కేసీఆర్ కు సీబీఐ భయం.. జనరల్ కన్సెంట్ రద్దుకు నిర్ణయం?

Publish Date:Sep 2, 2022

Advertisement

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తనపై సీబీఐ నజర్ ఉందని భయపడుతున్నారా? తనపై లేదా తన కుటుంబ  సభ్యులపై కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ) దాడులు నిర్వహించే అవకాశం ఉందని భావిస్తున్నారా? అంటే ఆయన తీరు చూస్తుంటే ఔననే సమాధానమే వస్తుంది. అందుకే కేసీఆర్ రాష్ట్రంలో సీబీఐ జనరల్ కన్సెంట్(సాధారణ సమ్మతి) ను రద్దు చేయలని నిర్ణయించారు.

ఈ మేరకు ఏ క్షణంలోనైనా ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు. ఆయనీ నిర్ణయం తీసుకున్నారనడానికి నిదర్శనంగా బీహార్ లో ఆయన మాటలను పరిశీలకులు ఉటంకిస్తున్నారు. ఒక్క తెలంగాణ అనే కాదు.. అన్ని రాష్ట్రాలూ  సీబీఐ జనరల్ కన్సెంట్ ను రద్దు చేయాలని ఆయన తన బీహార్ పర్యటనలో పిలుపు నిచ్చారు. సీబీఐ జనరల్ కన్సెంట్ ను రద్దు చేయాలని కేసీఆర్ నిర్ణయించుకోవడానికి కారణం ఏ క్షణంలోనైనా తన కుమార్తె కవితపై సీబీఐ లిక్కర్ స్కాం కేసు నమోదు చేసే అవకాశాలుండటమేనని అంటున్నారు.

వాస్తవానికి చట్ట ప్రకారం సీబీఐ రాష్ట్ర ప్రభుత్వాల సిఫార్సుల మేరకే దర్యాప్తు జరుపుతుంద.   ఓ రాష్ట్రంలో సీబీఐ తనంత తానుగా  కేసులు నమోదు చేసి విచారణ  చేయజాలదు. అయితే ఈ నిబంధన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించదు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై సీబీఐ .. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోకుండా దాడులు చేయవచ్చు. అయితే ఇలా చేయడానికి కూడా సీబీఐకి అన్ని ప్రభుత్వాలు జనరల్ కన్సెంట్ ఇవ్వాలి. ప్రతీ రాష్ట్ర ప్రభుత్వం సామాన్యంగా ఈ జనరల్ కన్సెంట్ ఇస్తుంది.

అయితే ఇప్పుడు సీబీఐ రాజకీయ అస్త్రంగా మారిందని బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలు విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో   విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న చోట్ల జనరల్ కన్సెంట్ రద్దు చేయడానికి ఆయా ప్రభుత్వాలు వెనుకాడటం లేదు. విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గత ఎన్నికలకు ముందు చంద్రబాబునాయుడు ఏపీలో సీబీఐకి ఇచ్చిన ఈ జనరల్ కన్సెంట్ ను రద్దు చేశారు. ఈ విషయంలో ఆయన బీజేపీ యేతర రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శనం చేశారు.  అయితే అప్పట్లో బీజేపీతో సన్నిహిత సంబంధాలు ఉన్న కేసీఆర్ చంద్రబాబు సీబీఐకి జనరల్ కన్సెంట్ రద్దు చేయడాన్ని తప్పుపట్టారు.

చంద్రబాబు నిర్ణయంపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు.  తప్పు చేయకపోతే భయమెందుకంటూ మాట్లాడారు. అయితే ఇప్పుడు తనదాకా వచ్చేసరికి కేసీఆర్ చంద్రబాబు అడుగుజాడల్లోనే నడవాలని నిర్ణయించుకున్నారు. అంతే కాదు తానే కాకుండా అన్ని రాష్ట్రాలు ఇదే చేయాలని పిలుపు కూడా ఇచ్చారు.  బీజేపీ, మోడీకి వ్యతిరేకంగా పోరాడాలని భావిస్తున్న అన్ని ప్రాంతీయ పార్టీల నాయకులు, బీజేపీ యేతర ప్రభుత్వాల   సీఎంలు ఇదే దారిలో నడవాలని కేసీఆర్ ఆకాంక్షిస్తున్నారు. సీబీఐకి తెలంగాణ ముఖ్యమంత్రి జనరల్ కన్సెంట్ ను రద్దు చేయాలన్న నిర్ణయాన్ని తప్పుపట్టలేం కానీ, గతంలో ఇదే పని చేసిన చంద్రబాబుపై విమర్శలు గుప్పించి.. తనదాకా వచ్చే సరికి అదే దారిన నడవాలని నిర్ణయించుకోవడం అవకాశ వాదం కాదా అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. మొత్తం మీద కేసీఆర్ రాష్ట్రంలో సీబీఐకి సాధారణ సమ్మతిని రద్దు చేయడం ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.

By
en-us Political News

  
ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన ఈ వీడియో సందేశంపై ప్రముఖ నటుడు, సామాజిక విమర్శకుడు ప్రకాశ్ రాజ్ ప్రధాని ముఖంలో భయం ప్రస్ఫుటంగా కనిపించిందంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
పార్లమెంటు ఉభయ సభలలో ఏదో ఒక సభ లో సభ్యత్వం లేని వ్యక్తి ఆరు నెలల కాల పరిమితి మించి కేంద్ర మంత్రిగా కొనసాగే అవకాశం లేదు. దీంతో మోడీ ఆదేశాల మేరకు రవ్ నీత్ సింగ్ బిట్టూ తన పదవికి రాజీనామా సమర్పించారు.
పరీక్షల్లో పారదర్శకత, విద్యారంగంలో సంస్కరణలు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ తో యువత చేపట్టిన పోరాటానికి మద్దతు ప్రకటించడమే కాకుండా.. జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో సోమవారం జరగనున్న ధర్నాలో స్వయంగా పాల్గొంటానని వెల్లడించారు.
కల్వకుంట్ల తారకరామారావు జన్మదినం జులై 24 ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ కేటీఆర్ కు పాతిక కిలోల సన్నబియ్యాన్ని కానుకగా పంపారు. అదీ తాను స్వయంగా ఆ బర్త్ డే గిఫ్ట్ ను అందించకుండా, ర్యాపిడో బైక్ బుక్ చేసి.. ఆ కానుకను తెలంగాణ భవన్ కు కేటీఆర్ కు పంపించారు.
వాస్తవానికి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే కేబినెట్ భేటీకి డిప్యూటీ సీఎం హాజరు కాకపోవడానికి రాజకీయ కారణాలున్నాయా అన్న అనుమానాలకు ఆస్కారం లేని పరిస్ధితి ఉంది. ఎందుకంటే.. ఇటీవలే ముంబై లోని కోకిలా బెన్ అంబానీ ఆస్పత్రిలో పవన్ కల్యాణ్ భుజానికి శస్త్ర చికిత్స జరిగింది. ఆయనకుపూర్త విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడం వల్లనే కేబినెట్ భేటీకి రాలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
మత్స్యకారుల నాయకుడిగా, మాజీ మంత్రిగా గుర్తింపు పొందిన సీదిరి అప్పలరాజు ఇటీవల వార్తల్లో నిలిచారు.
జగన్ సొంత కుంపటి పెట్టుకున్న నాటి నుంచీ వెన్నంటి ఉన్న విజయసాయిరెడ్డి, సమీప బంధువు అయిన బాలినేని లకు పార్టీలో దక్కిన మర్యాద తెలిసిందే. ఇప్పుడు తాజాగా నిన్న మొన్నటి వరకూ జగన్ కు అత్యంత సన్నిహితుడిగా, నమ్మిన బంటుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి ఇప్పుడు కనీసం తాడేపల్లి ప్యాలెస్ గేటు వద్ద ఎంట్రీ కూడా దొరకడం లేదు.
ఇటీవల నిరుద్యోగ యువతను ఉద్దేశించి సుప్రీంకోర్టు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా, సామాజిక మాధ్యమాల్లో రాజుకున్న ఆగ్రహం ఇప్పుడు దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద విశ్వరూపంతో నిలిచింది. ప్రశ్నించే హక్కును కోల్పోయిన తరానికి ప్రాతినిధ్యం వహిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ రూపంలో విద్యార్థులు, యువత ఉద్యమిస్తున్నారు.
ఏపీలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ ఈ అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. జాతీయ స్థాయి నీట్ లీకేజీ వ్యవహారంలోకి ఏపీ మెగా డీఎస్సీ పరీక్షల అంశాన్ని జోడించి లబ్ధి పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన డీఎస్సీ పరీక్షల్లో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైసిపి నాయకత్వం విమర్శిస్తూ, నీట్ తో పాటు డీఎస్సీ అక్రమాలపై కూడా విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది.
దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల నిర్వహణ, ప్రశ్నాపత్రాల లీకేజీ ఆరోపణలు తీవ్ర స్థాయిలో దుమారం రేపుతున్నాయి.
రాజకీయం గురించి కాదు. పార్టీ గురించి కాదు.ఒక నాయకుడి గురించి కూడా కాదు....ఒక తరం గురించి. విజృంభించిన లాఠీల్లో రక్తం చిందించిన ఈ తరం గురించి.
గతంలో అంటే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, దూషణలతో చెలరేగిన వల్లభనేని వంశీ తాజా లేఖలో మాత్రం చంద్రబాబుకు గౌరవం ఇస్తూ అయ్యా చంద్రబాబుగారూ అని మర్యాదగా సంభోధించారు. అంతే కాకుండా చంద్రబాబు చొరవను, రైతుల పట్ల ఆయనకు ఉన్న అక్కరనూ ప్రశంసలతో ముంచెత్తారు.
అధికారాన్ని అడ్డుపెట్టుకుని నిబంధనలకు తిలోదకాలిచ్చి.. ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వైసీపీ ఇప్పుడు కేసుల చిక్కుల్లో నిండా ఇరుక్కుంది. అధికారంలో ఉండగా చట్టాలకు మనం అతీతులం అన్నట్లుగా వ్యవహరించిన వైసీపీ నేతలకు ఒక్కరొక్కరుగా పోలీసు కేసులను, సీఐడీ విచారణలను ఎదుర్కొంటూ, అరెస్టులు, బెయిళ్లు అంటూ న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సి పరిస్థితిలో ఉన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.