జేడీ లక్ష్మినారాయణ.. పొలిటికల్ సన్యాసమేనా?

Publish Date:Feb 16, 2026

Advertisement

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ రాజకీయ సన్యాసం తీసేసుకున్నట్లేనా? ఉద్యోగం వీడి రాజకీయ ప్రవేశం చేసిన ఆయన తొలుత జనసేనలో చేరారు. అయితే సీబీఐ జేడీగా లక్ష్మీనారాయణ తన పనితీరుతో సామాన్యుల మన్ననలు, అభిమానం చూరగొన్నారు. జగన్ అక్రమాస్తుల కేసు, ఓబులాపురం మైనింగ్ కేసులలో సీబీఐ జేడీగా ఆయన దర్యాప్తు సాగించిన తీరు పట్ల అప్పట్లో సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా లంచాలు తీసుకున్న  జడ్జిని కూడా పట్టుకుని   తన నిజాయితీని చాటుకున్నారు.

ఆ తరువాత కారణాలేమైతేనేం.. ఆయన తన ఉన్నతోద్యోగాన్ని వీడి రాజకీయాలలోకి ప్రవేశించారు.  2019లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి జనసేన పార్టీ తరపున విశాఖపట్నం ఎంపీగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఆ తరువాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటిస్తున్నారంటూ.. ఆ పార్టీకి రాజీనామా చేశారు. కొంత కాలం అటూ ఇటూ అంటూ ఊగి చివరికి సొంత పార్టీ కూడా పెట్టారు. అయితే రాజకీయాలలో ఆయనకు సక్సెస్ దక్కలేదు. అది పక్కన పెడితే.. ఇటీవల జేడీ లక్ష్మీనారాయణ సతీమణి సైబర్ మోసానికి గురై భారీగా నష్టపోయారు. దీంతో కుటుంబం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నట్లు ఇటీవల కొంత కాలంగా వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన తాజాగా  ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగిగా చేరారు. దీంతో ఆయన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారన్న ఊహాగానాలకు బలం చేకూరినట్లైంది.

ఆయన మేఘా గ్రూపునకు చెందిన ఈవీ ట్రాన్స్ కంపెనీలో ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ గా కొలువులో చేరారు.  2024 ఎన్నికల ముందు ఆయన జై భారత్ నేషనల్ పార్టీ ని స్థాపించి, విశాఖపట్నం నార్త్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. అయితే, ఈ ఎన్నికల్లో ఆయనకు ఘోర పరాభవం ఎదురైంది. కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు.  ఇక పాలిటిక్స్ తో లాభం లేదన్న నిర్ణయం వచ్చి మళ్లీ ఉద్యోగిగా కెరీర్ పై దృష్టి పెడుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

By
en-us Political News

  
బీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న యువ సంగ్రామ సభకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సోనమ్ వాంగ్ చుక్ నిరవధిక నిరశన సాగుతోంది. గత 20 రోజులుగా ఆయన నిరాహార దీక్ష చేస్తుండటంతో.. ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణిస్తోందని వైద్య వర్గాలు తెలిపాయి. ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో, దేశవ్యాప్తంగా ప్రజల్లో, సామాజిక మాధ్యమాల్లోఆయనకు మద్దతు అనూహ్యంగా పెరిగింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోనమ్ వాంగ్ చుక్ తో భేటీకి హస్తిన పర్యటనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నేడో రేపో రేవంత్ రెడ్డి దిల్లీకి చేరుకుని, జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్‌ను స్వయంగా కలిసి సంఘీభావం ప్రకటించనున్నారని కాంగ్రెస్ లో అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) ప్రస్తుతం తీవ్రమైన వ్యూహాత్మక అయోమయంలో కొట్టుమిట్టాడుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ (తారక్) రాజకీయ అరంగేట్రం గురించిన చర్చ
అమర్ రాజాకు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల పేరుతో నోటీసులు ఇవ్వడం, విద్యుత్ కనెక్షన్లు కట్ చేయడం వంటి చర్యలతో నాటి ప్రభుత్వం ఎలా ఇబ్బందులకు గురి చేసిందో.. పారిశ్రామిక వర్గాలు గుర్తుచేసుకుంటున్నాయి. ఏపీలో పుట్టి పెరిగిన ఒక ప్రతిష్టాత్మక సంస్థ, తన భవిష్యత్తు విస్తరణ, వృద్ధి ప్రస్థానం కోసం రాష్ట్రం దాటి వెళ్లాల్సిరావడంపై సర్వత్రా ఇప్పుడు మరోసారి చర్చ మొదలైంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక డిజిటల్ వేదికగా రూపొందించిన జగన్ 2.0 సూపర్‌యాప్‌ను వైసీపీ అధినేత జగన్‌ గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు.
భీమవరం, కిర్లంపూడి లలో పర్యటించారు. రెండు చోట్లా కూడా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలలో పట్టు నిరూపించుకోవడానికి ఆయన చేపట్టిన ఏ పర్యటన అయినా సరే.. ఉద్రిక్తతలు, గందరగోళం మధ్యే సాగుతున్నాయి.
కిర్లంపూడి పోలీస్ స్టేషన్‌లో ఆయనతో పాటు మరికొందరు  వైసీపీ నేతలపై  పోలీసులు  ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిని అడ్డుకుని, వారిపై భౌతిక దాడికి దిగారనే ఆరోపణలపై ఈ చర్యలు తీసుకున్నారు. 
రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కౌశిక్ రెడ్డి ఒక ఛాలెంజ్ విసిరారు. కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీటిని వెంటనే ఎత్తిపోయాలని, ఆ నీటిని అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మీదుగా ఎల్లంపల్లికి తరలించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఆ విధంగా నీటిని ఎత్తిపోసే ప్రక్రియలో అన్నారం లేదా సుందిళ్ల బ్యారేజీలకు ఏవైనా నష్టాలు లేదా ప్రమాదాలు జరిగితే, దానికి పూర్తి బాధ్యత తమదేనన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్.. ముద్రగడ సమాజానికి చేసిన సేవలను గుర్తించి ఈ గౌరవాన్ని కల్పించాలని నిర్ణయించారు. ఈ మేరకు అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షించాలని, అన్ని రకాల ప్రభుత్వ మర్యాదలు లోటు లేకుండా చూడాలని ఉన్నతాధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
ల్పపీడన ప్రభావంతో జులై మూడో వారంలో దేశవ్యాప్తంగా వర్షాలు మళ్లీ ఊపందుకోనున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు మధ్య భారతదేశం, తూర్పు రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.