రేపు హస్తినకు చంద్రబాబు.. కారణమేంటో తెలుసా?

Publish Date:Jul 21, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బుధవారం (జులై 22) హస్తిన పర్యటనకు వెడుతున్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరుగుతున్న సమయంలో ఆయన హఠాత్తుగా హస్తిన పర్యటనకు వెళ్లడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.  బాబు పర్యటనకు కారణమేంటన్న విషయంలో సర్వత్రా ఆసక్కి వ్యక్తం అవుతోంది.  కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నియోజకవర్గాల పునర్విభజన , మహిళా రిజర్వేషన్ రాజ్యాంగ సవరణ బిల్లులు తీసుకురానుందన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో చంద్రబాబు ఢిల్లీ పర్యటన కీలకంగా మారింది.

 ఈ బిల్లులకు తెలుగుదేశం సంపూర్ణ మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే.. చంద్రబాబు హస్తిన పర్యటన చేపట్టారు. ఎన్డీయేలో కీలక భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేతగా,  చంద్రబాబు ఇప్పుడు హస్తిన పర్యటనలో పార్లమెంటులో ఈ బిల్లుల ఆమోదానికి అవసరమైన మెజారిటీ  కూడగట్టడం కోసం..   వివిధ   పార్టీల నాయకులతో చర్చలు జరిపేందుకు ఆయన హస్తినకేగుతున్నారన్న చర్చ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది.  ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు భంగం కలగకుండా..  దాంతోపాటు 33 శాతం మహిళా రిజర్వేషన్లు అమలయ్యేలా జాతీయ స్థాయిలో రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందేందుకు ఆయన పలు పార్టీల నేతలతో చర్చలు జరిపే అవకాశం ఉందని అంటున్నారు. 

ఈ బిల్లుల అజెండాతో పాటు, రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక పెండింగ్ అంశాలపైనా చంద్రబాబు ఈ పర్యటనలో పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే అవకాశం ఉంది. ప్రధానంగా.. అమరావతి రాజధాని నిర్మాణం, పొలవరం ప్రాజెక్టు పూర్తి,  కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విడుదల అంశాలపై ఆయన  ప్రధాని,  మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలతో పాటు పలువురు   కేంద్ర మంత్రులతో ఆయన సమావేశమయ్యే అవకాశం ఉందని తెలుగుదేశం ఎంపీల సమాచారం. మొత్తం మీద చంద్రబాబు  ఢిల్లీ పర్యటన అటు జాతీయ రాజకీయాల్లో,  ప్రాధాన్యత సంతరించుకుంది.

CBN, Womens Reservation Bill, Delimitation Bill,  Andhra Pradesh Politics,  NDA Government 

By
en-us Political News

  
G.D. Naidu, known as the “Edison of India,” was an Indian inventor, industrialist and pioneer of innovation. This article explores his remarkable life, curiosity, self-learning, experimentation and practical approach to technology, and the lessons his journey offers to Millennials, Gen Z and Gen Alpha.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
G.D. Naidu జీవితంలో నుంచి Millennials, Gen Z, Gen Alpha నేటి తరాలు ఏం నేర్చుకోవాలి? ఆయన Curiosity, Self-Learning, Innovation, Technology, Learning by Doing, Experimentation మరియు India కోసం కొత్తగా ఆలోచించే విధానం గురించి తెలుసుకోవడానికి ఈ కథనం చదవండి.
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.