ర్యాలీల రగడ..చితగ్గొట్టుకున్న బీఆర్ఎస్-కాంగ్రెస్ కార్యకర్తలు!

Publish Date:Nov 9, 2023

Advertisement

తెలంగాణ ఎన్నికలు అధికార, విపక్ష పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన సంగతి తెలిసిందే.  ఏది ఏమైనా మరోసారి అధికారం దక్కించుకోవాలని బీఆర్ఎస్ పార్టీ ఆరాటపడుతుండగా.. ఈసారి ఎలాగైనా జెండా పాతి కారుకు చెక్ పెట్టాలని కాంగ్రెస్ విశ్వప్రయత్నాలు చేస్తున్నది. ఇప్పటికే ముందస్తు సర్వేలలో కాంగ్రెస్ కు అనుకూల పవానాలు వీస్తున్నట్లు తేలడంతో  కాంగ్రెస్ ఫుల్ జోష్ లో ఉంది. ఇదే సమయంలో తోమిదేళ్ళ పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్  అస్త్ర శస్త్రాలను ఉపయోగించి విజయాన్ని దక్కించుకోవాలని చూస్తున్నది.  రెండు పార్టీలూ ఈ ఎన్నికలను జీవన్మరణ సమస్యగా తీసుకోవడంతో   ఏ పార్టీ కూడా  ఏ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. ఈ క్రమంలోనే పలు చోట్ల ఘర్షణలు జరుగుతున్నాయి. ఉద్రిక్తతలు సైతం నెలకొంటున్నాయి.

కీలక దశకు చేరుకున్న తెలంగాణ ఎన్నికలలో ప్రస్తుతం నామినేషన్ల పర్వం కొనసాగున్నది. నామినేషన్ల దాఖలుకు శుక్రవారం (నవంబర్ 10) తో గడువు ముగియనుంది. ఈ క్రమంలోనే బుధవారం  ఇరుపార్టీలకు చెందిన పలువురు సభ్యులు  నామినేషన్లు దాఖలు చేశారు.  సీఎం కేసీఆర్ సహా పలువురు మంత్రులు, బీఆర్ఎస్ కీలక నేతలు కేటీఆర్, హరీశ్ రావు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వంటి వారంతా గురువారం నాడే తమ తమ నామినేషన్లను దాఖలు చేశారు.  అయితే, నామినేషన్ వేసే సమయంలో ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. కాంగ్రెస్ అభ్యర్థి మల్ రెడ్డి రంగారెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డిలు  ఓకేసారి నామినేషన్ వేసేందుకు ర్యాలీగా ఆర్డీవో కార్యాలయానికి  వచ్చారు. ఇద్దరూ భారీ ర్యాలీతో ఓకేసారి ఒకే మార్గంలో రావడం ఘర్షణకు కారణమైంది. ర్యాలీల  సందర్భంగా   వ్యాఖ్యలతో మొదలైన గొడవ చివరికి ఇరు పార్టీల కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే వరకూ వెళ్లింది.

హైదరాబాద్  శివార్లలోని   ఇబ్రహీంపట్నం  బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల ఘర్షణతో రణరంగం అయ్యింది.  ఇబ్రహీంపట్నం సెంటర్ దగ్గర బీఆర్ఎస్, కాంగ్రెస్ ర్యాలీలు ఎదురెదురు పడ్డాయి. ఈ సందర్భంగా ఒకరికి ఒకరు పోటాపోటీగా నినాదాలు చేయటంతో ముందు గొడవ మొదలైంది. అది కాస్తా ముదిరి రెండు వర్గాలు జెండా కర్రలతో ఒకరిపై ఒకరు దాడికి దిగారు. దీంతో పోలీసులు లాఠీఛార్జి చేయగా.. ఇరు పార్టీల కార్యకర్తలు రెచ్చిపోవడంతో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. వేలాది మంది కార్యకర్తలు రోడ్లపై ఉన్న బస్సులు, లారీల అద్దాలు ధ్వంసం చేసి బీభత్సం సృష్టించారు. ఇరు పార్టీల కార్యకర్తలు ఒకరిపై ఒకరు  రాళ్ల వర్షం కురిపించారు.

దొరికిన వారిని దొరికినట్లుగా జెండా కర్రలతోనే చితకబాదడంతో ఇరవై మందికి పైగా కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో మహిళా కార్యకర్తలు కూడా ఉన్నారు. నలుగురైదుగురు పోలీసులను కూడా కార్యకర్తలు చితకబాదారు. చివరికి భారీ సంఖ్యలో పోలీసులు రంగంలోకి లాఠీలకు పనిచెప్పడంతో  పరిస్థితి అదుపులోనికి వచ్చింది.  ఇరు పార్టీల అభ్యర్థులు ఒకేసారి నామినేషన్ వేసేందుకు వస్తున్నారని తెలిసినా, ఇరు పార్టీల కార్యకర్తలు వేల సంఖ్యలో రోడ్ల మీదకి వస్తారని తెలిసినా.. రెండు ర్యాలీలు ఎదురెదురు పడతాయని తెలిసినా పోలీసులు   ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా  బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య పచ్చగడ్డి వేసినా బూడిదయ్యేంత వేడి కనిపిస్తున్నది. ఇలాంటి సమయంలో  అప్రమత్తంగా ఉండాల్సిన పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహించారన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమౌతోంది. 

By
en-us Political News

  
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.