Publish Date:Apr 21, 2025
ఆవిర్భావం నుంచి తెలుగుదేశం కార్యకర్తల పార్టీయే. ఎన్ని సంక్షోభాలు ఎదురైనా పార్టీకి అండగా కార్యకర్తలు నిలబడి పార్టీని నిలబెట్టుకున్న పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం మాత్రమే. అదే విధంగా తెలుగుదేశం పార్టీ కూడా తొలి నుంచీ కార్యకర్తల సంక్షుమానికే పెద్ద పీట వేస్తూ వస్తున్నది అనడంలో సందేహం లేదు.
Publish Date:Apr 21, 2025
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీపై డ్రోన్ ఎగురవేసినందుకు కేటీఆర్‌తో పాటు మరికొంతమందిపై మహాదేవ్‌పూర్ పీఎస్‌లో నమోదైన కేసును హైకోర్టు కొట్టివేసింది. అనుమతి లేకుండా ప్రాజెక్టును సందర్శించడంతో పాటు డ్రోన్ ఎగురవేశారని ఇరిగేషన్ అధికారి ఫిర్యాదు మేరకు పలు సెక్షన్లు కింద మహాదేవ్‌పూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. మేడిగడ్డ బ్యారేజీ నిషిద్ధ ప్రాంతమేమీ కాదని కేటీఆర్ న్యాయవాది టీవీ రమణారావు అన్నారు. రాజకీయ కక్ష్యల కారణంగానే కేసు నమోదు చేశారని ఆయన కోర్టుకు తెలిపారు. డ్రోన్ ఎగురవేయడం డ్యాం భద్రతకే ప్రమాదమన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్
ఇరువైపులా వాదనలు ముగిసియి. మరోవైపు ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఉట్నూరు పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఎఫ్ఐఆర్‌ను న్యాయస్థానం కొట్టివేసింది.
Publish Date:Apr 21, 2025
హైదరాబాద్‌లో మత్తు ఇంజెక్షన్ తీసుకుని ఇంటర్ విద్యార్థి మృతి చెందాడు. బాలానగర్‌లో ముగ్గురు ఇంటర్మీడియట్ విద్యార్థులు మత్తు కోసం మెడికల్ డ్రగ్స్ తీసుకున్నారు. ఇంజెక్షన్ తో పాటు ట్యాబ్లెట్లు కూడా ఒకేసారి తీసుకున్నారు. దీంతో డోస్ ఎక్కువైంది. ఈ క్రమంలో ఓ అబ్దుల్ నాసర్ అనే విద్యార్థి మృతి చెందాడు. మరో ఇద్దరు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. హైదరాబాద్‌లో కొందరు యువకులు మత్తు ఇంజెక్షన్‌లు, మరియు డ్రగ్స్ సొంతగా వినియోగించడమే కాకుండా ఇతరులకు అమ్ముతున్నారని పోలీసులు తెలిపారు. రాష్ట్రంలో డ్రగ్స్ వినియోగిస్తున్న, సరఫరా చేస్తున్న వారిలో ఎక్కువగా విద్యార్థులే ఉంటున్నారని ఇటీవల గణాంకాలు వెల్లడించిన విషయం తెలిసిందే
Publish Date:Apr 21, 2025
తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించి ఉద్యోగం సంపాదించిన వ్యవహారంలో మాజీ ప్రొబెషనరీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేడ్కర్‌పై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసుపై తాజాగా విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు మే 2వ తేదీన ఢిల్లీ పోలీసుల ముందు విచారణకు హాజరుకావాలని ఆమెను ఆదేశించింది. జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం ఈ కేసు తదుపరి విచారణను మే 21వ తేదీకి వాయిదా వేసింది.
Publish Date:Apr 21, 2025
విజయవాడ జిల్లా జైల్లో గత రెండు నెలలుగా రిమాండ్ ఖైదీగా ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి హైకోర్టులో మరో సారి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసుకున్న బెయిలు పిటిషన్ ను కోర్టు వారం రోజులకు వాయిదా వేసింది.
Publish Date:Apr 21, 2025
తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కు బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ హైకోర్టులో రూ.25 లక్షల డీడీ అందజేశారు. జర్మనీ పౌరసత్వం ఉండి చెన్నమనేని ఎమ్మెల్యేగా పోటీ చేశారు. గతంలో ఆది శ్రీనివాస్ తెలంగాణ హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు. జర్మనీ పౌరసత్వం కలిగి ఉండి తప్పుడు పత్రాలతో ఎన్నికల్లో పోటీ చేశారని.. ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ అంశంపై కోర్టులో ఆది శ్రీనివాస్ సుదీర్ఘ కాలం పోరాడారు. పలు దఫాలుగా విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. చెన్నమనేని రమేశ్‌కు జర్మనీ పౌరసత్వం ఉన్నట్లు గతేడాది డిసెంబర్‌లో తేల్చింది.
Publish Date:Apr 21, 2025
తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జన్మదినం సందర్భంగా ఊహించని ప్రత్యర్థులు విషెస్ చెప్పడం ఆసక్తి రేపుతోంది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ దగ్గర నుంచి ఏపీ మాజీ సీఎం జగన్ సహా పలువురు చంద్రబాబుకి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని వైసీపీ అధినేత జగన్ ఆకాంక్షించారు.
Publish Date:Apr 21, 2025
కేథలిక్ మత గురువు పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన వాటికన్ సిటీలో తన నివాసంలో సోమవారం (ఏప్రిల్ 21) ఉదయం కన్నుమూశారు. వాటికన్ కామెరెంగో కార్డినల్ కెవిన్ ఫెర్రెల్ ఈ విషయాన్నిధృవీకరించారు.
Publish Date:Apr 21, 2025
బీజేపీకి ప్రాతినిథ్యం వహించే స్వామి.. చంద్రబాబు, పవన్.. తమ కూటమిలో భాగస్వామ్యం అన్న కనీస జ్ణానం కూడా లేకుండానే కామెంట్లు ఎందుకు చేస్తుంటారో అర్ధం కాదు.. తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించడం మాత్రమే కాకుండా.. ఆపై కేసులు కూడా వేస్తుంటారు.
Publish Date:Apr 21, 2025
మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్ కుమార్ రెడ్డిలను పెను ప్రమాదం తప్పింది. నిజామాబాద్ లో నిర్వహిస్తున్న రైతు మహోత్సవ వేడుకలలో పాల్గొనేందుకు హెలికాప్టర్ లో ఈ ముగ్గురు మంత్రులూ వెళ్లారు.
Publish Date:Apr 21, 2025
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌గాంధీ పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చార్జిషీట్ దాఖలు చేసింది. నిజానికి ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్లో సోనియా, రాహుల్ గాంధీలతో పాటుగా, శ్యామ్ పిట్రోడా, ఆస్కార్ ఫెర్నాండెజ్ పేర్లు కూడా ఉన్నాయి. అయినా ఫోకస్ అంతా ఈ ఇద్దరిపైనే తప్ప మిగిలిన ఇద్దరినీ ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు.
Publish Date:Apr 21, 2025
తిరుమలలోని శారదా పీఠానికి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు నోటీసులు జారీ చేశారు. గోగర్భం తీర్థం వద్ద శారదాపీఠం భవనాన్ని 15 రోజులలోగా ఖాళీ చేయాలని ఆ నోటీసులలో పేర్కొన్నారు.
Publish Date:Apr 21, 2025
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం లాంగ్ వీకేండ్ కారణంగా గత నాలుగు రోజులుగా తిరుమలకు భక్తులు పోటెత్తారు. అయితే సోమవారం (ఏప్రిల్ 21) తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గింది.