జగన్ నిర్వాకం.. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ ఉనికి ప్రశ్నార్థకం

Publish Date:Sep 19, 2022

Advertisement

సంచలన విజయం సాధించిన పుష్ప సినిమాలో ఓ డైలాగ్ ఉంది. దొంగకు పోలీసుకు ఉన్న తేడా  బ్రాండేననీ, ఆ బ్రాండే ఇంటి పేరు అని అర్ధం వచ్చేలా ఓ ఇన్ స్పెక్టర్ ఆ డైలాగ్ చెబుతారు. అంటే ఇంటి పేరు లేని వ్యక్తికి సమాజంలో గౌరవం ఉండదని ఆ పాత్ర ద్వారా చెప్పించారు. అయితే ఒక రాష్ట్రానికి ఇంటి పేరు ఆ రాష్ట్ర రాజధానే అంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. రాజధాని లేని రాష్ట్రంగా ఇతర రాష్ట్రాలలో ఏపీ పరువు గంగలో కలిసిపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలలో చదువుకుంటున్న ఏపీ విద్యార్థులు రాజధాని లేని రాష్ట్రం కారణంగా అనేక అవమానాలు ఎదుర్కొంటున్నారు. వారందరూ మీ రాజధాని ఏదీ ఎంటు తోటి విద్యార్థుల ఎగతాళిని పంటి బిగువున భరిస్తున్నారు. అవమాన భారంతో తలదించుకుంటున్నారు. ఈ పరిస్థితి సాక్షాత్తూ ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భట్టు దేవానంద కుమార్తెకే ఎదురైంది. ఆయన కుమార్తె హస్తినలో చదువుకుంటోంది. ఆమెను తోటి విద్యార్థులు రాజధాని విషయంలో ఆటపట్టిస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు. విజయవాడలో జరిగిన ఓ పుస్తకావిష్కరణ సభలో మాట్లాడిన జస్టిస్ భట్టు దేవానంద్ కష్టపడి అనుకున్నది సాధించే విషయంలో తెలుగువారికి విశ్వవ్యాప్తంగా ఖ్యాతి ఉందన్నారు. అమెరికా సిలికాన్ వ్యాలీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగులలో అధిక శాతం మంది తెలుగువారే ఉండటమే ఇందుకు నిదర్శనమన్నారు. అయితే ఇప్పుడు విదేశాలలో ఉంటున్న ఏపీ వాసులు, దేశంలో ఇతర రాష్ట్రాలలో చదువుకుంటున్న విద్యార్థులు రాష్ట్రానికి రాజధాని లేకపోవడం వల్ల అనేక అవమానాలు ఎదుర్కొంటున్నారనీ, వారి గుర్తింపే ప్రశ్నార్థకంగా మారిపోయిందని అంటున్నారు. ఈ విషయాన్ని ఒక సభలో న్యాయమూర్తి జస్టిస్ భట్టు దేవానంద్ చెప్పారు. ఆయన న్యాయమూర్తిగా సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి.. ఆయన వెల్లడించిన ఈ అభిప్రాయం, ఈ ఆవేదన ఇప్పుడు సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యాయి.

ఇది ఆ న్యాయమూర్తి అభిప్రాయం మాత్రమే కాదనీ, యావదాంధ్రప్రదేశ్ ప్రజల ఆవేదనకు ప్రతిబింబమని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కు రాజధాని లేని పరిస్థితి ఏర్పడటానికి జగన్ నిర్వాకమే కారణమని విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యమంత్రిగా ఉండి కూడా జగన్ రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ అపఖ్యాతి మూటగట్టుకున్నా చూస్తూ ఊరుకోవడాన్ని ప్రశ్నిస్తున్నారు. మూడు రాజధానుల మూడు ముక్కలాటకు ఇకనైనా తెరదించి అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు.

అప్రతిహాతంగా కొనసాగుతున్న అమరావతి రైతుల ఆందోళన, కోర్టు తీర్పు లను పరిగణనలోనికి తీసుకుని తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లన్న వితండ వాదానికి స్వస్తి చెప్పాలని సూచిస్తున్నారు. రాష్ట్ర విభజన తరువాత విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబునాయుడు అమరావతిని రాష్ట్ర రాజధానిగా నిర్ణయించినప్పుడు ఏ ఒక్కరూ వ్యతిరేకించలేదు.

పైపెచ్చు మద్దతు  తెలిపారు. రైతులు స్వచ్ఛందంగా భూములిచ్చారు. ప్రస్తుతం మూడు రాజధానులంటూ భీష్మించిన సీఎం జగన్ కూడా నాడు విపక్ష నేతగా అమరావతికి పూర్తి మద్దతు ప్రకటించారు. 2014 ఎన్నికల సమయంలో తాను అధికారంలోకి వచ్చిన తరువాత కూడా అమరావతినే రాష్ట్ర రాజధానిగా కొనసాగిస్తానని హామీ కూడా ఇచ్చారు.అయితే అధికారంలోకి వచ్చిన తరువాత ప్లేట్ ఫిరాయించారు. అమరావతి ఒక్కటే కాదు రాష్ట్రానికి మూడు రాజధానులంటూ కొత్త పాట అందుకున్నారు. జగన్ నిర్ణయాన్ని అందరూ వ్యతిరేకించారు. ఆఖరికి కోర్టు కూడా అమరావతి నిర్మించాల్సిందేనని విస్పష్ట తీర్పు ఇచ్చింది.

అయినా కూడా మూడు రాజధానులంటూ జగన్ విన్యాసాలు ఆపడం లేదు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి రాజధాని లేని రాష్ట్రంగా మారిపోయింది. ఇంటా బయటా అవమానాలను, పరాభవాలను రాజధాని లేని రాష్ట్ర ప్రజలుగా ఆంధ్రప్రదేశ్ వాసులు ఎదుర్కొంటున్నారు. వారి అందరి ఆవేదనే హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్ భట్టు దేవానంద్ మాటల్లో ప్రతిబింబించింది. 

By
en-us Political News

  
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.