Publish Date:Nov 21, 2024
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దార్శనికత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన ఏ పని చేసినా అందులో ముందు చూపు, భవిష్యత్ దర్శనం ఉంటాయి. ఆధునిక సాంకేతికతను ప్రజాప్రయోజనాలకు అనుగుణంగా వినియోగించుకుని సత్ఫలితాలు సాధించడం ఆయన ప్రత్యేకత. అయితే ఆయన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను, వాటి ద్వారా ప్రజలకు చేకూరిన లబ్ధి, ప్రయోజనాలను జనాలకు వివరించి చెప్పేందుకు ఇప్పటి వరకూ ఆయన పెద్దగా ఆసక్తి చూపలేదు.
ప్రజా సమస్యలను నేరుగా వారి నుంచే తెలుసుకోవడం కోసం చంద్రబాబు డయల్ యువర్ సీఎం అనే కార్యక్రమం ద్వారా 1995లోనే శ్రీకారం చుట్టారు. ఆ ప్రేరణ, స్ఫూర్తితోనే ప్రధాని మోడీ మన్ కీ బాత్ కార్యక్రమం ప్రారంభించారని చెప్పవచ్చు. సరే ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు చంద్రబాబు మరో సారి ప్రజల నుంచి నేరుగా వారి సమస్యలను తెలుసుకోవడానిక వినూత్నంగా వారితో ముఖాముఖీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆధునిక సాంకేతికతను జోడించి డయల్ యువర్ సీఎం, ప్రధాని మన్ కీ బాత్ ల మేలు కలయికగా, వాటి అప్ డేటెట్ వెర్షన్ గా చంద్రబాబు నేరుగా ప్రజలతో మాట్లేడే విధంగా మీతో మీ చంద్రబాబు అనే కార్యక్రమం రూపొం దుతోంది. అసెంబ్లీ వేదికగా బుధవారం ఈ విషయాన్ని చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. ఈ కార్యక్రమం సంక్రాంతి నుంచి ఆరంభయమ్యే అవకాశాలున్నాయంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/cbn-to-intract-directly-with-people-25-188724.html
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.
వైద్యశాస్త్ర రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా భావించే నోబెల్ బహుమతి ప్రకటన వెలువడింది.
ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్
చేతిలో రూ.3 లక్షలు.. ఇప్పుడు రూ.100 కోట్ల బిజినెస్.!
కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్ ప్రణాళికల్లో కీలక మార్పులు.. .!
కొందరు దుండగులు ఏకంగా జ్యువెలరీ షాప్‌నే టార్గెట్ చేశారు.
తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా అద్వైత్ కుమార్ సింగ్ ఐఏఎస్ పూర్తి అదనపు బాధ్యతలు (FAC) స్వీకరించారు