Publish Date:Mar 26, 2025
ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు టూరిజంను బాగా ప్రమోట్ చేశారని తెలంగాణలో సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ‘‘ గతంలో ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు సిఎంగా ఉన్నప్పుడు ఏ ఇజం లేదు ఇక టూరిజం ప్రధానం అనేవారు. ఏ ఇజం లేదన్నప్పుడు మాకు కోపం వచ్చేది. నిజంగా ఖర్చులేనిది ఏదైనా ఉందంటే అది టూరిజం’ అని కూనంనేని అన్నారు. తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ మీద ప్రసంగిస్తున్న సమయంలో కూనంనేని చేసిన వ్యాఖ్యలు ఆసక్తి కలిగించాయి. వామ పక్ష పార్టీలకు బిజెపి బద్ద శత్రువు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వానికి టిడిపి మిత్రపక్ష పార్టీ. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సిపిఐ మిత్ర పక్షంగా ఉంది. కాంగ్రస్కు బద్ద శత్రువు బిజెపి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో సిపిఐ పోటీ చేసింది. ఉమ్మడి పది జిల్లాల్లో 30 సీట్లలో సిపిఐకి 10 వేల ఓట్ బ్యాంక్ ఉందని కూనం నేని పలు సందర్బాల్లో చెబుతుంటారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు బిఆర్ఎస్ కు మిత్ర పక్షంగా ఉన్న సిపిఐకి మిత్ర ధర్మంగా ఒక్క స్థానం ఇస్తామని కెసీఆర్ ఖరాఖండిగా చెప్పడంతో బిఆర్ఎస్ తో తెగదెంపులు చేసుకుంది. తర్వాత కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని తెలంగాణలో ఆ పార్టీ అధికారంలో రావడానికి సిపిఐ ముఖ్య భూమిక వహించింది. పార్టీలకు, పొత్తులకతీతంగా కూనంనేని కుండబద్దలు కొట్టి మాట్లాడటం చర్చనీయాంశమైంది
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/chandrababu-words-in-kunamnen-mouth-25-195023.html
దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి పైలట్ స్మిత్ మచ్చర్‌పై కో-పైలట్ హమామ్ అల్ హమామీ దాడికి పాల్పడిన ఘటన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
భారతదేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన యూపీఐ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
పెట్రోల్‌లో ఇథనాల్ కలపడాన్ని ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వ తాజా విధానాలు ఇప్పుడు సామాన్యుల వంటగదిపై తీవ్ర ప్రభావం
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి.
వికారాబాద్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అనంతగిరి హిల్స్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది.
గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని చారిత్రాత్మక బాపూఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నివాళులు అర్పించింది.
కనీస ధర రూ.30కి పెంపునకు సిఫార్సు.!
వెబ్‌సిరీస్ ల్లో ఎక్కువగా బ్యాంకులు, బంగారు దుకాణాల్లో దోపిడీలకు సంబంధించిన వీడియోలే చూసేవాడు.. ఆ తర్వాత తనకున్న ఆర్మీ అనుభవాన్ని ఉపయోగించుకోని సికింద్రాబాద్ మద్రాస్ రెజిమెంట్‌ను ఎంచుకున్నాడు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) వ్యవహారశైలిని నిరసిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
హైదరాబాద్ నగరవాసుల ప్రయాణ కష్టాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంది.
కొత్త కారు కొనుక్కోవాలని ఎన్నో రోజులుగా కలలు కంటారు.. ఆ కల నెరవేరిన రోజు ఆ ఆనందమే వేరు! ఎంతో ఇష్టపడి కొత్త బీఎండబ్ల్యూ కారు కొనుగోలు చేసిన ఓ వ్యక్తి..
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త వాతావరణం నెలకొంది.