ఐటీ నుంచి ఏఐ వరకు.. నారా లోకేష్ ట్రాన్స్‌ఫార్మేషన్!

Publish Date:Jun 23, 2026

Advertisement

పనితీరుని చూడలేని కబోది నాయకుల విమర్శల నుండి ఎదిగిన పరిణితి   నారా లోకేష్.  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నారా లోకేష్ ప్రస్థానం ఒక అద్భుతం. ఒకప్పుడు   చంద్రబాబు నాయుడు కుమారుడిగా, ఐటీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న నేతగా మాత్రమే గుర్తింపు ఉన్న యువకుడు నారా లోకేష్.  అదే నారా లోకేష్ ఇప్పుడు   ప్రజా క్షేత్రంలో తిరుగులేని నాయకుడిగా ట్రాన్స్ ఫార్మ్ అయ్యారు.  ప్రజా సమస్యల పరిష్కారం నుంచి  రాష్ట్రాన్ని పారిశ్రామికంగా, విద్యా పరంగా దేశంలోనే నంబర్ వన్ గా నిలిపే విషయంలో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న విధానాలు, అదే సమయంలో రాజకీయ ప్రత్యర్థుల విమర్శలకుర దీటుగా ఇస్తున్న కౌంటర్లు.. ఆయనలోని పరిణితికి అద్దం పడుతున్నాయి.

అదే సమయంలో జాతీయ మీడియాకు ఇస్తున్న ఇంటర్వ్యూలో ఆయన ప్రదర్శిస్తున్న పరిణితి అందరినీ విస్మయ పరుస్తోంది.  జాతీయ మీడియా అడిగిన ప్రశ్నలకు ఇసుమంతైనా తడబాటు లేకుండా స్పాంటేనియస్ గా ఇస్తున్న సమాధానాలు, గణాంకాలతో సహితంగా ఆయన చెబుతున్న వివరాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఐటీ నుంచి  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్  వరకు ఆంధ్రప్రదేశ్‌ను ఎలా నడిపించబోతున్నారో ఇటీవల ఒక జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో లోకేష్ వివరిం వివరించిన తీరు ఆయన పొలిటికల్ ట్రాన్స్‌ఫార్మేషన్‌ను కళ్ళకు కట్టింది.  లోకేష్ విజన్‌కు దిగ్గజ నేతలు సైతం ఫిదా అవుతున్నారు.  

అయితే నారా లోకేష్ లోని  మార్పు ఒక్క రోజులో వచ్చింది కాదు. 2019 మంగళగిరి ఎన్నికల ఓటమి లోకేష్‌ను   రాటుదేల్చింది. కేవలం 5,337 ఓట్ల  తేడాతో ఓడిపోయిన ఆయన..కుంగిపోలేదు..  వెనకడుగు వేయలేదు. అదే మంగళగిరిని తన స్థావరంగా మార్చుకుని ప్రజా సమస్యలపై పోరాడారు. ఆ తర్వాత ఆయన చేపట్టిన 400 రోజుల  యువగళం పాదయాత్ర లోకేష్ రాజకీయ భవిష్యత్తును పూర్తిగా మార్చేసింది. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు సుమారు నాలుగువేల కిలోమీటర్ల మేర సాగిన ఈ యాత్రలో ఆయన ప్రజలతో మమేకమయ్యారు. ఫలితంగా 2024 ఎన్నికల్లో మంగళగిరిలో  91,413 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించి..  గత 39 ఏళ్లుగా అక్కడ గెలుపు అన్నదే ఎరుగని తెలుగుదేశం పార్టీకి అద్భుత విజయాన్ని అందించారు. 

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్, మానవ వనరుల అభివృద్ధి , రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖల మంత్రిగా లోకేష్ సరికొత్త పాలనా విధానాన్ని ప్రవేశపెడుతున్నారు. కేవలం  ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' మాత్రమే కాకుండా..  'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను తమ ప్రభుత్వ పాలసీగా మార్చేశారు. ఇందుకు ఉదాహరణగా పుట్టపర్తిలో ఏఎంసీఏ   ప్రాజెక్ట్ కోసం కేవలం 37 రోజుల్లోనే భూసేకరణ పూర్తి చేయడాన్ని చెప్పుకోవచ్చు. గూగుల్ వంటి దిగ్గజ సంస్థల ప్రాజెక్టులను వేగంగా ఆకర్షిస్తూ, రాష్ట్రంలోకి పెట్టుబడుల వరద పారించేలా ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగుతున్నారు. 

రాష్ట్ర అభివృద్ధి కోసం ఇప్పటికే ఏకంగా 24 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి ప్రతిపాదనలను సాధించామని, వాటిని త్వరితగతిన కార్యరూపంలోకి తీసుకురావడమే తమ లక్ష్యమని లోకేష్ గణంకాలతో సహా  జాతీయ మీడియా ముందు ఆవిష్కరించిన తీరు ఆయనకు  ప్రత్యర్థుల నుంచి సైతం ప్రశంసలు దక్కేలా చేసింది.  2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే భారీ లక్ష్యాన్ని  నిర్దేశించుకున్నట్లు చెప్పిన నారా లోకేష్..  గతంలో హైదరాబాద్ ఐటీ రంగాన్ని ఎలా నిర్మించామో, అంతకంటే మెరుగైన ఫలితాలను విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్‌లో కేవలం 10 ఏళ్లలోనే సాధించి చూపిస్తామని లోకేష్ ధీమాగా చెబుతున్నారు. డిజిటల్ టెక్నాలజీ, లైవ్ డేటా ఫీడ్స్, రియల్ టైమ్ డ్యాష్‌బోర్డుల ద్వారా రికార్డు స్థాయిలో 52 లక్షల  మందిని తెలుగుదేశం సభ్యులుగా చేర్పించిన లోకేష్  ఇప్పుడు అదే సాంకేతికతను ఏపీ అభివృద్ధికి సమర్థంగా వాడుతున్నారు. నారా లోకేష్ ఈ పొలిటికల్ ట్రాన్స్‌ఫార్మేషనే ఆయనను ప్రజా నాయకుడిగా అందరూ గుర్తించేలా చేస్తోంది. 

By
en-us Political News

  
అమర రాజా వంటి గ్లోబల్ టెక్నాలజీ సంస్థ వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఏపీలో కాకుండా పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో పెట్టడం ఆంధ్రప్రదేశ్ ఒక గోల్డెన్ ఆపర్చునిటీని చేజార్చుకోవడమేనని ప్రముఖ విశ్లేషకుడు సువేరా అన్నారు. తెలుగువన్ న్యూస్ చానల్ తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన రాజకీయం, కులం, ప్రాంతీయ విద్వేషాల కారణాలతో ఇటువంటి పారిశ్రామిక దిగ్గజం రాష్ట్రం వీడాల్సి రావడం వల్ల యువతకు రావలసిన ఉపాధి అవకాశాలు చేజారిపోయాయన్నారు.
ఆ నక్కల కారణంగానే తాను తన మార్గాన్ని ఎంచుకుని బయటకు రావాల్సి వచ్చిందని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీలోని తన మాజీ సహచరులపై తీవ్ర విమర్శలు గుప్పించిన కవిత.. బీఆర్ఎస్‌లోని కొందరు గుంటనక్కల వంటి నేతల బృందం తనను ఒంటరిని చేసి, పక్కన పెట్టడానికి పద్ధతి ప్రకారం పనిచేశారని కవిత చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియ అత్యంత కీలకమైన మలుపుగా మారబోతోంది.
దేశ రాజధాని ఢిల్లీలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు అత్యంత ఉత్కంఠభరిత వాతావరణంలో ప్రారంభం కానున్నాయి.
శాంతిభద్రతల విఘాతం కలగకుండా ఉండేందుకు భద్రతను కట్టుదిట్టం చేశారు. ముందస్తు భద్రతా వ్యూహంలో భాగంగా సెంట్రల్ ఢిల్లీని దాదాపు తమ అధీనంలోకి తీసుకున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ ఈ చలో పార్లమెంట్ కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు.
తెలంగాణ రాజకీయాల్లో తనదైన విలక్షణ శైలితో నిత్యం వార్తల్లో నిలిచే బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేసినట్లేనా.. అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. గత కొంతకాలంగా ఆయన కారు దిగిపోనున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక వీడియో ఆ ప్రచారానికి బలం చేకూర్చింది. సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తున్న వేదికపై ఎమ్మెల్యే మల్లారెడ్డి కూడా ఉన్నారు. ఆ వేదికపై ప్రసంగిస్తున్న రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై విమర్శలు గుప్పిస్తున్నా.. మల్లారెడ్డి పట్టించుకోకుండా చిరునవ్వులు చిందిస్తూ ప్రశాంతంగా కూర్చుని ఉన్నారు. సొంత పార్టీ అధినేతను అంతగా విమర్శిస్తున్నా మల్లారెడ్డిలో స్పందన లేకపోవడంతో ఆయన కారు దేగేయడం ఖాయమన్న ప్రచారానికి బలం చేకూర్చింది. అలాగే ఇటీవలే.. ఆయన ఒక ప్రైవేటు కార్యక్రమంలో కూడా తాను బీఆర్ఎస్ ను వీడనున్నట్లు సంకేతాలిచ్చారు. వాస్తవానికి.. గత ఎన్నికలలో పరాజయం పాలై బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన నాటి నుంచీ కూడా మల్లారెడ్డి పొలిటికల్ గా ఒకింత ఇనాక్టివ్ అయ్యారనే చెప్పారు. చాలా కాలంగా మల్లారెడ్డి అధికార కాంగ్రెస్ లేదా కమలం గూటికి చేరే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా తన వ్యాపార, విద్యారంగ సంస్థల పరిరక్షణతో పాటు నియోజకవర్గంలో రాజకీయ ఉనికి కోసం ఆయన అధికార పార్టీతో సత్సంబంధాల కోసం ప్రయత్నిస్తున్నారని రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది. ఒకప్పుడు రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించిన చామకూర మల్లారెడ్డి.. ఇప్పుడు ఆయన ప్రసంగిస్తున్న వేదికపై కనిపించడం పట్ల కమలం శ్రేణుల్లో కూడా ఆగ్రహం వ్యక్తమౌతోంది. మొత్తం మీద మల్లారెడ్డి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పడం ఖాయమన్న అభిప్రాయం రాజకీయవర్గాలలో వ్యక్తం అవుతోంది. అయితే ఆయన కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకుంటారా? కాషాయ తీర్థం పుచ్చుకుంటారా అన్న విషయంపై అయితే రాజకీయవర్గాలలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇప్పటికే అనేకమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కీలక నేతలు హస్తం గూటికి చేరిన నేపథ్యంలో, మల్లారెడ్డి కూడా అదే బాట పడతారన్న అభిప్రాయమే పరిశీలకులలో కూడా వ్యక్తమౌతోంది. chamakura malla reddy latest news, medchal mla malla reddy, telangana political updates
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంపై కాంగ్రెస్ పార్టీ కీలక సమీక్ష నిర్వహించింది.
తెలంగాణ భారతీయ జనతా పార్టీల్లో ఒక్కసారిగా పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
మంగళగిరిలో వంద పడకల ఆసుపత్రి, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వంటి ఎన్నో పనులను కేంద్ర ప్రభుత్వ నిధుల భాగస్వామ్యంతో పూర్తి చేస్తున్నట్లు వివరించారు.
వైసీపీ హయాంలో రాష్ట్రానికి వచ్చిన ఒక్క పెద్ద పరిశ్రమ కూడా రాకపోగా, ఉన్న ఉపాధి వనరులను పొరుగు రాష్ట్రాలకు తరిమేశారని సువేరా మండిపడ్డారు. అమరరాజా, లూలూ గ్రూప్, జాకీ వంటి దిగ్గజ సంస్థలను కక్షపూరిత రాజకీయాలు, ఆర్థిక వేధింపులతో రాష్ట్రం సరిహద్దులు దాటించారని విమర్శించారు.
రమణమూర్తి గతంలో తిరుమలలో అన్నమయ్య నివాసాన్ని తొలగించినప్పుడు జరిగిన ఆందోళనల్లో చురుగ్గా పాల్గొన్నారనీ, చినజీయర్ స్వామి వంటి ప్రముఖులతో కలిసి హిందూ ధర్మ ప్రచారంలో నడిచిన చరిత్ర రమణమూర్తిది అని భరద్వాజ చెప్పారు. అయితే, హిందూ మతం వేరు, రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునే హిందుత్వ వేరు అంటూ రమణమార్తి ఇటీవల పలు సందర్భాలలో తన అభిప్రాయాలు వ్యక్తం చేశారన్న భరద్వాజ.. ఈ నేపథ్యంలోనే ఆయన గొంతు నొక్కడానికి పక్కా ప్రణాళికతోనే ఈ దాడి జరిగిందని చెప్పారు.
ముంబై కోకిలాబెన్ అంబానీ ఆస్పత్రిలో సర్జరీ తరువాత కోలుకున్న జగన్ తొలి పర్యటనకు తన సొంత నియోజకవర్గం పిఠాపురాన్ని ఎంచుకోవడం రాజకీయంా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇలా ఉండగా పవన్ రాక సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు జనసేన నాయకులు, శ్రేణులు భారీ ఏర్పాటు చేశారు.
కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు ఉప ప్రధాని పదవిని ఎవరికీ కేటాయించలేదు. అయితే త్వరలో జరగబోయే క్యాబినెట్ విస్తరణలో ఈ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారంటూ విజయసాయి చెప్పిన జోస్యం ఇప్పుడు రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.