Publish Date:Aug 12, 2026
వైసీపీ అధినేత జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో వైసీపీ నిరసనలు తుస్సుమన్నాయి. నాలుగు దశాబ్దాలకు పైగా వైఎస్ కుటుంబానికీ, జగన్ కు పెట్టని కోటగా ఉన్న పులివెందులలో జగన్ ప్రతిష్ఠ పూర్తిగా మసకబారింది. ఇటీవల ఏపీ ప్రభుత్వం చేపట్టిన మెగా డీఎస్సీ ప్రక్రియ, విద్యాశాఖ నిర్ణయాలకు వ్యతిరేకంగా వైసీపీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంా జరుగుతున్న నిరసనలు పులివెందులలో తుస్సు మన్నాయి. జగన్ కు పెట్టని కోట అయిన పులివెందులతో వైసీపీ నిరసనలకు జనం నుంచి స్పందన కరవైంది. అలాగే డీఎస్సీ అభ్యర్థులూ ఈ నిరసనలను పట్టించుకోలేదు. దీంతో జన సమీకరణ కోసం వైసీపీ స్థానిక నేతలు నానా తంటాలూ పడ్డారు. పులివెందులలోని ప్రైవేట్ కాలేజీల విద్యార్థులను బలవంతంగా నిరసన ర్యాలీలకు తరలించారు.
ప్రైవేటు కళాశాలల్లో చదువుకునే విద్యార్థులను రాజకీయ ఆందోళనల్లోకి లాగడంపై తెలుగుదేశం పార్టీ ఖండించింది. పులివెందుల టీడీపీ ఇన్‌ఛార్జ్, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి ఈ విషయంపై మాట్లాడుతూ... వైసీపీ నిర్వహించిన మెగా డీఎస్సీ వ్యతిరేక నిరసనల కోసం ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులను ర్యాలీలకు పంపడాన్ని తప్పుపట్టారు. పార్టీ శ్రేణులతో కలిసి సదరు ప్రైవేటు కాలేజీ వద్దకు చేరుకున్న బీటెక్ రవి, కాలేజీ యాజమాన్యాన్ని నేరుగా నిలదీశారు. రాజకీయ ప్రయోజనాల కోసం విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలనే డిమాండ్‌తో వైఎస్సార్‌సీపీ చేపట్టిన నిరసనల్లో ఒకవేళ లాఠీచార్జ్ లేదా ఏదైనా అవాంఛనీయ ఘటనలు జరిగి విద్యార్థులకు ఏమైనా ప్రమాదం జరిగితే ఆ బాధ్యత ఎవరిదని నిలదీశారు.
విద్యార్థులను రాజకీయ నిరసనలకు పంపినందుకు యాజమాన్యం తక్షణమే క్షమాపణలు చెప్పాలని, విద్యార్థులను ఆందోళనలకు తీసుకురావాలని ఒత్తిడి చేసిన వైర్‌సీపీ నేతలపై వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ 2025కి అనుకూలంగా కాలేజీ ఫ్యాకల్టీతో కలిసి ర్యాలీ నిర్వహించాలన్నారు. వైసీపీకి తిరుగులేని ప్రాబల్యం ఉన్న పులివెందులలో, ఎంపీ అవినాష్ రెడ్డి పర్యవేక్షించే పరిధిలో టీడీపీ నేత బీటెక్ రవి ఈ స్థాయిలో నిలదీయడం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
BTech Ravi Pulivendula, YSRCP DSC 2025 protest, Pulivendula TDP viral video, AP DSC controversy 2025, BTech Ravi warning private college, Kadapa Pulivendula politics
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/btech-ravi-pulivendula-25-228745.html
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.