Publish Date:Nov 14, 2024
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శుక్రవారం (నవంబర్ 15) ఢిల్లీకి వెడుతున్నారు. అక్కడ ఒక ప్రముఖ పత్రిక శనివారం నిర్వహించే లీడర్ షిప్ సమ్మిట్ లో పాల్గొంటారు. శుక్రవారం ఉదయం అసెంబ్లీ సమావేశాలకు చంద్రబాబు హాజరౌతారు. అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడ నుంచి ఢిల్లీకి బయలుదేరి వెడతారు. ఈ పర్యటనలో ఆయన కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై వారితో ఆయన చర్చించనున్నారు. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా చంద్రబాబు భేటీ అవుతారని అంటున్నారు. ఢిల్లీ పర్యటనను ముగించుకుని శనివారం మధ్యాహ్నం మహారాష్ట్ర కు చేరుకుని అక్కడ ఎన్డీయే తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి ఎన్డీయే తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటుగా ఉప ముఖ్యమంత్రి సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. బీజేపీ పెద్దల ఆహ్వానం మేరకు ఈ నెల 16, 17 తేదీల్లో ఇరువురూ మహారాష్ట్రలో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటారు. శనివారం అసెంబ్లీ సమావేశాలకు ఇద్దరు ముఖ్య నేతలు అందుబాటులో ఉండరు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలో తెలుగువారు ఎక్కువగానే నివాసం ఉండే ప్రాంతాల్లో ప్రచారం చేస్తారని తెలుస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/cbn-delhi-tour-25-188383.html
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.
వైద్యశాస్త్ర రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా భావించే నోబెల్ బహుమతి ప్రకటన వెలువడింది.
ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్
చేతిలో రూ.3 లక్షలు.. ఇప్పుడు రూ.100 కోట్ల బిజినెస్.!
కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్ ప్రణాళికల్లో కీలక మార్పులు.. .!
కొందరు దుండగులు ఏకంగా జ్యువెలరీ షాప్‌నే టార్గెట్ చేశారు.
తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా అద్వైత్ కుమార్ సింగ్ ఐఏఎస్ పూర్తి అదనపు బాధ్యతలు (FAC) స్వీకరించారు