వడ్డించే వాడు మనవాడైతే...

Publish Date:May 22, 2023

Advertisement

వడ్డించేవాడు మనవాడు ఉంటే ఆఖరి బంతిలో కూర్చున్నా ఏమి ఇబ్బంది లేదు అన్నట్టు ఉంది బీఆర్ఎస్ వ్యవహారం. ప్రస్తుతమున్న తెలంగాణ భవన్ కు తోడు కోకపేట కార్యాలయం ఓపెన్ అయ్యింది. పేదలు, బడుగు బలహీనవర్గాలు, డబ్బులు కట్టి కొనుగోలు చేసిన భూములను సైతం తిరిగి ఇవ్వని కెసిఆర్ తన పార్టీ కార్యాలయాలకు భూములు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని ప్రతిపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. 
బీఆర్ఎస్ పార్టీ విచ్చలవిడిగా దోపిడీ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్పీ. కోకాపేటలో బీఆర్ఎస్ కి రాష్ట్ర ప్రభుత్వం 11 ఎకరాల భూమిని కేటాయించడం దారుణమన్నారు. రూ.550 కోట్ల విలువైన 11 ఎకరాల భూమిని కేవలం రూ.37 కోట్లకే బీఆర్ఎస్ పార్టీకి కేటాయిస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు ఆర్ఎస్పీ.  విలువైన హైదరాబాద్ భూములను కెసీఆర్ కొట్టేస్తున్నారని ఆయన బలమైన వాదన. 
మంత్రివర్గ నిర్ణయాన్ని కెసీఆర్ మేనల్లుడు, మంత్రి టి హరీష్ రావ్ వెల్లడించారు. మంత్రి ఈ నిర్ణయాన్ని వెల్లడించినప్పుడు ఇతర మంత్రులు హర్షధ్వానాలు చేశారు. 
నిరుడు హెచ్ఎండిఏ ఆక్షన్ నిర్వహించింది. ఈ ఆక్షన్ లో ఎకరం 60 కోట్ల రూపాయల బిడ్డింగ్ ప్రాసెస్ గా నిర్ణయించింది. ఈ లెక్కన కోకాపేట భూమి విలువ అక్షరాల రూ 660 కోట్ల రూపాయలు. 
కానీ కేసీఆర్ ప్రభుత్వం చెల్లించింది రూ 37 కోట్ల రూపాయలు చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. ఇది ఒక రకంగా మోసం, దగా అని ప్రతిపక్షాలు ఘోషిస్తున్నాయి. 
ఈ భూమిని కాజేయడానికి బిఆర్ఎస్ తెలివిగా పార్టీ కార్యాలయంతో పాటు వ్యక్తిత్వ వికాస క్లాసులు, నాయకులకు శిక్షణ ఇవ్వడానికి కార్యాలయం కావాలని కోరింది.  మే 12వ తేదీన అప్లయ్ చేసింది. వారం రోజులలోపు క్యాబినేట్ ఆమోదించింది. క్యాబినెట్ ఆమోదం తెలపడం, ప్రభుత్వ ఉత్తర్వు జారీ కావడం చకచకా జరిగిపోయింది. ఈ జీవో నెంబర్ ఎంత అనే విషయం తెలంగాణ ప్రజలకు తెలియదు. నాలుగు కోట్ల మంది మా వెనక ఉన్నారు అని చెప్పుకునే బిఆర్ఎస్ పార్టీ ఈ నాలుగు కోట్ల మందికి జీవో నెంబర్ గోప్యంగా ఉంచడంలో ఆంతర్యమేమిటో? 
ఒక్క హైదరాబాద్ లోనే కాదు ఇతర జిల్లాల్లో కూడా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాలకు భూములు పంచే జీవో జీవో 2018లో విడుదలైంది. కెసీఆర్ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశం నిర్ణయం తీసుకుని హడావిడిగా జీవో జారి చేసింది. ఈ జీవో కూడా గోప్యంగా ఉంచింది ప్రభుత్వం. అన్ని జిల్లా కార్యాలయాలు స్వంత భవనాల్లో కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లో ఇప్పటికే బంజారాహిల్స్ బిఆర్ ఎస్ కార్యాలయం ఉన్నప్పటికీ కొత్తగా మరో బిఆర్ఎస్ భవన్ కోకాపేటలో సేకరించడంలో ఆంతర్యం క్లియర్ కట్ గా తెలంగాణ ప్రజలకు అర్థం అయి ఉండాలి. హైదరాబాద్ భూములను కారు చౌకగా కొట్టేయడమేనని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరి ఇంత పెద్ద లావాదేవీలు ప్రభుత్వం తెలంగాణా భూములతో చేస్తున్నప్పుడు పారదర్శకత అవసరం లేదా? జీవోను ఎందుకు ఎందుకు రహస్యంగా ఉంచుతుంది ఈ ప్రభుత్వం. 

By
en-us Political News

  
రాజకీయ క్షేత్రంలో ముందస్తు ఊహాగానాలు, భవిష్యత్ ఎన్నికల అంచనాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి. ఈ నేపథ్యంలో సపోజ్ ఫర్ సపోజ్  ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందన్న చర్చ జోరందుకుంది. రానున్న  రాజకీయ సమీకరణాలపై   చర్చోపచర్చలు మొదలయ్యాయి.
కొండా సురేఖపై వేటు తప్పదనీ, ఆమెకు క్యాబినెట్ నుంచి ఉద్వాసన తప్పదన్న ప్రచారం జోరుగా సాధింది. ఒక దశలో రేవంత్ కేబినెట్ లోకి సురేఖ స్థానంలో మరో ఫైర్ బ్రాండ్ నాయకురాలు విజయశాంతిని తీసుకోనున్నట్లు కూడా వార్తలు వినిపించాయి. 
 ప్రభుత్వ మద్దతుతో జరిగే ఏకగ్రీవ ఎన్నికలు ఉంటాయన్న ఆయన రాజకీయ పార్టీ కోణంలో ఏకగ్రీవాలు ఉండకూడదని జగన్ అన్నారంటూ బొత్స  వివరణపై వైసీపీ నేతలు పెదవి విరుస్తున్నారు.
బహదూర్‌పురా నియోజకవర్గ ఎమ్మెల్యే మహ్మద్ ముబీన్‌ను రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) నియమించింది.
ఇండియా టుడే-సి ఓటర్ సర్వే అంచనాల ప్రకారం.. మొత్తం 25 లోక్‌సభ స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి  20 పార్లమెంట్ స్థానాలను దక్కించుకుంటుంది.
 దువ్వాడ కుటుంబ వ్యవహారం రచ్చకెక్కి పార్టీ ప్రతిష్ఠ మసకబారే పరిస్థితి రావడంతో వైసీపీ అధినేత జగన్ తప్పని సరిపరిస్థితుల్లో  దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు వేశారు.   అయితే పేరుకే సస్పెన్షన్ తప్ప ఆయన ఇప్పటికీ వైసీపీ ఎమ్మెల్సీగానే చెలామణి అవుతున్నారు.
తెలుగుదేశం కూటమి సునాయాసంగా 20 స్థానాలను కైవసం చేసుకుంటుంది.   2024 ఎన్నికల ఫలితాలు పునరావృతమౌతాయిని ఇండియా టుడే సర్వే పేర్కొంది.
సొంత పార్టీ శాసనమండలి సభ్యుడిపై  మహిళల పట్ల అసభ్యకర ప్రవర్తన మరియు వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తడంతో, ఎమ్మెల్సీ రహమత్ బేగ్‌పై వేటు వేశారు.
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్  రాజకీయ సన్యాసం స్వీకరించబోతున్నారా? అంటే ఔనన్న సమాధానమే వస్తున్నది.   ప్రత్యర్థులపై విమర్శలతో విరుచుకుపడే అనిల్ కుమార్ యాదవ్, తాజాగా చేసిన వ్యాఖ్యలను బట్టి రాజకీయవర్గాలలో ఆయన పొలిటికల్ రిటైర్మెంట్ ప్రకటించబోతున్నారా అన్న చర్చ జోరందుకుంది.  
రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొండా సురేఖకు ఉద్వాసన తప్పదనీ, ఆమె స్థానంలో  కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, సనీనటి విజయశాంతిని కేబినెట్ లోకి తీసుకునే అవ కాశాలు మెండుగా ఉన్నాయన్న చర్చ జోరుగా సాగుతోంది.
ఖర్గేతో భట్టి భేటీ.. హస్తం పార్టీలో తీవ్ర ఉత్కంఠ..!
నూకరాజు కుటుంబం ఆత్మహత్య వెనుక లవ్ జిహాదీ, మత మార్పిడికి ఒత్తిడి చేసిన సాధిక్ ఖాన్ అనే వ్యక్తికి కూడా వైసీపీతో అనుబంధం సంబంధం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్  అవుతున్నాయి. 
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయంలో అధికార పార్టీ నేతల మధ్య చోటుచేసుకుంటున్న పరిణామాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.