మళ్లీ తెరపైకి సమైక్యాంధ్రప్రదేశ్?

Publish Date:Jul 20, 2022

Advertisement

రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్- తెలంగాణ మళ్లీ కలిసిపోనున్నాయా? లేదా? మరో పదేళ్ల పాటు ఇరు రాష్ట్రాల ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ నే ఉంచుతారా? విభజనతో అన్ని విధాలా నష్టపోయిందని, పీకి అన్యాయం జరిగిందని ఇప్పటికే పలుమార్లు చెప్పిన ప్రధాని మోడీ తలచుకుంటే ఏపీ- తెలంగాణ రాష్ట్రాలను కలిపేయడం పెద్ద కష్టమేమీ కాబోదంటున్నారు

పరిశీలకులు. కాదంటే హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలనే యోచన కూడా ఉండి ఉండొచ్చని కూడా  చెబుతున్నారు. ఈ మేరకు మోడీ స్కెచ్ వేశారని, అందులో భాగంగానే ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మంగళవారం ‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్’ ‘హైదరాబాద్ రాజధాని’ వ్యాఖ్యలు చేశారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. విభజన తర్వాత రాజధాని హైదరాబాద్ తెలంగాణకు వెళ్లిపోయిందని, దాంతో ఏపీకి రావాల్సిన ఆదాయం తగ్గిపోయిందని, హైదరాబాద్ ను మళ్లీ పూర్వం మాదిరిగా ఏపీకి కలిపేయమని అడిగితే ఎలా ఉంటుందని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు? అలా ఐతే హైదరాబాద్ ను ఏపీలో కలిపేయమనండి.. తప్పులేదు అంటున్నారాయన.

రాష్ట్ర విభజనను రద్దు చేసి, రెండు తెలుగు రాష్ట్రాలను మళ్లీ పూర్వంలాగే సమైక్యంగా మార్చేయండి   అభ్యంతరం లేదు అని బొత్స మంగళవారం ఒక సందర్భంలో అన్నారు.   మాట్లాడిన సందర్భం ఏదైనా  ఏపీ మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలోనూ విస్తృతంగా చర్చ జరుగుతోంది.  దక్షిణ భారతదేశంలో బీజేపీ ఉనికి కేవలం కర్ణాటక రాష్ట్రంలో మాత్రమే కనిపిస్తోంది. ఉత్తరాదిలో అత్యధిక రాష్ట్రాల్లో అధికారం చెలాయిస్తున్న బీజేపీ దక్షిణాదిలో కూడా పాగా వేయాలని అనేక యత్నాలు చేస్తూ వస్తోంది.

అయితే అవేమీ పెద్దగా ఫలిస్తున్న సూచనలు కనిపించడం లేదు.   ముందుగా తెలంగాణపై కన్నేసిన కమలదళం పలు రకాల ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధాని మోడీ పైన, కేంద్రంలో మోడీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ పైనా తీవ్ర స్థాయి విమర్శలతో చెలరేగిపోతున్నారు. కేంద్రంలో బీజేపీ రహిత పరిపాలనకు బాటలు వేయాలంటూ విపక్షాలను కూడగట్టే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నారు.  

ఈ నేపథ్యంలోనే విభజన సమయంలో ఏపీకి నష్టం జరిగిందని  ప్రధాని మోడీ కొన్నిసార్లు స్వయంగా చెప్పడం గమనార్హం. దీంతో కేసీఆర్ స్పీడుకు, టీఆర్ఎస్ దూకుడుకు కళ్లెం వేయాలనే వ్యూహాలు మోడీ రచిస్తున్నారనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తం  అయ్యాయి. రాజధాని నగరంలేని ఏపీకి హైదరాబాద్ నే మరో పదేళ్ల పాటు రాజధానిగా కొనసాగించాలనే యోచన ఇందులో భాగమేనంటున్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ఇచ్చిన హామీ ప్రత్యేక హోదా ఇప్పుడు ‘ముగిసిన అధ్యాయం’ అని కేంద్రం పార్లమెంట్ లో తాజాగా మరో మారు స్పష్టం చేయడంఈ సందర్భంగా  గమనార్హం. ప్రత్యేక హోదా ఇవ్వనందువల్ల ఆర్థికంగా నష్టపోతున్న ఏపీకి కొంత వెసులుబాటు కల్పించాలని, లేదా తెలంగాణతో మళ్లీ కలపడం ద్వారా మేలు చేయాలనే ఆలోచన కూడా కేంద్రం పెద్దల్లో, ముఖ్యంగా ప్రధాని మోడీలో ఉందంటున్నారు.

రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా? అన్నట్లు ప్రధాని మోడీ తలుచుకుంటే.. తెలుగు రాష్ట్రాలను మళ్లీ విలీనం చేయొచ్చని, లేదా హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా ప్రకటించి, ఆదాయంలో భాగం పంచవచ్చని,  అదీ కాకపోతే హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేసి తెలంగాణలో కేసీఆర్ ను బలహీనం చేయడం, అదే సమయంలో ఏపీలో బలం పెంచుకునే అవకాశం కల్పించుకోవడం అన్న యోచనతో మోడీ తన వ్యూహాలకు పదును పెడుతున్నారన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.   మోడీ స్కెచ్ లో భాగమే  ఏపీ మంత్రి బొత్స   ఉమ్మడి రాజధాని, ఇరు రాష్ట్రాల విలీనం అంశాలను ప్రస్తావించారని పరిశీలకులు భావిస్తున్నారు.

By
en-us Political News

  
రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కౌశిక్ రెడ్డి ఒక ఛాలెంజ్ విసిరారు. కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీటిని వెంటనే ఎత్తిపోయాలని, ఆ నీటిని అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మీదుగా ఎల్లంపల్లికి తరలించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఆ విధంగా నీటిని ఎత్తిపోసే ప్రక్రియలో అన్నారం లేదా సుందిళ్ల బ్యారేజీలకు ఏవైనా నష్టాలు లేదా ప్రమాదాలు జరిగితే, దానికి పూర్తి బాధ్యత తమదేనన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్.. ముద్రగడ సమాజానికి చేసిన సేవలను గుర్తించి ఈ గౌరవాన్ని కల్పించాలని నిర్ణయించారు. ఈ మేరకు అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షించాలని, అన్ని రకాల ప్రభుత్వ మర్యాదలు లోటు లేకుండా చూడాలని ఉన్నతాధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
ల్పపీడన ప్రభావంతో జులై మూడో వారంలో దేశవ్యాప్తంగా వర్షాలు మళ్లీ ఊపందుకోనున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు మధ్య భారతదేశం, తూర్పు రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది.
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సాగుతున్న ఈ వినూత్న నిరసన ప్రదర్శనలకు మెల్లిమెల్లిగా జనం ముఖం చాటేస్తున్నారు. పరీక్షల అవకతవకలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా డిమాండ్‌తో ప్రారంభమైన కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం.. ఆరంభంలో లక్షలాది మంది యువతను ఆకర్షించింది. అయితే క్రమక్రమంగా జనాదరణ కోల్పోయి ఇప్పుడు జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ఆ పార్టీ నిరసనలు తూతూ మంత్రంగా మారాయి.
ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలల్లో స్థానిక ఎన్నికల జరిగే అవకాశం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ ఇప్పటికే తమ పార్టీ శ్రేణులకు సమాచారం అందించారు. ఈ క్రమంలోనే ఎన్నికల వ్యూహాలను పక్కాగా అమలు చేయడానికి కూటమి పార్టీల ముఖ్య నేతల కీలక సమావేశం బుధవారం జరగనుంది.
హరీష్ రావు ఇప్పుడు తన కుటుంబ వ్యాపారమైన మిల్చీ మిల్క్  విషయంలో తలెత్తుతున్న ప్రశ్నలకు, వెల్లువెత్తుతున్న విమర్శలకూ సమాధానం చెప్పుకోలేక సతమతమౌతున్నారు.
విజయ్ ప్రస్తుతం చెన్నై ఈస్ట్ కోస్ట్ రోడ్డు (ఈసీఆర్) లోని నీలాంకరి నివాసంలో ఉంటున్నారు. అక్కడి నుంచి ఆయన సచివాలయం ఉన్న రాజాజీ రోడ్డుకు రోజువారీ ప్రయాణం చేస్తున్నారు.
భౌగోళికంగా, రాజకీయంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు వేర్వేరు రాష్ట్రాలుగా విడిపోయినా, భాష, సంస్కృతి పరంగా తెలుగు ప్రజల మధ్య బంధం విడదీయరానిదని అన్నారు. తెలుగు సినిమా రంగానికి ప్రజలను ఏకం చేసే అద్భుతమైన శక్తి ఉందంటూ ఆమె వ్యాఖ్యానించారు.
తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో ఆదివారం నిర్వహించిన టీడీపీ తంబళ్లపల్లె నియోజకవర్గ నేతల సమావేశం ఉద్రిక్తంగా మారింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలు ప్రస్తుతం అత్యంత ఆసక్తికరమైన మలుపు తిరిగాయి.
తెలంగాణ రక్షణ సేన పార్టీకి గుర్తింపు ఇవ్వాలని పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కోరారు.
సీఎం అవినీతి బండారం మొత్తం బయటపడిందన్న కేటీఆర్ కాంగ్రెస్ సర్కార్ తీరు పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రజా రంజక పాలనను పూర్తిగా గాలికొదిలేసి కేవలం ప్రతిపక్షాలపై నిందలు వేయడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.