కొడాలి నాని అడ్డాలో చంద్రబాబు!

Publish Date:Apr 6, 2023

Advertisement

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు..  వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఆ క్రమంలో ఓ వైపు  జోనల్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఉత్తరాంధ్ర జోనల్  సమావేశాలు.. విశాఖపట్నం వేదికగా జరుగుతున్నాయి. ఎన్నికల వేళ.. పార్టీ శ్రేణులకు ఆయన కీలక దిశా నిర్దేశం చేస్తున్నారు.  అలాగే ఏప్రిల్ 11న చంద్రబాబు.. రాజధాని అమరావతిలో పర్యటించనున్నారు. అనంతరం అంటే 12వ తేదీన ఆయన ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో పర్యటించనున్నారు. ఆ క్రమంలో 13వ తేదీన గుడివాడలో జరిగే భారీ బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొనున్నారు. అనంతరం ఎన్టీఆర్ జన్మ స్థలం నిమ్మకురు చేరుకుని.. ఆ రాత్రి ఆయన అక్కడే బస చేయనున్నారు. అ మరునాడు అంటే 14న మచిలీపట్నంలో జోనల్ సమావేశం జరగనుంది. ఆ సమావేశంలో కీలక నేతలతో ఆయన భేటీ కానున్నారు.  

అయితే కొడాలి నాని ఇలాకా అంటే.. గుడివాడలో చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న భారీ బహిరంగ సభపైనే అందరూ దృష్టి సారించారు. తెలుగుదేశం పార్టీ ద్వారా కొడాలి నాని..  రాజకీయ అరంగేట్రం చేసి... ఆ తర్వాత జగన్ పార్టీలోకి జంప్ కొట్టి.. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేశ్‌ల లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. కొడాలి నాని ఆరోపణలు  శృతిమించాయి.  దీంతో అతడి వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

అలాంటి వేళ.. గుడివాడ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు  చంద్రబాబు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. అదీకాక.. 2019 ఎన్నికల తర్వాత గుడివాడలో చంద్రబాబు పాల్గొంటున్న తొలి సభ ఇదే కావడంతో.. ఈ సభపై అందరి ఫోకస్ పడింది. మరోవైపు గతంలో గుడివాడలో మినీ మహానాడు జరుగుతుందని అంతా భావించినా.. ఎందుకో అది కార్యరూపం దాల్చలేదు.  ఇక ఇప్పుడు చంద్రబాబు గుడివాడలో భారీ బహిరంగ సభలో పాల్గొనడమే కాకుండా   ఇదే సభ వేదికపై నుంచి గుడివాడ అసెంబ్లీ అభ్యర్థిని చంద్రబాబు ప్రకటించే అవకాశం ఉందన్న చర్చ తెలుగుదేశంలో జోరుగా సాగుతోంది. దీంతో ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం టికెట్ ఆశావహులు   రావి వెంకటేశ్వరరావు,  వెనిగండ్ల రాము వర్గీయులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

ఇప్పటికే  తెలుగుదేశం చేపట్టిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి, బాదుడే బాదుడు కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. నారా లోకేశ్ పాదయాత్ర యువగళం పేరుతో దూసుకుపోతోంది. నారా లోకేశ్.. తన పాదయాత్రలో వివిధ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థుల పేర్లను సైతం  ప్రకటిస్తు ముందుకు సాగుతోన్నారు. 

అలాగే ఉత్తరాంధ్ర, తూర్పు, పశ్చిమ రాయలసీమలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం  తెలుగుదేశం అభ్యర్థులు విజయ దుందుభి మోగించారు. అదే విధంగా ఎమ్మెల్యే కోటా  ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ బరిలో దింపిన   అభ్యర్థి పంచుమర్తి అనురాధ   సునాయాసంగా గెలుపొందారు.  దీంతో జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత.. ఇటు సైకిల్ పార్టీపై ప్రజల్లో ఆదరణ ఉందని పక్కాగా స్పష్టమైంది. ఇటువంటి పరిస్థితుల్లో మరికొద్దిగా కష్టపడితే.. కొడాలి నాని కంచుకోటను బద్దలు కొట్టడం ఖాయమన్న భావన తెలుగుదేశంలో బలంగా వ్యక్తమౌతోంది.

By
en-us Political News

  
వివిధ రాష్ట్రాలకు కొత్త ఇన్‌ఛార్జీలను ప్రకటించిన కాషాయ పార్టీ..!
అక్టోబరా, నవంబరా, లేదా తరువాతా అన్న ఉత్కంఠకు తెరదించుతూ మంత్రి నారా లోకేష్ వచ్చే నెలలోనే అంటే అక్టోబర్ లోనే స్థానిక సమరం ఉంటుందన్న స్పష్టత ఇచ్చారు.
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందుల పరిధిలోని లింగాల మండలం నుంచి  జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేయాల్సిందిగా  వైఎస్ సునీతను లోకేష్ కోరినట్లు  ప్రచారం జరుగుతోంది. కేవలం పోటీ చేయడమే కాకుండా, ఆ ఎన్నికలో విజయం సాధిస్తే..  జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవి  కట్టబెడతామని స్పష్టమైన హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
యువనేత లోకేష్ రాప్తాడు రావడం పార్టీ కేడర్‌కు పండుగ రోజు.
తన కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని జగన్ తో సయోధ్య కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా ఖండించారు.  
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.