సక్సెస్‌కి బ్రాండ్ అంబాసిడర్ మల్లన్న!

Publish Date:Nov 22, 2023

Advertisement

మంత్రి చామకూర మల్లారెడ్డి.. ఈ పేరు గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ మల్లన్న సభలు, సమావేశాలు, ప్రసంగాలకు ఎక్కడ లేని డిమాండ్ ఏర్పడింది.   ఔను.. పూలమ్మినా.. పాలమ్మినా అంటూ మంత్రి మల్లారెడ్డి చేసిన ఒక్క ప్రసంగం.. సోషల్ మీడియాలో దుమారమే రేపింది. పాలమ్మినా.. పూలమ్మినా.. కష్టపడిన.. సక్సెస్ అయినా అంటూ తన జీవితంలోని సక్సెస్ మంత్రను ఓ సభలో  మల్లారెడ్డి వివరించిన తీరు  ఆయనకి ఎక్కడలేని ఫేమ్ ను తీసుకొచ్చింది.  

డిగ్రీ చదువుని మధ్యలోనే ఆపేసినట్లు చెప్పుకొనే మల్లారెడ్డి.. హైదరాబాద్ వేదికగా పలు విద్యాసంస్థలను స్థాపించి బడా బిజినెస్‌మ్యాన్‌గా   మంచి పేరు తెచ్చుకున్నారు. నిజానికి 2014 ముందు మల్లారెడ్డి రాజకీయాలలో ఎవరికీ తెలియదు. 2014లో టీడీపీ తరపున మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు.  ఆ ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ తరపున ఎంపీగా ఎన్నికైన ఏకైక వ్యక్తి మల్లారెడ్డే.  ఆ తర్వాత 2016లో మల్లారెడ్డి తెలుగుదేశం పార్టీని వీడి టీఆర్ఎస్(ఇప్పుడు బీఆర్ఎస్)లో చేరారు. 2018 ఎన్నికల్లో  ఆ పార్టీ అభ్యర్థిగా  మేడ్చల్ నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో గెలిచి.. కేసీఆర్ కేబినెట్ లో స్త్రీ, శిశు సంక్షేమ, కార్మిక, ఉపాధి శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.  ఇప్పుడు 2023 అసెంబ్లీ ఎన్నికలలో ఆయన మళ్లీ మేడ్చల్ నియోజకవర్గం నుంచి  బీఆర్ఎస్ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు.  ఎన్నికల ప్రచారంలో భాగంగా సభలు, ర్యాలీలు, మీడియా డిబేట్లతో ఆయన బిజీగా ఉన్నారు.  

పూలమ్మినా, పాలమ్మినా మల్లారెడ్డి అలా కష్ట పడే విజయానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఎదిగారు.  తెలుగు రాష్ట్రాలకు ఎందరో యువ ఇంజనీర్లను, వైద్యులను అందిస్తున్నారు. ఆయన స్థాపించిన  కాలేజీలలో చదివిన ఎందరో విద్యార్థులు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నత శిఖరాలను అధిరోహించారు. నేటికీ ఆయన కాలేజీలంటే ఒక బ్రాండ్.. ఆయన కాలేజీలలో సీటు పొందడం విద్యార్థులకు ఒక క్రేజ్. ఐటీ ఇండస్ట్రీ నుండి కార్పొరేట్ హాస్పటిల్స్ వరకూ..  ప్రపంచ పారిశ్రామిక రంగం నుండి.. అంతర్జాతీయ విమానయానం వరకూ.. ఆయన కాలేజీ విద్యార్థులంటే పిలిచి కొలువులు ఇవ్వాల్సిందే. ఇదీ విద్యారంగంలో ఆయన సెట్ చేసిన ట్రెండ్.  ఆయన విద్యాసంస్థలలో విద్యార్థులే కాదు.. పనిచేసే ఉద్యోగులకు ఒక క్రేజ్ ఉంటుంది. ఆయన కాలేజీ సిబ్బందిగా ఉద్యోగం సంపాదిస్తే లైఫ్ సెటిల్ అయినట్లే అనే టాక్ ఉంటుంది. అందుకే ప్రభుత్వ ఉద్యోగంతో సమానంగా మల్లారెడ్డి కాలేజీలలో ఉద్యోగాలకు పోటీ ఉంటుంది.

ఇక రాజకీయాలలో కూడా అంతే. ఆయన మాట తీరు ఫన్నీగా ఉండొచ్చు కానీ ఆయన పనితీరులో వంకలు పెట్టాల్సిన పనిలేదంటారు రాజకీయ విశ్లేషకులు. ఆయన ఏ పార్టీలో ఉన్నా మనసు పెట్టి పనిచేస్తారు. ఏ బాధ్యత ఇచ్చినా శక్తివంచన లేకుండా పని చేస్తారు. అందుకే మల్లారెడ్డి అంటే అన్ని పార్టీల నేతలకు దగ్గరి మనిషి అనే భావన ఉంటుంది. కష్టాన్ని నమ్ముకోని ఎదిగిన మనిషి కదా దాని విలువ తెలుసు కనుకనే తన కష్టాన్ని పదిమందికి చెప్పుకుంటారు.  ఇండియా బుక్ అఫ్ రికార్డ్స్ మాత్రం ఆయనను విజనరీ ఉన్న వ్యక్తిగా గుర్తించింది. ఈ ఏడాది ఆగస్టులోనే మల్లారెడ్డికి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ విజనరీ మ్యాన్ అవార్డ్ దక్కింది.  సైకిల్ మీద పాలమ్మిన వ్యక్తి నేడు ఇండియన్ బుక్ అఫ్ రికార్డ్స్ లో విజనరీ మ్యాన్ గా చోటు దక్కించుకున్నారంటే సక్సెస్ కి అసలు సిసలైన నిదర్శనం ఇదే అని చెప్పడానికి సందేహించాల్సిన అవసరమేముంటుంది?!

By
en-us Political News

  
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.