మంచితనం ఒక్కటే చాలదు బాబూ.. కాఠిన్యమూ ఉండాలి!

Publish Date:Jul 22, 2024

Advertisement

రాజ్యాన్ని పాలించే రాజుకు మంచిత‌నం మాత్ర‌మే ఉంటే స‌రిపోదు.. ఎప్పుడూ ప్ర‌జ‌ల అభివృద్ధికోసం ఆలోచించ‌డ‌మే కాదు.. రాజ్యంపై దండెత్తే ప్ర‌త్య‌ర్థులపైనా, దోపిడీ దారుల‌పైనా కఠినంగానూ ఉండాలి. అప్పుడే రాజ్యంలోని ప్ర‌జ‌లు ఎలాంటి భ‌యాలు లేకుండా సంతోషంగా జీవ‌నం సాగిస్తారు. వ్యాపారాలు అభివృద్ధి చెంది ఆ రాజ్యం ఆర్థికంగానూ బ‌లోపేతం అవుతుంది. ఆ సూత్రాన్ని ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు  పట్టించుకున్నట్లు లేదు. ఫ‌లితంగా ప్ర‌తిప‌క్ష హోదా సైతం కోల్పోయిన వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, ఆయ‌న అనుచ‌రులు రెచ్చిపోతున్నారు. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చి రెండు నెల‌లు కూడా పూర్తి కాక‌ముందే.. రాష్ట్రం మొత్తం అల్ల‌క‌ల్లోలం అవుతోందనీ.. శాంతిభ‌ద్ర‌త‌లు క్షీణించాయనీ వైసీపీ నేత‌లు త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నారు. త‌మ‌కు ఇష్ట‌మొచ్చిన‌ట్లు ప్ర‌వ‌ర్తిస్తూ.. అడ్డుకునేందుకు ప్ర‌య‌త్నించిన పోలీసుల‌కు సైతం వార్నింగ్ లు ఇస్తున్నారు. రాష్ట్రంలో జ‌గ‌న్‌, వైసీపీ నేత‌ల ప్ర‌వ‌ర్త‌న చూస్తున్న ప్ర‌జ‌లు ఏపీలో అధికారంలో ఉంది వైసీపీనా, తెలుగుదేశం కూట‌మి ప్ర‌భుత్వ‌మా అనే అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. దీనంత‌టికి చంద్ర‌బాబు నాయుడు మంచితనమే కార‌ణ‌మ‌ని కొంద‌రు తెలుగుదేశం నేత‌లు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే శాంతి భ‌ద్ర‌త‌లు, అభివృద్ధే ముఖ్యంకాదు.. త‌ప్పుడు ప్ర‌చారం చేసే ప్ర‌తిప‌క్ష పార్టీ నేత‌ల‌పై కొర‌డా ఝుళిపించి వారిని అదుపులో పెట్టాల్సిన అవ‌స‌రం కూడా ఉంటుంద‌ని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

 గ‌త ఐదేళ్ల జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాల‌న‌లో క‌క్ష‌పూరిత రాజ‌కీయాల‌తో ప్ర‌జ‌లు వ‌ణికిపోయారు. ప్ర‌భుత్వ ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌ను ప్ర‌శ్నించిన వారిపై అక్ర‌మ కేసులుపెట్టి జైళ్ల‌కు పంపించారు. ఫ‌లితంగా రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లు క్షీణించాయి. రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెట్టేందుకు  వ్యాపార‌ వేత్త‌లు వెనుక‌డుగు వేశారు. ఏపీ ఆర్థికంగా తీవ్రంగా దెబ్బ‌తింది. ఐదేళ్ల కాలంలో రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగాఅడుగంటి పోయింది.   అప్పుల‌తోనే ఐదేళ్లు రాష్ట్రాన్ని జ‌గ‌న్ న‌డిపిస్తూ వ‌చ్చారు. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత సీఎం చంద్ర‌బాబు నాయుడు రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేయ‌డంపై దృష్టి పెట్టారు. పాల‌నాప‌రంగా సుదీర్ఘ అనుభ‌వం క‌లిగిన చంద్ర‌బాబు.. తొలుత‌ రాష్ట్రంలో ప్ర‌శాంత వాతావ‌ర‌ణం నెల‌కొల్పేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఘ‌ర్ష‌ణ‌లకు, దౌర్జ‌న్యాల‌కు పాల్ప‌డితే వైసీపీ, టీడీపీ, జ‌నసేన పార్టీ నేత‌లు అనే తేడాలేకుండా కేసులు న‌మోదు చేస్తున్నారు.  రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌త‌లు అదుపులో ఉండేలా కూట‌మి ప్ర‌భుత్వం చర్యలు తీసుకుంటుంది. మ‌రోవైపు అభివృద్ధి ప‌నుల్లో వేగం పెంచారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల‌పై దృష్టి సారించారు. మొత్తంగా చెప్పాలంటే కూట‌మి ప్ర‌భుత్వం 50రోజుల పాల‌న‌లో ప్ర‌జ‌లు ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో జీవ‌నం సాగిస్తున్నారు. ఇది జీర్ణించుకోలేని వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, ఆ పార్టీ నేత‌లు రాష్ట్రంలో అల్ల‌ర్లు సృష్టించేలా రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు చేస్తున్నారు. రాష్ట్రంలో వ్య‌క్తుల మ‌ధ్య జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌ల‌ను త‌మ‌కు అనుకూలంగా మార్చ‌కుంటూ.. రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌త‌లు క్షీణించాయ‌ని త‌మ అనుకూల మీడియా ద్వారా ప్ర‌చారం చేస్తున్నారు. ఫ‌లితంగా రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెట్టేందుకు ఆస‌క్తి చూపుతున్న వ్యాపారుల‌ను భ‌యాబ్రాంతుల‌కు గురిచేసేలా జ‌గ‌న్‌, వైసీపీ నేత‌లు ప్ర‌వ‌ర్తిస్తున్నారు.

 వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, ఆ పార్టీ నేత‌లు ఇష్టానుసారంగా రెచ్చిపోవ‌టానికి సీఎం చంద్ర‌బాబ నాయుడు మంచితనం కూడా కార‌ణ‌మ‌ని ప‌లు వ‌ర్గాల ప్ర‌జ‌లు వాపోతున్నారు. రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లకు విఘాతం క‌లిగించేవారిపై లాఠీలు ఝుళింపించాలని, అప్పుడే జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి లాంటి వారు, వైసీపీ నేత‌లు ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకొని మాట్లాడుతార‌ని పేర్కొంటున్నారు. అసెంబ్లీ వ‌ద్ద జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పోలీసుల‌పై వ్య‌వ‌హ‌రించిన తీరును చూస్తుంటే టీడీపీ, జ‌న‌సేన నేత‌ల‌కు ఆగ్ర‌హాన్ని తెప్పిస్తోంది. అసెంబ్లీ వ‌ద్ద నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ప్ర‌వ‌ర్తించిన వైసీపీ ఎమ్మెల్యేల‌కు అడ్డు చెప్పినందుకు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పోలీసుల‌పై చిందులేశాడు. అధికారంలో  ఉంది వైసీపీ.. నేనే సీఎంను అన్న‌ట్లుగా అహంకార పూరితంగా మాట్లాడారు. ఐదేళ్లు అవినీతి, అక్ర‌మాల‌తో రాష్ట్రాన్ని దోచుకున్న జ‌గ‌న్, వైసీపీ నేత‌ల‌పై కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన మొద‌టి రోజు నుంచే కొర‌డా ఝుళిపించి ఉంటే ప్ర‌స్తుతం ఈ ప‌రిస్థితి ఉండేది కాద‌ని కొంద‌రు తెలుగుదేశం, జ‌న‌సేన నేత‌లు అంటున్నారు. 

జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తాజాగా ట్విట‌ర్ లో షేర్ చేసిన పోస్టును చూసిన నెటిజ‌న్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే జ‌గ‌న్ రెడ్డిని జైలుకు పంపిస్తే బాగుండేద‌ని అభిప్రాయపడుతున్నారు.    కేవలం 50 రోజుల్లోనే కూట‌మి ప్రభుత్వం అన్నింటా వైఫల్యం చెందింద‌ని జ‌గ‌న్ ట్వీట్ చేయడం గమనార్హం. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. అరాచక పాలన పట్ల ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది.. రాష్ట్రంలో రాష్ట్ర‌ప‌తి పాల‌న పెట్టాలంటూ జ‌గ‌న్ ఆ ట్వీట్ లో పేర్కొన్నాడు. అంతేకాదు.. చంద్ర‌బాబు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని చూసి భ‌య‌ప‌డుతున్నాడ‌ట‌. వైసీపీకి ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తే అసెంబ్లీలో ప్రశ్నిస్తారన్న భయంతో కూట‌మి ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీని, ప్రతిపక్ష నాయకుడిని గుర్తించడం లేదంటూ జ‌గ‌న్ ట్వీట్ లో పేర్కొన‌డం గ‌మ‌నార్హం. మ‌రో అడుగు ముందుకేసి.. చంద్రబాబునాయుడి పాపాలు పండే రోజు దగ్గర్లోనే ఉంది అంటూ జ‌గ‌న్ ట్వీట్ చేయడం పట్ల ప్రజలు మండిప‌డుతున్నారు. ఇప్పటికైనా సుదీర్ఘ పాలనా అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు అభివృద్ధే లక్ష్యంతో పాటు.. రాష్ట్రంలో ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొట్టి ఘ‌ర్ష‌ణ‌లు సృష్టించే వైసీపీ మూక‌ల ప‌ట్ల క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాల‌ని ప్రజలు కోరుతున్నారు.  

By
en-us Political News

  
ఇక కుటుంబ వారసత్వం రేహాన్ వాద్రాకు అప్పగించడానికి రాహుల్ రెడీ అయిపోయారనడానికి సూచనగా.. రేహాన్ వాద్రా పేరు చివర గాంధీని కూడా ఇటీవలే అధికారికంగా చెర్చారు. ఔను రేహాన్ ఇంటి పేరును వాద్రా గాంధీగా ప్రికాంక వాద్రా అధికారికంగా మార్పించారు.
ఆలయ ప్రాంగణంలో గానీ, మీడియా ముందు గానీ రాజకీయ వ్యాఖ్యలు చేసే వారిపై, వాటిని ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న హెచ్చరికలు సైతం జారీ చేసింది. తిరుమలగిరిపై కేవలం “గోవింద నామస్మరణ” మాత్రమే ఉండాలన్నది టీటీడీ భావన.
అసెంబ్లీ, మండలిలో పార్టీ గళాన్ని బలంగా వినిపించేందుకు సీనియర్ నేతలకు బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలుగా బాధ్యతలు అప్పగించారు. ఈ నియామకాల ద్వారా అటు అసెంబ్లీలో, ఇటు మండలిలో అధికార పక్షాన్ని దీటుగా ఎదుర్కోవాలని దిశానిర్దేశం చేసినట్లయింది. అయితే అలా నియమించిన ఉప నేతలలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు పేరు లేదు.
అసెంబ్లీలో బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలను నియామస్తూ బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు
ఈ నేపథ్యంలోనే పంచాయతీ ఎన్నికల్లో లభించిన విజయానికి కొనసాగింపు సాధ్యమైనంత త్వరగా మునిసిపోల్స్ నిర్వహించేయాలని రేవంత్ సర్కార్ యోచిస్తోంది.
ఇటీవ‌ల జ‌గ‌న్ పుట్టిన రోజు సందర్భంగా పొటేళ్ల‌ను బ‌లిచ్చి ఆయ‌న‌ ఫోటోల‌కు ఆ ర‌క్తాన్ని త‌ర్ప‌ణం చేశారు వైసీపీ అభిమానులు. అంతేనా హింసాత్మ‌క కామెంట్లను ఫ్లెక్సీల‌పై పోస్ట్ చేసి.. వీరంగం ఆడారు.
అధికారం అండ చూసుకుని మంచి, చెడు, ఉచ్ఛం, నీచం అన్న తేడా లేకుండా దాడులు, దౌర్జన్యాలు, అవినీతి, అక్రమాలు, కబ్జాలతో చెలరేగిపోయారు. అటువంటి నేతలంతా వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత నాటి తప్పిదాలకు మూల్యం చెల్లించాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
అధికారం కోల్పోయిన తరువాత ఇద్దరి వ్యవహార తీరు దాదాపు ఒకేలా ఉంటోంది. క్రియాశీల రాజకీయాలకు దూరంగా, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. పార్ట్ టైమ్ పొలిటీషియన్లుగానే వ్యవహరిస్తూ వచ్చారు. ఇరువురూ కూడా పరాజయం తరువాత అసెంబ్లీకి డుమ్మా కొడుతూనే వచ్చారు. అలా అసెంబ్లీకి గైర్హాజర్ కావడానికి ఎవరి కారణాలు వారు చెప్పుకున్నా ఫలితం మాత్రం సభకు ఆబ్సెంట్ కావడమే.
తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ హయాంలో అంటే పదేళ్ల పాటు తెలంగాణ అసెంబ్లీ ప్రభుత్వ సమావేశం అన్నట్లుగా మారిపోయింది. విపక్ష సభ్యులకు మైక్ అన్నది అందని ద్రాక్షగా మారిపోయిన పరిస్థితి. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తరువాత సభా నిర్వహణలో స్పష్టమైన మార్పు కానవచ్చింది. సభాసంప్రదాయాలకు, విలువలకు రేవంత్ సర్కార్ పెద్ద పీట వేసింది. అర్ధవంతమైన చర్చలు జరిగేందుకు అనుకూలమైన వాతావరణం ఏర్పడింది.
ఓట్ల కోసం చేసిన ప్ర‌జాధ‌నం ఖ‌ర్చు తోపాటు.. చేసింది చెప్పుకోడానికి అద‌న‌పు ఖ‌ర్చు కూడా భారీ ఎత్తున‌ జ‌రిగేది. ఇంతా చేసి తాను చేసింది చెప్పుకోలేక పోయానంటూ జగన్ ఆవేదన చెందడమేంటని నెటిజనులు తెగ శోధించారు.
సుదీర్ఘ విరామం తరువాత విపక్ష నేత హోదాలో కేసీఆర్ ఈ సమావేశాలకు హాజరయ్యారు. సభ ప్రారంభానికి ముందే ఆయన సభలో తనకు కేటాయించిన సీటులో కూర్చున్నారు. ఆ తరువాత అసెంబ్లీలోకి ప్రవేశించిన రేవంత్ రెడ్డి నేరుగా కేసీఆర్ స్థానం వద్దకు వెళ్లి ఆయనను ఆప్యాయంగా పలుకరించారు.
కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆమోదం లభించే అవకాశాలున్నాయి. అలాగే కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై కూడా చర్చ జరిపి నిర్ణయం తీసుకునే చాన్స్ ఉంది.
ఒక్కోసినిమాకు వంద కోట్ల రూపాయ‌ల వరకూ పారితోష‌కం తీసుకునే విజయ్ ఆ ఆదాయాన్ని వదులుకుని ప్రజా సేవకే అంకితం కావాలని డిసైడ్ అయ్యారనడానికి ఆయన సినిమాలకు గుడ్ బై చెప్పడమే నిదర్శనం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.