Publish Date:Jan 17, 2025
గురు శిష్యులుగా రాజకీయాలలో గుర్తింపు పొందిన ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబునాయుడు, రేవంత్ రెడ్డి దావోస్ వేదికగా తమతమ రాష్ట్రాలకు పెట్టుబడులను ఆకర్షించడానికి పోటీ పడనున్నారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ 2025కి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు. వీరిద్దరు తమ తమ రాష్ట్రాలకు పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించేందుకు మంత్రులు, అధికారుల బృందంతో బయలుదేరుతున్నారు. ఈ పెట్టుబడుల ఆకర్షణ పోటీలో ఎవరు పై చేయి సాధిస్తారన్న దానిపై సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ నెలకొంది. తమతమ రాష్ట్రాలకు పెట్టుబడులను ఆకర్షించే విషయంలో ఇరువురికీ సమానంగా సానుకూల, ప్రతికూల అంశాలు ఉన్నాయి.
చంద్రబాబు నాయుడు ఈ విషయంలోఅపారమైన అనుభవం ఉంది. గతంలో పలు మార్లు చంద్రబాబు వరల్డ్ ఎకనామిక్ ఫోరం కు హాజరయ్యారు. అభివృద్ధి, దార్శనికతలో చంద్రబాబు ట్రాక్ రికార్డ్ అమోఘంగా ఉంది. ఈ కారణంానే ఆయన ప్రధాన పెట్టుబడిదారులకు సుపరిచితుడు. ఆయన పారిశ్రామిక అనుకూల విధానాల కారణంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2025లో ఆయన పెట్టుబడిదారులను ఆకర్షించి ఏపీకి పెట్టుబడులను సాధించడం నల్లేరు మీద బండి నడకే అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. అయితే అదే సమయంలో ఒకింత ప్రతికేలతను కూడా ఆయన ఎదుర్కోనే అవకాశం ఉంది. అదేంటంటే గత ఐదేళ్ల జగన్ పాలన కారణంగా బ్రాండ్ ఏపీ ఇమేజ్ దారుణంగా దెబ్బతింది. మరో సారి జగన్ పాలన రాదన్న గ్యారంటీ ఇవ్వగలరా అన్న ప్రశ్న పెట్టుబడి దారుల నుంచి ఆయనకు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే పలువురు తమను అలా ప్రశ్నిస్తున్నారంటూ మంత్రి లోకేష్ చెప్పారు.
ఇక రేవంత్ రెడ్డి విషయానికి వస్తే.. హైదరాబాద్ ఆయనకు ఓ పెద్ద సానుకూలాంశం. ఇక్కడ పెట్టుబడుల కోసం పెద్ద ప్రయత్నించాల్సిన అవసరం లేకుండానే పెట్టుబడిదారులు, పారిశ్రామిక వేత్తలు తరలి వస్తారు. అందుకు అవసరమైన పూర్తి ఇన్ ఫ్రా స్ట్రక్చర్ ఉంది. ఇక ప్రతి కూలాంశం విషయానికి వస్తే రేవంత్ తొలి సారి ముఖ్యమంత్రి. ఆయన అధికార పగ్గాలు చేపట్టి ఏడాది మాత్రమే అయ్యింది. అలాగే రేవంత్ రెడ్డికి పెట్టుబడులను ఆకర్షించడంలో ఆసక్తిగానీ, నేర్పు ఉన్న దాఖలాలు ఇంత వరకూ అయితే పెద్దగా కనిపించలేదు. మొత్తం మీద ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల దావోస్ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. పెట్టుబడుల ఆకర్షణలో ఎవరు పై చేయి సాధిస్తారో చూడాల్సి ఉంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/cbn-versus-revanth-in-davoos-39-191416.html
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద, పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.