తండ్రీ కొడుకుల సవాల్.. తెలంగాణలో కొత్త చిత్రం

Publish Date:Sep 10, 2022

Advertisement

తెలంగాణ రాజకీయాలు ఎటు పోతున్నాయి, రాష్ట్రంలో ఏమి జరుగుతోంది? ముఖ్యంగా, అధికార తెరాస పార్టీలో ఏమి జరుగుతోంది? ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు, కుటుంబంలో ఏమి జరుగుతోంది? అంతర్గతంగా అంతా బాగుందా? అంటే లేదు అనే సమాధానమే వస్తోంది. ఇటు ప్రభుత్వం  అటు పార్టీ పైకి మేడి పండులా నిగనిగ లాడుతూ కనిపిస్తున్నా, లోపలి లుకలుకలు రోజు రోజుకూ మరింతగా వికటిస్తున్నాయని అంటున్నారు.

ఒక విధంగా మాటలు లేవు మాట్లాడుకోవడాలు లేవు అన్నట్లుగా అంతర్గత లుకలుకలు భగ్గుమంటున్నాయని  అంతర్గత వేగులు అందిస్తున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. అంతే కాదు, ఇంతవరకు ప్రగతి భవన్ నాలుగు గోడల మధ్య ఎంతో కొంత గుట్టుగా, గుంభనంగా  సాగుతున్న, కల్వకుట్ల ఫ్యామిలీ డ్రామా, ఇప్పడు తెలంగాణ భవన్ కు చేరిందని, ‘ప్రగతి భవన్’ సన్నిహిత వర్గాలు  ఆధారాలతో సహా విపులంగా వివరిస్తున్నాయి.  

నిజమే, ముఖ్యమంత్రి కేసీఆర్  ఇప్పుడు కాదు, చాలా కాలంగా జాతీయ రాజకీయాల గురించి ముచ్చటిస్తూనే ఉన్నారు. వ్యూహాలు రచిస్తున్నారు.  ఉపన్యాసాలలో వినిపిస్తున్నారు. నిజానికి  2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచే ముఖ్యమంత్రి జాతీయ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు. అయితే, కేసేఆర్ జాతీయ రాజకీయ ప్రస్థానం అప్పుడూ ఇప్పుడూ కూడా  ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి అన్నట్లుగానే సాగుతోంది. 

అయితే ఇటీవల కాలంలో కేసీఆర్ సందర్భం ఏదైనా జాతీయ రాజకీయాల గురించే మాట్లాడుతున్నారు. తాజగా, నిజామాబాద్ సభలోనూ కేసీఆర్, మీరు ఊ.. అంటే చాలు జాతీయ రాజకీయాల్లోకి దూకేస్తా  అంటూ తెలంగాణ ప్రజల ఆనతి కోరారు. అంతే కాదు, 2024 ఎన్నికల తర్వాత,కేంద్రంలో వచ్చేది మన ప్రభుత్వమే అని భరోసా ఇచ్చారు. జాతీయ రాజకీయ ప్రస్థానం మొదలు పెడుతున్నా.నిజామాబాద్‌ సభ సాక్షిగా నిర్ణయం తీసుకుంటున్నా,వచ్చే ఎన్నికల తర్వాత కేంద్రంలో ఏర్పడేది మన ప్రభుత్వమే. దేశవ్యాప్తంగా రైతులకు ఉచితంగా 24 గంటల విద్యుత్తును ఇస్తాం. తెలంగాణ పథకాలన్నింటినీ అమలు చేస్తాం అని ప్రకటించారు.

జనం చప్పట్లు కొట్టారు. బై ,బై గణపతి స్టైల్లో   వీడ్కోలు పలికారు.   అదలా ఉంటే, ముఖ్యమత్రి అర్జెంటుగా, జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి పోవాలని, తెరాస జిల్లా అధ్యక్షుల సాముహికంగా చేసిన డిమాండ్ ఇప్పుడు, ముఖ్యమంత్రి జాతీయ రాజకీయ వ్యూహంలో కొత్త కోణాన్ని అవిష్కరించిందని అంటున్నారు. నిజానికి, తెలంగాణ భవన్ లో జరిగిన తెరాస జిల్లా అధ్యక్షుల సాముహిక డిమాండ్ వైనక చాలా పెద్ద రాజకీయమే ఉందని అంటున్నారు. ముఖ్యమత్రి జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళడం, ఆ వెంటనే కల్వకుట్ల తారక రామారావు .. అను నేను ... అంటూ మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఒకేసారి, ఒక దాని కొకటి సమాంతరంగా సాగుతాయని అందరూ అనుకుంటున్నదే. అందులో రహస్యం ఏమీ లేదు.

నిజానికి, 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్ళిందే అందుకని అప్పట్లోనే ప్రచారం జరిగింది. అయితే, అది జరగలేదు. ఆ కారణంగానే, సుమారు రెండు నెలలకు పైగా, మంత్రి వర్గ విస్తరణ జరగలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఉప ముఖ్యమంత్రి ముహ్మదాలీ ఇద్దరే, పరిపాలన సాగించారు.  ఇక అక్కడి నుంచి, కేటీఆర్ పట్టాభిషేకానికి ఎన్ని సార్లు సనాహాలు జరిగాయో, ఎన్ని ముహూర్తాలు మురిగి పోయాయో, లెక్కలేదు. నిజానికి ఒక దశలో, తెరాస మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు కేటీఆర్ పట్టాభిషేకం గురించి బహిరంగంగానే ప్రకటనలు చేశారు. కానీ, వినాయకుడి పెళ్ళికి అన్నీ విఘ్నాలే అన్నట్లు కేటీఆర్ పట్టాభిషేకానికి ఎప్పటి కప్పుడు  విఘ్నాలు అడ్డుపడుతున్నాయి. ఈ కారణంగానే తండ్రీ కొడుకుల మధ్య దూరం పెరిగిందని అంటున్నారు. 

ఈ నేపధ్యంలో   శుక్రవారం (ఆగస్టు9) జరిగిన తెరాస జిల్లా అధ్యక్షులు సామూహికంగా విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక ఎంతమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే జాతీయ పార్టీ పెట్టాలనే డిమాండ్ వినిపించారని అంటున్నారు. ఒక విధంగా పరోక్షంగానే అయినా  కీటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయమని జిల్లా అధ్యక్షులు ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారని అనుకోవచ్చని అంటున్నారు. నిజానికి, ఈ డిమాండ్ చేసింది జిల్లా అధ్యక్షులే అయినా చేయించింది మాత్రం, కేటీఆర్ అని పార్టీ వర్గాల్లో వినవస్తోంది.

జాతీయ పార్టీ ఏర్పాటు చేసి  కేసీఆర్ మకాం ఢిల్లీకి మారిస్తే, ఆ విధంగా అయినా కేటీఆర్ కల నిజమవుతుందని, పార్టీలో, ఫ్యామిలీలో కేటీఆర్ వర్గం భావిస్తోంది. అయితే, జాతీయ పార్టీ పెట్టినా, కేసీఆరే, ముఖ్యమంత్రిగా కొనసాగుతారనే జిల్లాల అధ్యక్షుల సామూహిక మీడియా సమావేశంలో డిమాండ్ చేయడం కొసమెరుపు. ఈ కొస మెరుపుతో, కేటీఆర్, చివరి ఆశ కూడా నీరుగారిపోయిందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. సో కేసీఆర్ కు సీఎం కావాలన్న అశ.. ఇప్పటికైతే అడియాశగానే మిగిలిపోయింది. సో కేటీఆర్ కి ముఖ్యమంత్రి యోగం లేదని, కనీసం ఈ సారికి అయితే, ఆ అవకాశం లేనట్లే అంటున్నారు. అయితే, దేశ, రాష్ట్ర రాజకీయాలు చకచకా మారిపోతున్న నేపధ్యంలో రేపు ఏమైనా జరగవచ్చని, అంటున్నారు. స్టాలిన్ ముఖ్యమంత్రి అయ్యేందుకు 60 ఏళ్ళు దాటినా ఓపిగ్గా ఎదురు చూశారు, అఖిలేష్ యాదవ్ తండ్రి ములాయం సింగ్ యాదవ్ ను పక్కకు నెట్టి 40లలోనే ముఖ్యమంత్రి అయ్యారు... ఎవరి ఆలోచనలు వారివి ... ఎవరి పంథా వారిది .. రేపు ఏమి జరుగుతుందో ... ఎవరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో .. ఎవరికి తెలుసు..అంటున్నారు.

By
en-us Political News

  
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఆ సమయంలో తాను కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తుండగా, గ్యానేష్ కుమార్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో ఉన్నతాధికారిగా సేవలందిస్తున్నారని గుర్తుచేశారు. ప్రయాణ సమయంలో తన రిటైర్మెంట్ అనంతర ప్రణాళికల గురించి  ఆరా తీసిన జ్ణానేష్ కుమార్‌.. ఆ సందర్భంలోనే బీజేపీ తరఫున పతనం తిట్ట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని సూచించారన్నారు. 
ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల ఫలితాలు,  ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు విజయంపై ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బరిలోకి దిగడంతో సమీకరణాలు ఏ విధంగా మారతాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
ప్పటి వరకూ మోడీ సర్కార్ ఘనంగా చెప్పుకుంటూ వచ్చిన పారదర్శకత ప్రశ్నార్థకమైంది.  రాజ్యాంగ వ్యవస్థలు బలహీనపడ్డాయన్న వాదనకు బలం చేకూరింది. అంత వరకూ విపక్షాలు చేసే విమర్శలను సునాయాసంగా తిప్పికొట్టి పై చేయి సాధించిన మోడీ సర్కార్ నీటి విషయంలో సమాధానం చెప్పుకోలేక తడబడింది. వెనకడుగు వేసింది. 
ఎంతటి సంక్షోభాన్నైనా సంయమనం కోల్పోకుండా అధిగమించడం, ఆ సంక్షోభాన్నే అవకాశంగా మలచుకుని ముందుకు సాగడం ఆయన నైజం. ఎంతటి క్షిష్టమైన సమస్యనైనా  పరిష్కరించగలిగే నేర్పు, ఎంతటి సంక్షోభాన్నైనా తట్టుకునిముందుకు సాగే సామర్ధ్యం కారణంగానే ఆయనకు పొలిటికల్ సర్కిల్స్ లొ  క్రైసిస్ మ్యాన్ అన్న గుర్తింపు వచ్చింది. 
వ్యవసాయ రంగానికి పెద్దపీఠ వేసేలా చంద్రబాబు  35 వేలకోట్ల రూపాయల అంచనాతో  సాగునీటి రోడ్‌మ్యాప్‌ను ప్రకటించారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 36 సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాకుండా..  దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో  ఇరిగేషన్ అండ్ వాటర్ క్యాలెండర్ ను అందుబాటులోకి తెచ్చారు.
ఎన్నికలు రిగ్గింగ్ అవుతున్నాయని తెలిసినా, ప్రతిపక్షాలు మళ్లీ అవే ఎన్నికల్లో పాల్గొంటూ ఆ పద్ధతికి చట్టబద్ధత ఎందుకు కల్పిస్తున్నాయని ప్రశ్నించి సంచలనం సృష్టించారు.  ఓట్లు చోరీకి గురవుతున్నా, ఎమ్మెల్యేలు, ఎంపీలు కొనుగోలుకు గురవుతున్నా, పార్టీలు చీలిపోతున్నా కేవలం ఉనికి కోసమే పోరాడుతున్నారా అని నిలదీశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.