ఆదివారం అసలు సిసలు మజా.. క్రికెట్ ఫెస్ట్

Publish Date:Mar 8, 2025

Advertisement

క్రికెట్ అభిమానులు ఆదివారం (మార్చి9) అసలు సిసలు మజా ఎంజాయ్ చేయబోతున్నారు. ఔను దుబాయ్ వేదికగా ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌ ఆదివారం (మార్చి 9)జరగనుంది. ఓటమనేదే తెలియకుండా సాగుతున్న టీమ్‌ఇండియా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నది. న్యూజిలాండ్‌ కూడా భారత్‌కు దీటుగా ఉంది. అయితే అన్ని విభాగాల్లో రెండు జట్లూ సమానంగా కనిపిస్తున్నా.. దుబాయ్‌లో స్పినర్లే నిర్ణయాత్మక పాత్ర పోషించబోతున్నారు. 

ఛాంపియన్స్‌ ట్రోఫీలో టీమ్‌ఇండియా అజేయగా ఫైనల్‌ చేరడంలో స్పిన్నర్ల పాత్ర అత్యంత కీలకం. బుమ్రా లాంటి మేటి ఫాస్ట్‌బౌలర్‌ లేకున్నా.. జట్టు ఆధిపత్యాన్ని ప్రదర్శించింది అంటే కారణం స్పిన్నే. గ్రూప్‌ దశలో, సెమీస్‌లో ప్రత్యర్థి బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేసిన స్పిన్‌ దళం.. భారత్‌ పనిని తేలిక చేసింది. ఆదివారం ఫైనల్లోనూ స్పిన్నే ప్రధాన అస్త్రంగా బరిలోకి దిగుతోంది. జడేజా, అక్షర్‌ పటేల్, వరుణ్‌ చక్రవర్తి, కుల్‌దీప్‌లతో టీమ్‌ఇండియా స్పిన్‌ దుర్భేద్యంగా కనిపిస్తోంది. కానీ న్యూజిలాండూ తక్కువేమీ కాదు. టోర్నీలో స్పిన్‌ వనరులలో భారత్‌కు దగ్గరగా వచ్చే జట్టేదయినా ఉందంటే అది కివీసే.  బ్రాస్‌వెల్, రచిన్‌ రవీంద్ర, గ్లెన్‌ ఫిలిప్స్‌ రూపంలో మంచి స్పిన్‌ ప్రత్యామ్నాయాలు ఆ జట్టుకున్నాయి. పిచ్‌ స్పిన్‌కు సహకరించనున్న నేపథ్యంలో రెండు జట్ల స్పిన్నర్ల మధ్య రసవత్తర పోటీ ఖాయంగా కనిపిస్తుంది. స్పిన్‌తో ప్రత్యర్థిని కట్టిపడేయడం, బ్యాటింగ్‌లో స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కోవడం మీదే మ్యాచ్‌ ఫలితం ఆధారపడి ఉంది.

భారత్‌ తిప్పేసిందిలా..

ఛాంపియన్స్‌ ట్రోఫీలో తన మ్యాచ్‌లన్నింటీనీ దుబాయ్‌లోనే ఆడిన టీమ్‌ఇండియా.. స్పిన్‌కు బాగా సహకరిస్తున్న పిచ్‌లపై అద్భుత ఫలితాలు రాబట్టింది. నలుగురు స్పిన్నర్లలో ప్రతి ఒక్కరూ జట్టు ముందంజ వేయడంలో తమదైన పాత్రను పోషించారు. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో కీలక సమయాల్లో వికెట్లను అందించడమే కాకుండా.. పరుగుల ప్రవాహానికీ కళ్లెం వేశారు. చైనామన్‌ స్పిన్నర్‌ కుల్‌దీప్‌ మినహా స్పిన్నర్లంతా ఓవర్‌కు అయిదు లోపే పరుగులివ్వడం విశేషం. కుల్‌దీప్‌ కూడా 4 మ్యాచ్‌ల్లో 5.01 ఎకానమీతో, 5 వికెట్లు పడగొట్టాడు. వరుణ్‌ 2 మ్యాచ్‌ల్లో 4.55 ఎకానమీతో 7 వికెట్లు, అక్షర్‌ 4 మ్యాచ్‌ల్లో 4.51 ఎకానమీతో 5 వికెట్లు), జడేజా 4 మ్యాచ్‌ల్లో 4.78 ఎకానమీతో4 వికెట్లతో ప్రత్యర్థి బ్యాటర్లను కట్టిపడేశారు. సీనియర్‌ స్పిన్నర్‌ జడేజా మధ్య ఓవర్లలో విశేషంగా రాణించాడు. సెమీస్‌లో బ్యాటింగ్‌ అనుకూల పిచ్‌పై ఆసీస్‌ను అతడు నిలువరించిన తీరు అద్భుతం. మరీ ముఖ్యంగా కుడిచేతి వాటం బ్యాటర్లపై అక్షర్, జడేజా ఎక్కువ ప్రభావం చూపిస్తున్నారు. ఇక ఆఖరి ఓవర్లలో కుల్‌దీప్‌పై రోహిత్‌ రాణిస్తున్నాడు. ఇక లెగ్‌స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి టోర్నీలో ఆలస్యంగా అవకాశం దక్కించుకున్నా.. తన మిస్టరీ స్పిన్‌తో బ్యాటర్లను హడలెత్తిస్తున్నాడు. రెండు మ్యాచ్‌ల్లో 4.55 ఎకానమీతో ఏడు వికెట్లు పడగొట్టాడు. వికెట్ల వేటలో దూసుకుపోతున్న అతడి నుంచి కివీస్‌కు పెను సవాలు తప్పదు. 

భారత స్పిన్నర్లలాగే న్యూజిలాండ్‌ స్పిన్నర్లు టోర్నీలో సత్తా చాటారు. గ్రూప్‌ మ్యాచ్‌లో వాళ్లను ఎదుర్కోవడంలో టీమ్‌ఇండియా విజయవంతమైనా.. ఫైనల్లో వాళ్లను తేలిగ్గా తీసుకోవడానికి వీళ్లేదు. పార్ట్‌ టైమర్‌ ఫిలిప్స్‌ తప్ప కివీస్‌ స్పిన్నర్లంతా ఓవర్‌కు అయిదు లోపే పరుగులిచ్చారు. శాంట్నర్‌  కివీస్‌ బౌలింగ్‌కు మూలస్తంబంలా నిలిచాడు. బ్రాస్‌వెల్‌, రచిన్‌ ఆకట్టుకున్నారు. స్పిన్నర్ల అద్భుత ప్రదర్శనతోనే ఇటీవల భారత్‌లో జరిగిన టెస్టు సిరీస్‌ను కివీస్‌ 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది.

By
en-us Political News

  
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.