క‌విత‌కు నో బెయిల్‌.. కేసీఆర్ మౌనంపై కార్య‌క‌ర్త‌లు గుస్సా

Publish Date:Aug 12, 2024

Advertisement

ఢిల్లీ మద్యం కుంభకోణంలో  ఈడీ, సీబీఐ కేసుల్లో తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత‌కు క‌ష్టాలు వీడ‌టం లేదు. ఆమెకు బెయిల్ ఎప్పుడు వ‌స్తుందో తెలియ‌ని ప‌రిస్థితి. ఈ కేసులో 17నెల‌లుగా జైల్లో ఉంటున్న ఆప్ సీనియ‌ర్ నేత, ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మ‌నీశ్ సిసోడియాకు ఇటీవ‌ల  సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అదే కేసులో ఐదు నెల‌లుగా తీహార్ జైల్లోఉంటున్న క‌విత‌కు కూడా బెయిల్ వ‌స్తుంద‌ని అంద‌రూ భావించారు. బీఆర్ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు‌, క‌విత సోద‌రుడు కేటీఆర్ కూడా  వారం రోజుల కిందట మీడియా చిట్ చాట్ లో సోమ‌వారం సుప్రీంకోర్టు క‌విత‌కు బెయిల్ మంజూరు చేసే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని చెప్పారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆనందం వెల్లివిరిసింది. క‌విత జైలు నుంచి బెయిల్ పై బ‌య‌ట‌కు రాబోతున్నార‌ని అంతా భావించారు. బెయిల్ ప్ర‌క‌ట‌న రాగానే రాష్ట్ర వ్యాప్తంగా ట‌పాసులు కాల్చి సంబరాలు చేసుకునేందుకు  సిద్ధ‌మ‌య్యార‌ు‌. అయితే, బీఆర్ ఎస్ శ్రేణుల ఆశ‌లు అడియాశ‌ల‌య్యాయి. మ‌ద్యంత బెయిల్ కోరుతూ క‌విత సుప్రీం కోర్టులో వేసిన పిటీష‌న్ పై సోమ‌వారం విచార‌ణ జ‌రిగింది. కానీ, క‌వితకు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాక‌రించింది. ఆగ‌స్టు 20వ తేదీకి విచార‌ణ‌ను  వాయిదా వేసింది. 

మ‌ద్యం కుంభకోణం కేసులో క‌విత ఐదు నెల‌లుగా జైల్లో ఉంటున్నా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మౌనంగా ఉంటుండ‌టంపై ఆ పార్టీ శ్రేణుల్లో ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతోంది. కేంద్ర స్థాయిలో రాజ‌కీయ ప‌లుకుబ‌డి ఉండి.. రాబోయే రోజుల్లో దేశానికి ప్ర‌ధాని అయ్యేది తానే అని గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో చెప్పుకున్న కేసీఆర్‌.. కుమార్తె ఐదు నెల‌లుగా జైల్లో ఉన్నా విడిపించేందుకు ఎందుకు ప్ర‌య‌త్నాలు చేయ‌డం లేద‌ని పార్టీ శ్రేణులలో అసహనం వ్యక్తం అవుతోంది. వాస్త‌వానికి కుమార్తెను మ‌ద్యం కుంభకోణం కేసు నుంచి బ‌య‌ట‌ప‌డేసేందుకు కేసీఆర్ అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు ఆయ‌నకు సన్నిహితంగా ఉండే వారు చెబుతున్నారు. 

అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓట‌మితోపాటు.. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో ఒక్క సీటును కూడా బీఆర్ఎస్ గెలుచుకోలేక పోయింది. దీంతో కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఊసే లేకుండా పోయింది. ఈ క్ర‌మంలో కేంద్రంలోని బీజేపీ, కాంగ్రెస్ పెద్ద‌లు కేసీఆర్ పేరును దాదాపు మ‌ర్చిపోయారు. ఆయన పలుకుబడి కూడా గణనీయంగా తగ్గిపోయింది. ఫ‌లితంగా త‌న కుమార్తెను జైలు నుంచి విడిపించుకునేందుకు కేసీఆర్ చేస్తున్న ప్ర‌య‌త్నాలు  స‌క్సెస్ కావ‌డం లేద‌ు‌. ఈ విషయాన్నే పార్టీ అంతర్గత సమావేశాల్లో కేసీఆర్  ప్ర‌స్తావించిన‌ట్లు తెలిసింది.  అంతేకాదు, కుమార్తె అరెస్ట్ అయితే ఏ తండ్రికి అయినా బాధ ఉండదా అంటూ కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో అగ్నిపర్వతంలా రగిలి పోతున్నా సైలెంట్‌గా ఉండక తప్పడం లేద‌ని కేసీఆర్ అన్నారు. ఈ వ్యాఖ్యలను బట్టే కేసీఆర్ ఏ స్థాయిలో ఒత్తిడిలో ఉన్నారన్నది అర్ధమౌతుంది. 

క‌విత విష‌యాన్ని కాసేపు ప‌క్క‌న పెడితే.. ప్ర‌స్తుతం కేసీఆర్ వ్య‌వ‌హార‌శైలి పార్టీ శ్రేణుల్లో ఆగ్ర‌హానికి కారణమౌతోంది. ఓట‌మి త‌రువాత పార్టీని బ‌లోపేతం చేసేందుకు కేసీఆర్ ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌టంతో బీఆర్ఎస్ నేత‌లు, ద్వితీయ శ్రేణి నాయ‌కులు ఒక్కొక్క‌రుగా బీఆర్ఎస్ ను వీడుతున్నారు. పార్టీ స‌మావేశాల్లోనూ పాల్గొనేందుకు కేసీఆర్ పెద్ద‌గా ఆస‌క్తిచూప‌డం లేద‌ని తెలుస్తోంది. ఎవ‌రైనా కేసీఆర్ వ‌ద్ద‌కు వెళ్లి మాట్లాడితే త‌ప్పితే, కేసీఆర్ స్వ‌యంగా నేత‌ల‌ను పిలిపించుకొని స‌మావేశాలు ఏర్పాటు చేసి పార్టీ బ‌లోపేతానికి తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై ఎలాంటి సూచ‌న‌లు చేయ‌డం లేదని పార్టీ వర్గాలే చెబుతున్నాయి‌. దీంతో కేసీఆర్ తీరుపై పార్టీ శ్రేణులు త‌మ అసంతృప్తిని వ్య‌క్తం చేస్తున్నారు. ఎన్నిక‌ల్లో గెలుపోట‌ములు స‌హ‌జం,  ఓడిపోయినంత మాత్రాన ప్ర‌జల్లోకి రాకుండా ఉండ‌టం ఏమిట‌ని కేసీఆర్ తీరును కొంద‌రు నేత‌లు తప్పుపడుతున్నారు.

గ‌త ఐదేళ్ల కాలంలో ఏపీలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కుట్ర‌ల‌కు తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు నాయుడు అనేక క‌ష్టాల‌ను ఎదుర్కొన్నారు. వేధింపులకు గురయ్యారు. అక్రమంగా అరెస్టై జైలుకు వెళ్లాల్సి వ‌చ్చింది.  అయినా, చంద్ర‌బాబు ఎక్క‌డా ఢీలా ప‌డ‌కుండా త‌న అపార రాజ‌కీయ అనుభ‌వంతో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. ప్ర‌స్తుతం కేసీఆర్ కూడా చంద్ర‌బాబు ప‌ద్ద‌తిని అవ‌లంభించాల‌ని, ఎన్నికష్టాలు ఎదురైనా పార్టీ క్యాడ‌ర్ ను కాపాడుకుంటూ అధికార పార్టీ త‌ప్పుల‌ను ఎత్తిచూపాల‌ని బీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నారు. కానీ, కేసీఆర్ మాత్రం ఇంటికే ప‌రిమితం కావ‌డంతో పార్టీ శ్రేణులు ఆయ‌న తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. 


కుమార్తె కవితకు బెయిల్ వచ్చిన తర్వాతే పార్టీ కార్యక్రమాల్లో కేసీఆర్ పాల్గొనే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. కవిత బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాతే పార్టీ నేతలకు కేసీఆర్ పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండే అవకాశం కనిపిస్తున్నది. ఈ కారణంగానే అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు కేసిఆర్ పెద్దగా ఆసక్తి చూపడంలేదని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒక‌ ప‌క్క అధికార పార్టీ దూకుడుతో వ్య‌వ‌హ‌రిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో రాష్ట్రంలో అభివృద్ధి కార్య‌క్ర‌మాలు వేగంగా అమ‌ల‌వుతున్నాయి. దీంతో బీఆర్ ఎస్   త‌ర‌పున గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఇప్ప‌టికే ప‌ది మందికిపైగా చేర‌గా.. మ‌రికొంద‌రు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. లిక్క‌ర్ కుంభకోణం కేసులో క‌విత‌కు ఇప్ప‌ట్లో బెయిల్ వ‌చ్చే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు.  క‌విత‌కు బెయిల్ వ‌చ్చే వ‌ర‌కు కేసీఆర్ పార్టీ బ‌లోపేతంపై దృష్టి పెట్ట‌కుంటే కీల‌క నేత‌లంతా పార్టీని వీడే అవ‌కాశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. మ‌రోవైపు త్వ‌ర‌లో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు ప్ర‌భుత్వం క‌స‌ర‌త్తు చేస్తోంది. ఇప్ప‌టి నుండైనా కేసీఆర్ ప్ర‌జ‌ల్లోకి వ‌చ్చి బీఆర్ఎస్ శ్రేణుల్లో ధైర్యం నింప‌కుంటే రాబోయే కాలంలో గ్రామ స్థాయిలో బీఆర్ఎస్ ప‌ట్టు కోల్పోవ‌డం ఖాయ‌మ‌న్న వాద‌న ఆ పార్టీ శ్రేణుల నుంచి వ్య‌క్త‌మ‌వుతోంది. మ‌రి కేసీఆర్ ప్ర‌జ‌ల్లోకి ఎప్పుడు వ‌స్తారు..?  పార్టీ శ్రేణుల్లో నూత‌నోత్సాహాన్ని ఎప్పుడు నింపుతారో వేచి చూడాల్సిందే

By
en-us Political News

  
రాజకీయ కక్షలను పక్కనపెట్టి, రాష్ట్రాభివృద్ధి, స్థానిక స్వపరిపాలన బలపడే దిశగా అన్ని పార్టీలు అడుగులు వేయాలి. ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుంటూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పారదర్శకమైన ఎన్నికలను నిర్వహించడమే ఏ ప్రభుత్వానికైనా, వ్యవస్థకైనా అసలైన పరీక్షగా నిలుస్తుంది.
గతంలో స్థానిక ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న దౌర్జన్యాలు, హింసాత్మక ఘటనలకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించి, నాడు జగన్ హయాంలో అరాచకం ఏ రకంగా స్వేరవిహారం చేసిందో చూపి మరీ ఆ పార్టీ తీరును దుయ్యబట్టారు.  
వందలాది మంది కొత్త వ్యక్తులు వస్తే తనకు  ప్రాణహాని ఉందని, కెమెరాలు, ఫోటోలతో ఇంటి భద్రత బయటపడుతుందని జగన్  షర్మిల కుమార్తె వివాహం ఎలహంక ప్యాలెస్ లో వద్దనడానికి కారణంగా తన లేఖలో పేర్కొన్నారు. అయితే దీనికి వైఎస్ కుటుంబ సభ్యులు, షర్మిల కుటుంబం తప్పుపడుతోంది. ఈ నేపథ్యంలో   షర్మిల కుటుంబ సభ్యులు జగన్ కు సంధించిన లేఖాస్త్రంలో  వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన కుటుంబ వేడుకలను ప్రస్తావిస్తూ.. జగన్ ను వైఎస్సార్ కంటే గొప్పవాడివా అంటూ నిలదీశారు.
అధికారిక భేటీ ముసుగులో జరిగిన ఈ గోప్యతా ఉల్లంఘన ఉదంతం ఒక్కసారిగా రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ను పెంచేసింది. ఒక వార్తా ఛానెల్‌కు ఇచ్చిన  ఇంటర్వ్యూలో డీకే శివకుమార్ ఈ అంశానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.
జడ్పీ చైర్మన్ కావాలంటే ముందుగా జెడ్పీటీసీగా విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కదిరి నియోజకవర్గంలోని నల్ల చెరువు జెడ్పీటీసీ స్థానంలో పరిటాల రవి నామినేషన్ వేయనున్నారు.  పరిటాల శ్రీరామ్  విజయం కోసం క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూ భారీ విజయంపై తెలుగుదేశం కన్నేసింది.  
అధినేత జగన్ ప్రెస్ మీట్ పెట్టి మరీ గతంలోనే ఏపీలో స్థానిక ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగదని జోస్యం చెప్పారు.  అల్లర్లు జరుగుతాయని హెచ్చరికలు జారీ చేశారు. చివరకు ఆయన అన్నట్లుగానే జరిగింది. అల్లర్లకు కారణం ఎవరన్నది పక్కన పెడితే.. వైసీపీ సుప్రీం కోర్టుకు వెళ్లి మరీ మునిసిపోల్స్ కు రీ షెడ్యూల్ సాధించింది.
అధికారికంగా ఇటు షర్మిల కానీ, అటు జగన్ కానీ వివాహ వేడుక బెంగళూరు ప్యాలెస్ విషయంపై మాట్లాడలేదు. అయితే మీడియా కథనాల ఆధారంగా వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మాత్రం తగుదునమ్మా అంటూ మీడియా ముందుకు వచ్చి.. జగన్ నివాసం ఉంటున్న బెంగళూరు ప్యాలెస్ ఫంక్షన్ హాలేమీ కాదు.. పెళ్లిళ్లకు వేదికగా ఇవ్వడానికి అంటూ వ్యాఖ్యలు చేశారు. 
 సీజేపీ నిరసన తెలిపేందుకు అనుమతి కోరిన తర్వాత, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్టాండింగ్ ఆర్డర్ ద్వారా జంతర్ మంతర్‌ను నిరసన ప్రదేశంగా డీనోటిఫై చేయడం నుండి నీట్ పేపర్ లీక్ సమస్యల వరకు అన్నామలై కేంద్రాన్ని డిఫెన్స్ లోకి నెట్టేశారు.
కాన్వాయ్ భద్రతా సిబ్బంది లేకుండా, ప్రోటోకాల్స్ ను కాదని మరీ సీఎం చంద్రబాబు అధికారిక నివాసానికి చేరుకుని ఆయనతో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఈ భేటీలో ఇరువురూ, ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు  స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ జరగిందని అంటున్నారు.  
పరకాల ప్రభాకర్ మద్దతు కేంద్రానికి ఎందుకు షాక్ గా మారిందంటే.. ఆయన కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ భర్త కావడం వల్లనే. . ఈ ఉద్యమానికి ఒక అనూహ్య వ్యక్తి మద్దతు తెలపడంతో దీనికి మరింత బలం చేకూరింది.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త  పరకాల ప్రభాకర్, అక్టోబర్ 23న జరగనున్న ఈ నిరసనలో పాల్గొంటాననీ, బొద్దింకల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు, సంఘీభావం తెలుపుతాననీ ప్రకటించారు.   
దేశవ్యాప్తంగా లేదా ప్రధాన నగరాల్లో తాము నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలకు తాత్కాలిక విరామం ప్రకటించినట్లు పేర్కొన్నారు. తిరిగి  దీపావళి పండుగ తరువాత నుంచీ ఆందోళనలను పున: ప్రారంభించనున్నట్లు తెలిపారు.
2021లో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో జగన్ అధికారంలో ఉన్నారు. అప్పట్లో ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నా వైసీపీయులు అడ్డుకున్నారు. ఆ విషయాన్ని విస్మరించి.. ఇప్పుడు జగన్ అధికార కూటమి తమను నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకుంటోందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు
భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రస్తుతం అత్యంత కీలకమైన, ఆందోళనకరమైన మలుపు తిరుగుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.