పాముకు పాలు పోస్తున్న చంద్రబాబు

Publish Date:Mar 14, 2025

Advertisement

తన సీటుకే ఎర్త్ పెట్టుకునేలా విశ్వేశ్వర రెడ్డిని బలోపేతం చేస్తున్న ఏపీ సీఎం..

బాలయ్య సీటుకు ఎర్త్ పెట్టేలా బలోపేతమవుతున్న విశ్వేశ్వరెడ్డి తమ్ముడు..

పాముకు పాలు పొయొద్దు.. పోస్తే అది తిరిగి మనల్నే కాటేస్తుంది. ఇదీ కొన్నాళ్ల క్రితం వైసీపీ నేతలను ఉద్దేశించి చంద్రబాబు  తెలుగుదేశం నేతలకు చెప్పిన మాటలు. వైసీపీ నేతలను దగ్గరకు రానీయొద్దు.. తెలుగుదేశం నేతలను ప్రలోభపెట్టాలని వైసీపీ నేతలు,  వారి సానుభూతి పరులు ప్రయత్నిస్తున్నారు, మనతోనే వాళ్ల పనులు చేయించుకుంటారంటూ పార్టీ నేతలకు చాలా పెద్ద ఎత్తునే హితబోధ చేశారు చంద్రబాబు. అలాంటి వాళ్లను దగ్గరకు రానీయొద్దంటూ పెద్ద లెక్చరే పీకారు. 

కానీ అదే చంద్రబాబు రెండు రోజులు తిరిగే సరికి.. వైసీపీతో అంటకాగిన వారిని,  గత ప్రభుత్వంలో జగన్ మోహన్ రెడ్డికి కళ్లు, ముక్కు, చెవులుగా ఉన్న వారిని అక్కున చేర్చుకుంటున్నారు. వారికి ఆర్థికంగా భారీ మొత్తంలో లాభాలు తెచ్చిపెడుతున్నారు. పెద్ద ఎత్తున భూములూ కట్టబెట్టేస్తున్నారు.

తాజాగా జరిగిన ఎస్ఐబీపీ సమావేశంలో గత ప్రభుత్వంలో విద్యుత్ రంగం నుంచి, ఆ రంగంలోని వివిధ కాంట్రాక్టర్లు, విద్యుత్ కంపెనీల నుంచి రావాల్సిన అమ్యామ్యాలను వసూలు చేసి పెట్టిన వారికి పెద్ద పీట వేస్తూ నిర్ణయాలు తీసుకున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు ఏపీ సీఎం.  షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ యాజమాన్యానికే చెందిన మరో సంస్థ ఇండోసోల్ కంపెనీకి భారీ ఎత్తున భూములు కట్టబెట్టింది ఏపీ ప్రభుత్వం. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 58469 కోట్ల రూపాయలతో ఇండోసోల్ ప్రాజెక్టు పెట్టుబడి పెడుతుందని.. దానికి ఆమోదం తెలిపింది ఏపీ ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం ఎస్ఐపీబీ సమావేశంలో 119659 కోట్ల రూపాయల మేర పెట్టుబడులు పెడుతున్న వివిధ సంస్థలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. ఇందులో 58469 కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతున్న ఇండోసోల్ ప్రాజెక్టు కూడా ఒకటి. ఓ విధంగా చెప్పాలంటే ఇండోసోల్ కోసం లేటెస్ట్ ఎస్ఐపీబీ సమావేశాన్ని ప్రభుత్వం పెట్టినట్టుగా కన్పిస్తోంది.

 ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నట్టు చెప్పిన ఇండోసోల్ ప్రాజెక్టుకు కేటాయించిన భూములు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. 8348 ఎకరాల భూమిని నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం చేవూరు గ్రామంలో కేటాయింపులు జరుపుతున్నారు. ఇక పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెడుతున్నందుకు ప్రభుత్వం వైపు నుంచి భారీగా ఆర్థిక, ఆర్థికేతర ప్రొత్సహాకాలివ్వాలని ఇండోసోల్ కోరింది. ఆర్థిక ప్రొత్సహకాలు ఎంతో తెలుసా.. ఏకంగా 41254.50 కోట్ల రూపాయలు. ఇది కాకుండా,  ఆర్థికేతర ప్రొత్సహకాలు ఉన్నాయి. వీటిల్లో ఇండోసోల్ పెట్టిన మెజార్టీ ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. ఈ స్థాయిలో జగన్ కు బినామీ అనుకున్న సంస్థకు ఎలా కట్టబెడతారనేది ఇప్పుడు తెలుగుదేశం సర్కిల్స్ లో జరుగుతున్న చర్చ.

 పోనీ ఇదేదో పై స్థాయిలో జరుగుతోంది.. చూసీ చూడనట్టు పోదామన్నా.. వీల్లేని పరిస్థితులు కల్పిస్తోంది ఇండసోల్ సంస్థ. ఇండోసోల్ అధినేత విశ్వేశ్వర రెడ్డి నేరుగా చేస్తున్నారో.. లేక ఆయన పేరుతో ఎవరైనా చేస్తున్నారో తెలియదు కానీ,  తెలుగుదేశం పార్టీకి చెందిన   వారు.. పార్టీ సానుభూతి పరులు విద్యుత్ కాంట్రాక్ట్ పనులకు సంబంధించిన టెండర్లను వేస్తే వాటిని అడ్డుకుంటున్నారు. ఈ మొత్తం వ్యవహరంలో ఎస్పీడీసీఎల్ సీఎండీ సంతోష్ రావు పెత్తనం చేస్తున్నారట. సదురు సంతోష్ రావు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి భక్తుడు. ఈ సంతోష్ రావు చెప్పిన వారికే కాంట్రాక్టులు దక్కుతున్నాయి. హిందూపురం తోపుదుర్తి గ్రామంలో విశ్వేశ్వర రెడ్డి సోదరుడు బ్రహ్మానంద రెడ్డి విద్యుత్ కాంట్రాక్టర్. దీంతో విశ్వేశ్వర రెడ్డి అండతో.. సంతోష్ రావు సహకారంతో సదురు బ్రహ్మానంద రెడ్డికే పనులు దక్కుతున్నాయట. తెలుగుదేశం పార్టీకి  చెందిన క్లాస్ వన్ కాంట్రాక్టర్ గంగాధర నాయుడు విద్యుత్ కాంట్రాక్టులకు టెండర్లు వేయాలన్నా.. వేయనీయకుండా అడ్డుకుంటున్నారట.

మళ్లీ చంద్రబాబు చెప్పిన పాముకు పాలు పోస్తే సామెతను ఇక్కడ గుర్తు చేయాల్సి వస్తోంది. పై స్థాయిలో విశ్వేశ్వర రెడ్డిని బలోపేతం చేస్తున్నారు.. క్షేత్ర స్థాయిలో టీడీపీ వాళ్లను కాదని.. విశ్వేశ్వర రెడ్డి తమ్ముడిని బలోపేతం చేస్తున్నారు. వీళ్లు ఆర్థికంగా బలోపేతమై.. అమరావతిలో కూర్చొన్న విశ్వేశ్వర రెడ్డి చంద్రబాబకు, లోకేషుకు ఎర్త్ పెట్టడమో,  హిందూపురంలో బాలయ్య సీటుకు ఎర్త్ పెట్టడమో చేయరని గ్యారెంటీ ఏంటీ అనే చర్చ జరుగుతోంది. పాము పాలు థియరీ చెప్పడం కాదు.. పాటిస్తే ఇంకా బాగుంటుందని తెలుగుదేశం కేడర్.. లీడర్లు విసుక్కుంటూ సణుక్కుంటున్నారట.

By
en-us Political News

  
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.