లల భావోద్వేగ పునాదిని బలపరిస్తే.. తండ్రి ప్రవర్తన, క్రమశిక్షణ, మాటతీరు,   జీవనశైలి వంటివి  పిల్లలపై చాలా గట్టి  ప్రభావాన్ని చూపుతాయి.
ప్రతి వ్యక్తికి తన జీవితంలో బోలెడు బలం, ప్రశాంతత,  ఆత్మవిశ్వాసం,  జీవితం మీద భరోసా కలిగేది కుటుంబం వల్లనే.
వివాహం కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య ముడిపడేదే కాదు.. రెండు కుటుంబాల మధ్య ముడిపడే బంధం. భారతదేశంలో చాలా వరకు వివాహం తర్వాత అమ్మాయి అత్తవారింటికి వెళుతుంది. భర్త, అత్తమామలతో కలిసి జీవిస్తుంది. అత్తారింట్లో అత్తమామలు మంచివాళ్లు, కోడలిని అర్థం చేసుకుని బాగా చూసుకునేవాళ్లు అయితే ఆ ఇంట్లో ఆడపిల్ల సంతోషంగా ఉంటుంది...
వేసవి సెలవలు పూర్తయ్యాక పిల్లలు స్కూల్ కు వెళ్లడం అనేది సహజం. పాఠశాలకు వెళ్లడం పిల్లల జీవితంలో పెద్ద మార్పుగా మారుతుంది. మరీ ముఖ్యంగా కొత్తగా స్కూల్ లో జాయిన్ అయిన పిల్లల విషయంలో...
ప్రజల జీవితాలలో ముఖ్యమైనవి సంబంధాలు. నేటికాలంలో ఇంటర్నెట్, డిజిటల్ పరంగా ఎంత దూరంలో ఉన్నా ఎవరినీ పెద్దగా మిస్ కాకుండా పక్కనే ఉన్నట్టుగా పోన్ మాట్లాడటం, వీడియో కాల్స్ చేయడం వంటి మార్గాలలో దగ్గరగానే ఉన్నట్టు ఫీల్ అవుతారు. కానీ బంధాల మధ్య గతంలో కంటే అపార్థాలు, గొడవలు, అతిగా స్పందించడం..
మొబైల్ వ్యసనం మీ మెదడుపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, నిద్ర, మానసిక ఆరోగ్యంపై మొబైల్ వల్ల కలిగే సమస్యలు మరియు వాటి నుంచి బయటపడే మార్గాలను MindVision వేణుగోపాల్ ఈ వీడియోలో సులభంగా వివరించారు...
ఒక ఉత్తమమైన తరాన్ని సమాజానికి ఇచ్చే ఉద్దేశంతో వివాహం చేసుకుంటారని పెద్దలు చెబుతారు. ఆరోగ్యకరమైన బంధం ద్వారా  ఒక మంచి తరం తయారవుతుంది. కుటుంబం విషయానికి వస్తే.. వంశం ముందుకు సాగడం అనేది పిల్లల ద్వారానే జరుగుతుంది...
నేటి కాలంలో, సంబంధాలు బలపడటానికి , విచ్ఛిన్నం కావడానికి కమ్యూనికేషన్ సరిగా లేకపోవడమే అతిపెద్ద కారణంగా మారింది. అది కుటుంబ సంబంధం అయినా, స్నేహ సంబంధం అయినా, లేదా మరేదైనా వ్యక్తిగత సంబంధం అయినా..
చుట్టూ ఉన్నవాళ్లు అందరూ మంచివాళ్లు ఉండరు. మనుషుల్లో మంచి, చెడు రెండూ ఉంటాయి. కానీ కొందరిలో స్వార్థం..
నేటి వేగవంతమైన జీవితంలో మనుషులకు అన్ని భౌతిక సౌకర్యాలు అందుబాటులో ఉన్నప్పటికీ, రెండు విషయాలలో మాత్రం  వెనుకబడిపోతున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. మొదటిది గాఢమైన, నిజమైన సంబంధాలను నిలబెట్టుకోవడం కాగా, రెండవది మనశ్శాంతి లేకపోవడం
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.