వై దిస్‌ కొలవరి లోకేష్‌!?

Publish Date:Oct 21, 2012

Advertisement

 

రాష్ట్రంలో ఇప్పుడు యాత్రల సీజన్‌ జోరుగా నడుస్తోంది. అయితే ఇవి ఎబ్బెట్టు యాత్రలుగా జనంనుంచి నిరాదరణ ఎదుర్కొంటున్నాయి. ప్రజల సమస్యలు ఏమిటో తెలుసుకోవడానికి కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, పథకాలు ఎలా అమలవుతున్నాయో తెలుసుకోవడానికి ప్రధాని మన్మోహన్‌సింగ్‌లు పాదయాత్ర చేస్తే ఎంత ఎబ్బెట్టుగా వుంటుందో... మన రాష్ట్ర నాయకులు చేస్తున్న పాదయాత్రలు అంతే ఎబ్బెట్టుగా వున్నాయి. అధికార కుర్చీ మొహం ఎరగని రోజుల్లో వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి పాదయాత్ర చేశారంటే దానికో అర్థం వుంది. కానీ తొమ్మిదేళ్లు అధికారంలో, దాదాపు అంతేకాలం ప్రతిపక్షంలో వున్న చంద్రబాబునాయుడు పాదయాత్ర చేయడంలో అర్థంలేదు. పథకాల అమలుకు సంబంధించి సచివాలయంలో వుండి సమీక్ష చేయడానికి సర్వ సమగ్ర ఏర్పాట్లు వుండి కూడా, అధికార యంత్రాంగంపై అదుపుతప్పిన లోటును కప్పిపుచ్చుకోవడానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పల్లెబాట పట్టి వారంలో రెండు మూడు రోజులు అక్కడే గడిపి ‘ఇంటిపోరు’ తప్పించుకుంటున్నారు. తండ్రి తప్పిదాలకు వారసుడైన వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి సాగించిన పోరుయాత్రలు ఇప్పుడు జైలుయాత్రలుగా రూపాంతరం చెందాయి. రాష్ట్రంలోని మిగతా పార్టీలవి నిరంతర యాత్రలే.
అయితే జగన్‌ తరఫున ఆయన సోదరి షర్మిల పాదయాత్ర చేపట్టడమే విశేషం. ఆమెను ‘బేబీ షర్మిల’ అని ముద్దుగా పిలుచుకోవడం కద్దు. ఏమీ తెలియని అమాయకురాలు అని అందులో అర్థం వుంది. షర్మిల పాదయాత్ర ఎందుకు ఉద్దేశించినదన్నది చెప్పడం కష్టం. రింగ్‌ మాస్టర్‌ జైలులో చాలాకాలంగా వుండడం వల్ల, ఇప్పట్లో బయటికి వస్తాడనే నమ్మకం ఎవరికీ లేనందువల్ల వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణుల్లో అయోమయం, అలసత్వం నెలకొన్నాయి. వీటిని పారదోలి మునుపటి ఉత్తేజం అందించడానికి పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మకు శక్తిసామర్ధ్యాలు లేవు. చేతిలో బైబిల్‌ పట్టుకొని సాగించగలిగిన ప్రచారం, చేయగలిగిన జనాకర్షణకు చాలా పరిమితులు వున్నాయి. జగన్‌కు వున్న జనాకర్షణతో పోల్చితే ఆయన మాతృమూర్తి, స్వయాన వైఎస్‌ సతీమణి విజయమ్మకు ఆదరణ శూన్యమనే చెప్పాలి. ఈ నేపధ్యంలో ఆకాశంలోంచి ఊడిపడిన ‘ఏంజిల్‌’ బేబీ షర్మిల!  ఆమె ఏ హోదాలో పాదయాత్ర చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో తెలియదు. కేవలం వైఎస్‌ కుమార్తెగా ఆమె పాదయాత్ర చేస్తున్నారు. దీనివెనుక రాజకీయ ఉద్దేశాలు, దురుద్దేశాలు ఏమిటో ఎవరికెరుక!?
ఈ నేపథ్యంలో చూస్తే.. చంద్రబాబు అనవసరంగా పాదయాత్ర చేపట్టారు. కొత్తగా ప్రజా సమస్యలు తెలుసుకోవలసింది, పరిష్కార మార్గాలు అన్వేషించవలసింది ఆయనకు ఏమీ లేదు. అనవసరంగా ఈ వయసులో ఆయాసం, అనారోగ్యం తప్ప. ఆయనకు బదులుగా ఆయన కుమారుడు లోకేష్‌ పాదయాత్రకు పూనుకుని వుంటే అన్ని విధాలుగా ప్రయోజనం వుండేది. యువనాయకుడు కాబట్టి జనంలో కలిసి, వారితో మమేకమైతే అనేక సాధకబాధకాలు తెలుస్తాయి. వాటికి అనుగుణంగా పార్టీ విధానాలు రూపొందుతాయి. లోకేష్‌ పాదయాత్ర చేస్తే యువతరం అందులో భాగస్వామ్యం అవుతుంది. జగన్‌కు, సోదరి బేబీ షర్మిల యాత్రలకు ధీటుగా వుంటుంది. ఎటొచ్చీ తెలుగుదేశం పార్టీపై ఒక ఆరోపణ వుంది. యువతరానికి ప్రాధాన్యం ఇవ్వడం లేదని. మూడు దశాబ్దాలుగా పాదుకుపోయిన వృద్ధ నాయకత్వమే మండల స్థాయినుంచి కేంద్ర స్థాయి వరకూ వుందని! ఈ ఆరోపణలను పటాపంచలు చేసి యువ నాయకత్వం సారధ్యంలో తెలుగుదేశం నూతన దిశానిర్దేశం చేయబోతోందంటూ ప్రజలకు కొత్త సందేశం ఇవ్వడానికీ వీలుండేది. పైగా షర్మిలలాగా లోకేష్‌ రాజకీయాలకు కొత్త కాదు. మునుపటి ఎన్నికలప్పుడు పార్టీ మేనిఫెస్టో రూపకల్పనలో కూడా క్రియాశీల పాత్ర పోషించారు. కాబట్టి తెలుగుదేశం పార్టీకి ఈ సంధికాలంలో రైట్‌పర్సన్‌ లోకేష్‌ అనడంలో సందేహం లేదు.

By
en-us Political News

  
తండ్రి అంటే పిల్లలకు ఒక భరోసా, కుటుంబానికి ఒక పెద్ద దిక్కు. బయట ఎంతటి బిజీ రాజకీయ జీవితం గడిపినా, ఇంట్లో తమ వారి కోసం వారు చూపించే ప్రత్యేక శ్రద్ధ ఎంతో మధురమైనది.
ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో  ఇక వర్షాలు అంతంత మాత్రమేనని వాతావరణ పరిశోధకులు చెబుతున్నారు. డిసెంబర్, జనవరిలలో శీతాకాలంలో చలి కూడా అంతంత మాత్రంగానే ఉంటుందనీ, డిసెంబర్ నుంచే రోహిణిని తలపించే ఎండలు మండిపోతాయని అంచనా వేస్తున్నారు.
కన్నబిడ్డకు అనారోగ్యం వస్తే ఏ తల్లైనా తల్లడిల్లిపోతుంది. బిడ్డకు నయం చేయించేందుకు తన దగ్గర ఉన్నదంతా ఖర్చు చేయడానికైనా వెనుకాడదు.
ఇండియాలో క్యాంపస్‌ను ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి  అమెరికన్ ప్రభుత్వ విశ్వవిద్యాలయం ఇదు అవుతుంది. అంటే ఇండియాలో ఏర్పాటు అవుతున్న అమెరికా యూనివర్సిటీ తెలంగాణకు తరలివచ్చిందన్న మాట.
తట్టి అన్నారం సమీపంలో నిర్మానుష్య ప్రాంతంలో కుక్కలు ఓ మృతదేహాన్ని పీక్కుతింటుండటాన్ని స్థానికులు గమనించారు. ఆ దృశ్యం చూసిన వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. చివరకు ఆమెను ఓయూ మాణికేశ్వర్‌నగర్‌కు చెందిన మంగమ్మగా గుర్తించారు.
ప్రభుత్వాలు స్వల్పకాలిక ఆర్థిక ప్రయోజనాల కోసం మద్యంపై ఆధారపడటం వల్ల  వైద్యం, శాంతిభద్రతల పరిరక్షణ, కుటుంబ సంక్షేమం కోసం ప్రభుత్వం కేటాయిస్తున్న  నిధులు నిష్ప్రయోజనంగా మరుతున్నాయి.
ఉద్యోగాల క్రమబద్ధీకరణ సమయంలో సమర్పించిన పీజీ, బీటెక్ తదితర విద్యార్హతల ధ్రువపత్రాలు సంబంధిత విశ్వవిద్యాలయాలు జారీ చేసినవి కావనీ, అవి నకిలీ సర్టిఫికెట్లనీ నిర్ధారణ కావడంతో  వాటి ద్వారా ఉద్యోగాలు సంపాదించిన 35 మంది లెచ్చరర్లను ఊస్ట్ చేస్తూ తెలంగాణ ఇంటర్ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 
జూరాల ప్రాజెక్టు గద్వాల ప్రాంతానికి మాత్రమే కాకుండా సాగు, తాగునీటి అవసరాలకు కూడా కీలకమైన జలవనరు కావడంతో  నీటి నుంచి దుర్వాసన రావడం, నీటి రంగుమారడంతో  నీటి నాణ్యతపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
ట్రూఅప్ ప్రతిపాదనలపై విచారణ జరిపిన టీజీఈఆర్సీ తాజాగా ట్రూఆప్ చార్జీల వసూలుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెండు ఆర్థిక సంవత్సరాలకు కలిపి మొత్తం  7,635.22 కోట్ల  రూపాయల ట్రూఅప్ మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంది. ఇందులో వ్యవసాయ వినియోగానికి సంబంధించిన  2,214.99 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని ఆదేశించింది.
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకున్న ఒక సంచలన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, ప్లాట్ల విక్రయాల పేరుతో పలువురి నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు
అధికారుల కళ్ళుగప్పి అక్రమంగా తరలిస్తున్న కోటీ 20 లక్షల రూపాయల విలువైన బంగారాన్ని  డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు  స్వాధీనం చేసుకున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.