స్వార్థ రాజకీయం కోసం.. ఏపీలో మళ్లీ కులాల కుంపటి.. జనం నమ్మరు!

Publish Date:Jun 19, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కులం అనేది ఎప్పుడూ ఒక కీలకమైన అంశమే అయినప్పటికీ.. ప్రస్తుత పరిస్థితుల్లో కొన్ని రాజకీయ శక్తులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం కులాల మధ్య మళ్లీ చిచ్చు పెట్టేందుకు కుయుక్తులు పన్నుతున్నాయి. సమాజంలో  ఒక శాతం కూడా లేని కుల వివక్షను రాజకీయం కోసం పెద్దదిగా చూపించి, ప్రజల మధ్య వైషమ్యాలు రగల్చాలని చూస్తున్న నాయకుల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల జరుగుతున్న కొన్ని పరిణామాలు ఏపీని ఏ దిశగా తీసుకెళ్తున్నాయనే చర్చకు దారితీస్తున్నాయి.

దీనిపై సీనియర్ రాజకీయ విశ్లేషకుడు కిలారు నాగార్జున తెలుగున్ కు ఇచ్చిన  ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో  ఏపీ రాజకీయాల్లో గత కొన్నేళ్లుగా సాగుతున్న కులాల వ్యూహాలను   విశ్లేషించారు.  దేశంలో రాజ్యాంగం కల్పించిన రక్షణలు, సామాజిక మార్పుల వల్ల నేడు పల్లెల్లో సైతం కుల వివక్ష దాదాపు అంతరించిపోయిందన్నారు. కానీ.. ఒక వ్యూహం ప్రకారం కొన్ని రాజకీయ పార్టీలు నిర్దిష్ట సామాజిక వర్గాలను టార్గెట్ చేస్తూ, మిగిలిన వర్గాల్లో వారిపై ద్వేషం పెంచేలా  వాటిని బూచి గా చూపిస్తూ రాజకీయ పబ్బం గుడుపుకోవాలని చూస్తున్నాయన్నారు. ఈ తరహా కుల విభజన రాజకీయాల వల్లే గతంలో తెలుగుదేశం పార్టీ తీవ్రంగా నష్టపోయిందని గుర్తు చేశారు.

  గతంలో రాజీవ్ గాంధీ మరణం సమయంలో గానీ, వంగవీటి మోహన రంగా హత్య జరిగినప్పుడు గానీ జరిగిన హింసాత్మక ఘటనలకు సామాజిక వర్గాలతో ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ..  ఆయా సందర్భాలను వాడుకుని కొన్ని ముఠాలు ఆస్తులను ధ్వంసం చేసి కుల ముద్ర వేశాయన్న కిలారు.. ఇప్పుడు కూడా నేరం చేసినప్పుడు వ్యక్తిగత విషయంగా చూసే నాయకులు.. చట్టం తమపై చర్యలు తీసుకునేటప్పుడు మాత్రం  కులం కార్డు  బయటకు తీస్తున్నారని ఆక్షేపించారు. దళితులు, బీసీలు,  ఇతర వర్గాల పేరుతో సానుభూతి పొందేందుకు ప్రయత్నించడం రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమని దుయ్యబట్టారు.

ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న తరుణంలో వైసీపీ తాను  నిర్వహించే ఏ నిరసన కార్యక్రమానికీ,  ప్రజల నుంచి ఆదరణ  లేకపోవడంతో మళ్లీ   కుల సమీకరణల అస్త్రాన్ని నమ్ముకుందన్నారు.  కాపు సామాజిక వర్గాన్ని కూటమికి దూరం చేసేలా కొందరు నాయకులకు ప్రత్యేక టాస్క్‌లు అప్పగించారనే ప్రచారం కూడా సాగుతోందన్నారు. వీరికి తోడు తెలంగాణకు చెందిన కొందరు మేధావులు, ప్రొఫెసర్లు  న్యూట్రల్స్ ముసుగులో   ఏపీలో కుల రాజకీయాలను మరింత ప్రోత్సహిస్తూ ఒక వైపునకే వక్రీకరిస్తున్నారని ధ్వజమెత్తారు.

అయితే..  ఏపీ ప్రజలు ఇప్పుడు చాలా చైతన్యవంతంగా ఉన్నారని, 2019 నాటి కులాల ట్రాప్‌లో పడే పరిస్థితి ఇప్పుడు లేదని స్పష్టం చేశారు. నేటి సమాజంలో కులాంతర వివాహాలు పెరుగుతూ, ప్రజలంతా కలిసిమెలిసి జీవిస్తున్న తరుణంలో రాజకీయాల కోసం కుంపట్లు పెడితే ఎవరూ నమ్మరని తేల్చిచెప్పారు. ప్రజలకు ఇప్పుడు కావాల్సింది అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం పూర్తి, ఉద్యోగ అవకాశాలు మాత్రమేనని.. కాబట్టి రాజకీయ పార్టీల కుయుక్తులను విచక్షణతో తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. 

By
en-us Political News

  
విజయవాడ కృష్ణలంక ప్రాంతానికి చెందిన సాయికృష్ణ అదృశ్యం కేసు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. 2024 ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత దిక్కుతోచని స్థితిలో ఉన్న వైసీపీకి సాయికృష్ణ అదృశ్యం ఘటనను అందివచ్చిన అవకాశంగా భావించి.. పొలిటికల్ మైలేజీ గెయిన్ చేయడానికి శతధా ప్రయత్నించింది. అయితే చంద్రబాబు తన చాణక్యంతో ఆ ప్రయత్నాలకు చెక్ పెట్టారు.
తెలంగాణ రాజకీయాల్లో మల్కాజ్‌గిరి నియోజకవర్గం మరోసారి తీవ్ర ఉత్కంఠకు వేదికగా మారింది.
వైసీపీ హయాంలో మంత్రిగా ఉన్న సమయంలో కొడాలి నాని అప్పటి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లపై తీవ్రస్థాయిలో వ్యక్తిగత దూషణలు, అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యాఖ్యలు రాజ్యాంగ నిబంధనలకు, చట్టానికి వ్యతిరేకంగా ఉన్నాయంటూ దాఖలైన ఫిర్యాదులపై సుదీర్ఘంగా సమీక్షించిన ప్రభుత్వం.. తాజాగా ప్రాసిక్యూషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం. దీనితో ఆయన అరెస్టయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు.
కేసుకు కులాన్ని ఆపాదిస్తూ వైసీపీ నాయకులు అంబటి రాంబాబు, కొరసాల కన్నబాబు, తోట త్రిమూర్తులు వంటి పెద్దలు కాపు కుల మీటింగ్‌లు పెట్టాలని చూడటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సాయికృష్ణపై గతంలో దాదాపు 22 క్రిమినల్ కేసులు, పోక్సో చట్టం కింద కేసులు ఉన్నాయని, సమాజానికి హానికరమైన ఒక నేరచరిత్ర ఉన్న వ్యక్తిని తీసుకువచ్చి కాపు యువకుడిగా ముద్ర వేయడం ద్వారా మొత్తం కులానికి అప్రతిష్ట తెస్తున్నారని మండిపడ్డారు.
ప్రముఖ సామాజిక విశ్లేషకుడు అడుసుమిల్లి శ్రీనివాసరావు తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రుషికొండ ప్యాలెస్ విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న జాప్యంపై అసహనం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ప్రజాధనంతో నిర్మించిన ఈ విలాసవంతమైన భవనాన్ని కేవలం ఆలోచనలకే పరిమితం చేయకుండా.. తక్షణమే ప్రజోపయోగంలోకి తీసుకురావాలన్నారు.
సచివాలయ ఉద్యోగాల రాత పరీక్షలో 1 నుంచి 8000 లోపు అత్యుత్తమ ర్యాంకులు సాధించిన అభ్యర్థులకు ఉద్యోగాలు దక్కలేదనీ, 8000 దాటి ఆ పైన దారుణమైన ర్యాంకులు వచ్చిన వారికి ఉద్యోగాలు కేటాయించారనీ, ఈ విషయాన్ని బాధితులే తనతో స్వయంగా చెప్పారనీ రవిశంకర్ అన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో సాయి కృష్ణ అనుమానాస్పద లాకప్ డెత్ వ్యవహారం ఇప్పుడు రచ్చ లేపుతోంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఈ వ్యవహారంలో చర్యలు తీసుకుంది. కొంతమంది పోలీసులను సస్పెండ్ చేసింది.. విచారణకు ఆదేశించింది. ప్రభుత్వం చర్యలు తీసుకుంటుండగానే.. వైసిపి నాయకులు విమర్శలతో చెలరేగిపోయారు. వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి అంబటి రాంబాబు అలవాటుగా తన నోటికి పని చెప్పారు
బీజేపీ, ఎన్‌డీఏ నైతిక మద్దతుతో ఇండిపెండెంట్ గా బరిలోకి దిగిన నత్వానీ.. ఇండియా కూటమికి గట్టి షాక్ ఇచ్చారు. అసెంబ్లీలో ప్రతిపక్షాల కంటే అధికార కూటమికే స్పష్టమైన సంఖ్యాబలం ఉన్నప్పటికీ, కాంగ్రెస్ అభ్యర్థి ప్రణవ్ ఝాను మట్టికరిపించి నత్వానీ విజేతగా నిలవడం హాట్ టాపిక్‌గా మారింది.
2024 ఎన్నికలలో పరాజయం తరువాత రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించిన నాని.. ఇప్పుడు పొలిటికల్ గా యాక్టివ్ అవ్వడం సంచలనంగా మారింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం అత్యంత ఆసక్తికరమైన మరియు సంక్లిష్టమైన దశకు చేరుకున్నాయి
ఈ భవనాన్ని అలాగే వదిలేయడం వల్ల ఇప్పటివరకు 6 కోట్ల రూపాయల ప్రజాధనం బుడిదలో పోసిన పన్నీరైందన్నారు.
సూర్యనారాయణ రెడ్డికి సొంతంగా మాట్లాడే శక్తి లేదని, చేతిలో స్క్రిప్ట్ ఉంటే తప్ప ఆయన ప్రెస్ మీట్లలో కూడా మాట్లాడలేరని ఎద్దేవా చేశారు. ఆయన ప్రవర్తనను సినీ నటుడు బ్రహ్మానందం హావభావాలతో పోలుస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఏసీ రూముల్లో కూర్చుని సోషల్ మీడియా వేదికగా అసత్యాలు ప్రచారం చేయడం కాదు.. ధైర్యముంటే ప్రజాక్షేత్రంలోకి వచ్చి నేరుగా చర్చకు రావాలని సవాల్ విసిరారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, ఉద్యోగాల భర్తీపై బహిరంగ చర్చకు తాను ఎప్పుడైనా సిద్ధమేనని లోకేష్ స్పష్టం చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.