బీఆర్ఎస్ టార్గెట్ కాంగ్రెస్.. బీజేపీకి లబ్ధి చేకూరేలా కేసీఆర్ చాణక్యం

Publish Date:Jan 20, 2023

Advertisement

కేంద్రంలో మోడీ సర్కార్ ను గద్దె దించడమే లక్ష్యం అంటూ  తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) పేరును భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మార్చి జాతీయ రాజకీయాలలోకి లాంగ్ జంప్ చేసిన కేసీఆర్ నిజంగా ఆ లక్ష్యంతోనే ముందుకు వెళుతున్నారా? అందు కోసమే దేశంలోని వివిధ రాష్ట్రాలలో బీఆర్ఎస్ శాఖల ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభించేశారా? ఆ దిశగా ఆయన అడుగులు సవ్యంగా పడుతున్నాయా? అంటే మాత్రం సంతృప్తి కరమైన సమాధానం రాదు.

ఆయన పైకి చెబుతున్న లక్ష్యం ఒకటి.. ఆచరణలో అమలు చేస్తున్న వ్యూహం మరొకటి అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.  కేసీఆర్ బయలకు బీజేపీ లక్ష్యం అని చెబుతున్నా.. ఆయన టార్గెట్ చేసింది మాత్రం కాంగ్రెస్స్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకు ఉదాహరణగా ఖమ్మం బీఆర్ఎస్ సభను చూపుతున్నారు. ఆ సభకు ఒడిశాకు చెందిన కాంగ్రెస్ నాయకుడు, ఒడిశా పీసీసీ కార్యదర్శి కైలాశ్ కుమార్ ముఖి హాజరు కావడం, ఆ మరునాడే ఆయన కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి బీఆర్ఎస్ గూటికి చేరనున్నట్లు ప్రకటించడాన్ని చూపుతున్నారు. అలాగే అంతకు ముందు ఒడిశా మాజీ సీఎం    గిరిధర్ గమాంగ్ తో సీఎం కేసీఆర్ భేటీ  అయ్యారు.  ఒడిశా నుంచి గిరిధర్ కుమార్, ఆయన కుమారుడు శిశిర్ గమాంగ్ ను ప్రగతి భవన్ కు పిలిపించుకుని మరీ కేసీఆర్ వారితో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. కాంగ్రెస్ సీనియర్ నేతగా... 9 సార్లు లోక్ సభ ఎంపీగా.. 1999, ఫిబ్రవరి 17 నుంచి 1999, డిసెంబర్ 6 వరకు ఒడిశా ముఖ్యమంత్రిగా వ్యవహరించిన గిరిధర్ గమాంగ్ తన కుమారుడికి కాంగ్రెస్ తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న అసంతృప్తితో ఉన్నారు. దీంతో ఆయన తన కుమారుడితో కలిసి కేసీఆర్ తో భేటీ అవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేసీఆర్ కాంగ్రెస్ టార్గెట్ గానే పావులు కదుపుతున్నారనడానికి వీటికి తోడు.. కర్నాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు ఆయన బేరసారాలు జరిపారన్న ఆరోపణలు కూడా బలం చేకూరుస్తున్నాయి.    ఈ ఏడాది జరగనున్న కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారన్నది రేవంత్ ఆరోపణ. ఆ రాష్ట్రానికి చెందిన దాదాపు పాతిక మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి కేసీఆర్ ప్రయత్నించారనీ, ఇందుకు వారికి రూ.500 కోట్ల రూపాయలు ఆఫర్ చేశారనీ టీపీసీసీ చీఫ్ ఆరోపించారు.

ఈ ఆరోపణలన్నిటికీ బలం చేకూర్చేవిగానే బీఆర్ఎస్ గమనం, ప్రస్థానం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పైకి బీజేపీని గద్దె దించడమేనని కేసీఆర్ చెబుతున్నా.. ఆయన అసలు లక్ష్యం మాత్రం కాంగ్రెస్ ను నిర్వీర్యం చేయడమేనని అంటున్నారు. బీఆర్ఎస్ ద్వారా రాష్ట్రాలలో బీజేపీ వ్యతిరేక ఓటును చీల్చడమే కేసీఆర్ అక్ష్యమని అంటున్నారు.  

తన కుమార్తె కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ స్కాంలో పీకలోతు ఇరుక్కుపోవడం, అలాగే తనపైనా కొన్ని పాత కేసులు ఉండటంతో వాటి నుంచి బయటపడేందుకే కేసీఆర్ బీజేపీకి లోపాయకారీ సహకారం అందిస్తున్నారనీ, అందుకే బీజేపీ కాంగ్రెస్ ముక్త్ భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు తన వంతు దోహదం చేస్తున్నారనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఇవన్నీ పక్కన పెడితే వాస్తవంగా ప్రధాని నరేంద్రమోడీ, సీఎం కేసీఆర్ మంచి మిత్రులు, ఇద్దరూ కూడా ముచ్చటగా మూడో సారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ సాధించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. కేంద్రంలో మోడీ నాయకత్వంలో మరోసారి ప్రభుత్వం ఏర్పాటు.. అలాగే కేసీఆర్ తెలంగాణలో మరోసారి గద్దెనక్కాలన్న లక్ష్యం చేరుకోవాలంటే.. ఈ సారి అంత సులభ సాధ్యం కాదు. రెండు పర్యాయాలు అధికారంలో ఉన్న మోడీ, కేసీఆర్ లు ఇరువురూ కూడా తీవ్ర ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. అందుకే తమ లక్ష్యం నెరవేర్చుకోవడానికి ఇద్దరూ కూడా వ్యూహాత్మక వైరం పాటిస్తున్నారు.

ఈ ఆరోపణలన్నీ గతం నుంచీ ఉన్నవే. విపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలే. కేసీఆర్ బీఆర్ఎస్ ఏర్పాటు తరువాత ఆ ఆరోపణలన్నీ నిజమేనని నమ్మడానికి వీలు కలిగించేవిగానే కేసీఆర్ అడుగులు, వ్యూహాలూ ఉన్నాయి.  కేసీఆర్ జాతీయ రాగం అందుకున్న క్షణం నుంచీ ఆయన ప్రయత్నాలన్నీ కాంగ్రెస్ మిత్రపక్షాలను ఆ పార్టీకి  దూరం చేసి కాంగ్రెస్ ను ఏకాకిని చేయడంగానే సాగాయి. తమిళ నాడులో కాంగ్రెస్ మిత్ర పక్షంగా అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన డిఎంకే అధినేత ఆ ర్రాష్ట ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ను కలిశారు. కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేద్దాం రమ్మని ఆహ్వానించారు.  అలాగే, మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన కూటమిలోని శివసేన, ఎన్సీపీలను కాంగ్రెస్ నుంచి విడదీసే ప్రయత్నం చేశారు. జార్ఖండ్ లోనూ కాంగ్రెస తో కలిసున్న ఝార్ఖండ్ ముక్తి మోర్చా ( జేఎంఎం) ను థర్డ్ ఫ్రంట్ లోకి తెచ్చే ప్రయత్నం చేశారు.  ఇలా చెప్పుకుంటూ పొతే కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ఆలోచన కాంగ్రెస్ ను బలహీన పరిచి బీజేపీని బలపరిచేందుకు చేసిన కుట్రగానే పరిశీలకులు చెబుతున్నారు. సరే కేసీఆర్ చేసిన ఆ ప్రయత్నాలు  ఫలించ లేదు అది వేరే విషయం.

ఇప్పుడు సొంతంగా బీఆర్ఎస్ పేరిట జాతీయ పార్టీ పెట్టి కూడా అవే ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ ప్రయత్నాలన్నిటి వెనుకా మోడీని మరో సారి కేంద్రంలో అధికారంలో కూర్చోపట్టి, తెలంగాణలో తన అధికారాన్ని పదిలం చేసుకోవడానికేనని పరిశీలకులు అంటున్నారు. పనిలో పనిగా తన కుమార్తె కవితను ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు నుంచి బయటపడేసేందుకు కూడా బీజేపీకి, మోడీకి తెరవెనుక నుంచి సాయపడుతున్నారని అంటున్నారు.  

By
en-us Political News

  
రాజకీయ కక్షలను పక్కనపెట్టి, రాష్ట్రాభివృద్ధి, స్థానిక స్వపరిపాలన బలపడే దిశగా అన్ని పార్టీలు అడుగులు వేయాలి. ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుంటూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పారదర్శకమైన ఎన్నికలను నిర్వహించడమే ఏ ప్రభుత్వానికైనా, వ్యవస్థకైనా అసలైన పరీక్షగా నిలుస్తుంది.
గతంలో స్థానిక ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న దౌర్జన్యాలు, హింసాత్మక ఘటనలకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించి, నాడు జగన్ హయాంలో అరాచకం ఏ రకంగా స్వేరవిహారం చేసిందో చూపి మరీ ఆ పార్టీ తీరును దుయ్యబట్టారు.  
వందలాది మంది కొత్త వ్యక్తులు వస్తే తనకు  ప్రాణహాని ఉందని, కెమెరాలు, ఫోటోలతో ఇంటి భద్రత బయటపడుతుందని జగన్  షర్మిల కుమార్తె వివాహం ఎలహంక ప్యాలెస్ లో వద్దనడానికి కారణంగా తన లేఖలో పేర్కొన్నారు. అయితే దీనికి వైఎస్ కుటుంబ సభ్యులు, షర్మిల కుటుంబం తప్పుపడుతోంది. ఈ నేపథ్యంలో   షర్మిల కుటుంబ సభ్యులు జగన్ కు సంధించిన లేఖాస్త్రంలో  వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన కుటుంబ వేడుకలను ప్రస్తావిస్తూ.. జగన్ ను వైఎస్సార్ కంటే గొప్పవాడివా అంటూ నిలదీశారు.
అధికారిక భేటీ ముసుగులో జరిగిన ఈ గోప్యతా ఉల్లంఘన ఉదంతం ఒక్కసారిగా రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ను పెంచేసింది. ఒక వార్తా ఛానెల్‌కు ఇచ్చిన  ఇంటర్వ్యూలో డీకే శివకుమార్ ఈ అంశానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.
జడ్పీ చైర్మన్ కావాలంటే ముందుగా జెడ్పీటీసీగా విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కదిరి నియోజకవర్గంలోని నల్ల చెరువు జెడ్పీటీసీ స్థానంలో పరిటాల రవి నామినేషన్ వేయనున్నారు.  పరిటాల శ్రీరామ్  విజయం కోసం క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూ భారీ విజయంపై తెలుగుదేశం కన్నేసింది.  
అధినేత జగన్ ప్రెస్ మీట్ పెట్టి మరీ గతంలోనే ఏపీలో స్థానిక ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగదని జోస్యం చెప్పారు.  అల్లర్లు జరుగుతాయని హెచ్చరికలు జారీ చేశారు. చివరకు ఆయన అన్నట్లుగానే జరిగింది. అల్లర్లకు కారణం ఎవరన్నది పక్కన పెడితే.. వైసీపీ సుప్రీం కోర్టుకు వెళ్లి మరీ మునిసిపోల్స్ కు రీ షెడ్యూల్ సాధించింది.
అధికారికంగా ఇటు షర్మిల కానీ, అటు జగన్ కానీ వివాహ వేడుక బెంగళూరు ప్యాలెస్ విషయంపై మాట్లాడలేదు. అయితే మీడియా కథనాల ఆధారంగా వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మాత్రం తగుదునమ్మా అంటూ మీడియా ముందుకు వచ్చి.. జగన్ నివాసం ఉంటున్న బెంగళూరు ప్యాలెస్ ఫంక్షన్ హాలేమీ కాదు.. పెళ్లిళ్లకు వేదికగా ఇవ్వడానికి అంటూ వ్యాఖ్యలు చేశారు. 
 సీజేపీ నిరసన తెలిపేందుకు అనుమతి కోరిన తర్వాత, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్టాండింగ్ ఆర్డర్ ద్వారా జంతర్ మంతర్‌ను నిరసన ప్రదేశంగా డీనోటిఫై చేయడం నుండి నీట్ పేపర్ లీక్ సమస్యల వరకు అన్నామలై కేంద్రాన్ని డిఫెన్స్ లోకి నెట్టేశారు.
కాన్వాయ్ భద్రతా సిబ్బంది లేకుండా, ప్రోటోకాల్స్ ను కాదని మరీ సీఎం చంద్రబాబు అధికారిక నివాసానికి చేరుకుని ఆయనతో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఈ భేటీలో ఇరువురూ, ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు  స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ జరగిందని అంటున్నారు.  
పరకాల ప్రభాకర్ మద్దతు కేంద్రానికి ఎందుకు షాక్ గా మారిందంటే.. ఆయన కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ భర్త కావడం వల్లనే. . ఈ ఉద్యమానికి ఒక అనూహ్య వ్యక్తి మద్దతు తెలపడంతో దీనికి మరింత బలం చేకూరింది.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త  పరకాల ప్రభాకర్, అక్టోబర్ 23న జరగనున్న ఈ నిరసనలో పాల్గొంటాననీ, బొద్దింకల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు, సంఘీభావం తెలుపుతాననీ ప్రకటించారు.   
దేశవ్యాప్తంగా లేదా ప్రధాన నగరాల్లో తాము నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలకు తాత్కాలిక విరామం ప్రకటించినట్లు పేర్కొన్నారు. తిరిగి  దీపావళి పండుగ తరువాత నుంచీ ఆందోళనలను పున: ప్రారంభించనున్నట్లు తెలిపారు.
2021లో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో జగన్ అధికారంలో ఉన్నారు. అప్పట్లో ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నా వైసీపీయులు అడ్డుకున్నారు. ఆ విషయాన్ని విస్మరించి.. ఇప్పుడు జగన్ అధికార కూటమి తమను నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకుంటోందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు
భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రస్తుతం అత్యంత కీలకమైన, ఆందోళనకరమైన మలుపు తిరుగుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.