గ్రీన్ బడ్జెట్ కి సై అన్న మోదీ సర్కార్.. ఇంతకీ గ్రీన్ అంటే ఏంటి?
Publish Date:Feb 1, 2017
Advertisement
బడ్జెట్ అంటే లెక్కలు, పద్దులు. దేశం అభివృద్ధి చెందాలంటే ఏమి చేయాలి, ఏమి చేయకూడదు లాంటి విషయాలపై కీలక నిర్ణయాలు తీసుకునే ఆర్దిక మంత్రాంగం. అయితే, బడ్జెట్ లో ఆర్దిక మంత్రులు సాధారణంగా బోలెడు పొదుపు చర్యలు చేపడుతుంటారు. ఎక్కడా ఓ రూపాయి వృథా కాకుండా దేశ ఖజానాలో జమ అయ్యేలా జాగ్రత్తపడుతుంటారు. కాని, ఇక్కడ అత్యంత ఆశ్చర్యకర విషయమేంటంటే ఇన్నాళ్లూ దేశ సంపద పొదుపు చేయటానికి వేసుకున్న బడ్జెట్ కారణంగానే బోలెడు డబ్బు వృథా అయ్యేది. పైగా వాతావరణ కాలుష్యానికి కూడా దారి తీసేది. ఈ సారి మోదీ సర్కార్ గ్రీన్ బడ్జెట్ తో పొదుపు, అదుపు రెండు సాధించింది... మోదీ ప్రధాన నినాదాల్లో డిజిటల్ ఇండియా ఒకటి. అందుకు తగ్గట్టే ఈ సారి బడ్జెట్ ప్రతుల్ని కూడా డిజిటిల్ ఫార్మాట్ లోనే అందుబాటులో వుంచారు. వెబ్ సైట్లోకి వెళ్లి ఎవ్వరైనా ఫ్రీగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. కాని, పోయిన సంవత్సరం వరకూ బడ్జెట్ మొత్తాన్ని ప్రింట్ రూపంలో అందించే వారు. అసలు పోయిన సంవత్సరానికి ముందు 5వేల కాపీలకు పైనే అచ్చేసేవారు. ఈ కాపీ ఒక్కో దానికీ దాదాపు 3,500రూపాయలు ఖర్చయ్యేవి! అంత భారీ మొత్తంలో డబ్బు, చెట్ల నరకటం ద్వారా వచ్చిన పేపరూ ఖర్చు చేయటం వద్దని చాలా రోజులుగా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి...బడ్జెట్ ప్రతుల్ని వేలాది ఉచిత కాపీలుగా అందించే సంప్రదాయం ఎన్నో ఏళ్లుగా వస్తోన్న పోయిన సంవత్సరం బాగా కుదించారు. 5వేల నుంచి 2047కు సంఖ్యని తగ్గించారు. అయినా కూడా ప్రభుత్వ ఖజానాకు 70లక్షల పై మాటే ఖర్చైంది. అందుకే, ఈ సారి బడ్జెట్ ను మరింత తక్కువ కాపీలు అచ్చేశారు. కేవలం 788 ప్రతులు మాత్రమే లోక్ సభ, రాజ్య సభ సభ్యులకి అందించారు. మిగతా వారెవరైనా పార్లమెంట్ లోని కౌంటర్లో కొనుక్కోవాల్సిందే! మీడియా వారైనా డిజిటిల్ కాపీల్ని డౌన్ లోడ్ చేసుకోవాలి. ఈ నిర్ణయం వల్ల గవర్నమెంట్ కి భారీగా వ్యయం తగ్గటకమే కాక ఎంతో అమూల్యమైన పేపర్ కూడా సేవ్ చేసినట్టు అయింది. చెట్లను కాపాడినట్లు, గ్రీన్ బడ్జెట్ కు శ్రీకారం చుట్టినట్టు అయింది!
http://www.teluguone.com/news/content/budget-2017-45-71691.html





