అంబటి రాంబాబుపై కిర్లంపూడిలో కేసు.!

Publish Date:Jul 16, 2026

Advertisement

మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత దివంగత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల వేళ చోటుచేసుకున్న ఉద్రిక్త పరిణామాలు రాజకీయంగా మలుపు తిరిగాయి. ఈ వివాదానికి సంబంధించి వైసీపీ  సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై పోలీసు కేసు నమోదైంది.  కిర్లంపూడి పోలీస్ స్టేషన్‌లో ఆయనతో పాటు మరికొందరు  వైసీపీ నేతలపై  పోలీసులు  ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిని అడ్డుకుని, వారిపై భౌతిక దాడికి దిగారనే ఆరోపణలపై ఈ చర్యలు తీసుకున్నారు. 

విషయమేంటంటే.. ముద్రగడ పద్మనాభం భౌతికకాయానికి అధికారిక లాంఛనాలతో  బుధవారం (జులై 16) అంత్యక్రియలు నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే..  దీనిని ముద్రగడ కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు. తమ కుటుంబ నిర్ణయం ప్రకారమే, సాధారణ పద్ధతిలో అంత్యక్రియలు జరగాలని వారు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న వైసీపీ శ్రేణులు, నేతలు కూడా ప్రభుత్వ లాంఛనాల నిర్వహణను అడ్డుకునేందుకు ప్రయత్నించారు.

ఈ క్రమంలోనే పోలీసులకు, అక్కడ ఉన్న రాజకీయ నాయకులకు మధ్య  వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం తుపాకులతో సెల్యూట్ చేస్తూ గార్డ్ ఆఫ్ హానర్ సమర్పించేందుకు సిద్ధమైన ఏఆర్ ఎస్సై అప్పలరాజుతో పాటు ఇతర కానిస్టేబుళ్లను అంబటి రాంబాబు, ఆయన అనుచరులు   నెట్టివేశారని పోలీసులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. విధినిర్వహణలో ఉన్న తమపై దాడి చేసి తోసి వేసి తన విధులకు ఆటంకం కల్పించారని బాధితులు ఆరోపించారు.  

పోలీస్ సిబ్బంది ఇచ్చిన రాతపూర్వక ఫిర్యాదు మేరకు కిర్లంపూడి పోలీసులు  చట్టప్రకారం చర్యలకు ఉపక్రమించారు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందిస్తూ మాజీ మంత్రి అంబటి రాంబాబు,  ఇతర వైసీపీ   కేసు నమోదు చేశారు. 

ఈ వివాదంపై రాజకీయవర్గాలలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముద్రగడ కుటుంబ సంప్రదాయాలు, వారి ఇష్టాయిష్టాలను గౌరవించకుండా బలవంతంగా ప్రభుత్వ లాంఛనాలు జరపాలని చూడటం వల్లే ఈ ఘర్షణ వాతావరణం ఏర్పడిందని ఒక వర్గం వాదిస్తుండగా,  విధుల్లో ఉన్న పోలీసుల  నెట్టేయడం చట్టరీత్యా నేరమని, శాంతిభద్రతలను కాపాడాల్సిన నాయకులే ఇలాంటి చర్యలకు పాల్పడటం సరికాదని  మరి కొందరు అంటున్నారు.  

Mudragada Padmanabham Funeral Controversy, Kirlampudi Police Station FIR, YSRCP Leaders Police Push Case

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) ప్రస్తుతం తీవ్రమైన వ్యూహాత్మక అయోమయంలో కొట్టుమిట్టాడుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ (తారక్) రాజకీయ అరంగేట్రం గురించిన చర్చ
అమర్ రాజాకు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల పేరుతో నోటీసులు ఇవ్వడం, విద్యుత్ కనెక్షన్లు కట్ చేయడం వంటి చర్యలతో నాటి ప్రభుత్వం ఎలా ఇబ్బందులకు గురి చేసిందో.. పారిశ్రామిక వర్గాలు గుర్తుచేసుకుంటున్నాయి. ఏపీలో పుట్టి పెరిగిన ఒక ప్రతిష్టాత్మక సంస్థ, తన భవిష్యత్తు విస్తరణ, వృద్ధి ప్రస్థానం కోసం రాష్ట్రం దాటి వెళ్లాల్సిరావడంపై సర్వత్రా ఇప్పుడు మరోసారి చర్చ మొదలైంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక డిజిటల్ వేదికగా రూపొందించిన జగన్ 2.0 సూపర్‌యాప్‌ను వైసీపీ అధినేత జగన్‌ గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు.
భీమవరం, కిర్లంపూడి లలో పర్యటించారు. రెండు చోట్లా కూడా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలలో పట్టు నిరూపించుకోవడానికి ఆయన చేపట్టిన ఏ పర్యటన అయినా సరే.. ఉద్రిక్తతలు, గందరగోళం మధ్యే సాగుతున్నాయి.
రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కౌశిక్ రెడ్డి ఒక ఛాలెంజ్ విసిరారు. కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీటిని వెంటనే ఎత్తిపోయాలని, ఆ నీటిని అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మీదుగా ఎల్లంపల్లికి తరలించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఆ విధంగా నీటిని ఎత్తిపోసే ప్రక్రియలో అన్నారం లేదా సుందిళ్ల బ్యారేజీలకు ఏవైనా నష్టాలు లేదా ప్రమాదాలు జరిగితే, దానికి పూర్తి బాధ్యత తమదేనన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్.. ముద్రగడ సమాజానికి చేసిన సేవలను గుర్తించి ఈ గౌరవాన్ని కల్పించాలని నిర్ణయించారు. ఈ మేరకు అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షించాలని, అన్ని రకాల ప్రభుత్వ మర్యాదలు లోటు లేకుండా చూడాలని ఉన్నతాధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
ల్పపీడన ప్రభావంతో జులై మూడో వారంలో దేశవ్యాప్తంగా వర్షాలు మళ్లీ ఊపందుకోనున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు మధ్య భారతదేశం, తూర్పు రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది.
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సాగుతున్న ఈ వినూత్న నిరసన ప్రదర్శనలకు మెల్లిమెల్లిగా జనం ముఖం చాటేస్తున్నారు. పరీక్షల అవకతవకలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా డిమాండ్‌తో ప్రారంభమైన కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం.. ఆరంభంలో లక్షలాది మంది యువతను ఆకర్షించింది. అయితే క్రమక్రమంగా జనాదరణ కోల్పోయి ఇప్పుడు జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ఆ పార్టీ నిరసనలు తూతూ మంత్రంగా మారాయి.
ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలల్లో స్థానిక ఎన్నికల జరిగే అవకాశం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ ఇప్పటికే తమ పార్టీ శ్రేణులకు సమాచారం అందించారు. ఈ క్రమంలోనే ఎన్నికల వ్యూహాలను పక్కాగా అమలు చేయడానికి కూటమి పార్టీల ముఖ్య నేతల కీలక సమావేశం బుధవారం జరగనుంది.
హరీష్ రావు ఇప్పుడు తన కుటుంబ వ్యాపారమైన మిల్చీ మిల్క్  విషయంలో తలెత్తుతున్న ప్రశ్నలకు, వెల్లువెత్తుతున్న విమర్శలకూ సమాధానం చెప్పుకోలేక సతమతమౌతున్నారు.
విజయ్ ప్రస్తుతం చెన్నై ఈస్ట్ కోస్ట్ రోడ్డు (ఈసీఆర్) లోని నీలాంకరి నివాసంలో ఉంటున్నారు. అక్కడి నుంచి ఆయన సచివాలయం ఉన్న రాజాజీ రోడ్డుకు రోజువారీ ప్రయాణం చేస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.