అంతా మా ఇష్టం అన్నట్లుగా బొత్స వ్యాఖ్యలు!

Publish Date:Jul 30, 2023

Advertisement

రాజ్యాంగం అనేది ఒకటి ఉంటుంది.. మన దేశంలో అదే సుప్రీమ్. దాని ప్రకారమే కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు నడుచుకోవాలి. దేశంలో అన్ని వ్యవస్థలు ఎలా ఉండాలో  రాజ్యాంగంలో   పెద్దలు పొందుపరిచారు. ఒ రాజ్యాంగ అమలులో ఎలాంటి లోపాలు ఉన్నా న్యాయస్థానాలు కల్పించుకొని సరిదిద్దుతాయి. ముందుగా హెచ్చరించి అప్పటికీ వినకపోతే మొట్టికాయలు వేసి మరీ అమలు చేయాలని ఆదేశిస్తాయి. అయితే, అంతిమంగా ఆదేశాలు అమలు చేయాల్సింది మళ్ళీ ప్రభుత్వాలే. సరిగ్గా ఇక్కడే వైసీపీ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే ఎన్నోసార్లు న్యాయస్థానాలలో మొట్టికాయలు తిన్నావైసీపీ నేతల తీరు మారడం లేదు. ఉన్నతాధికారులను సైతం బోనులలో నిలబెట్టి మొట్టికాయలు వేసి పంపింది. కానీ, తీరు మారనే లేదు.

 తాజాగా హైకోర్టు మరోసారి ఏపీ ప్రభుత్వంలోని ఇద్దరు కీలక అధికారులకు కోర్టు ధిక్కార నోటీసులు పంపింది. దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో సదరు అధికారులు హైకోర్టు మెట్లు ఎక్కాల్సి ఉంది. అయినా, ఇప్పటికీ ప్రభుత్వ పెద్దలు ఈ వ్యవహారంలో తామే కరెక్ట్ అని.. కోర్టులే తప్పని దబాయించడానికి ఇసుమంతైనా వెనుకాడటం లేదు. జగన్ సర్కార్ స్కూల్ విద్యార్థులకు ఏటా రూ.15 వేల రూపాయలు ఇస్తున్న సంగతి తెలిసిందే. పిల్లల తల్లుల ఖాతాలో ఈ డబ్బు జమ చేస్తూ వస్తున్నది. కాగా, ఈ ఏడాదికి సంబంధించిన నిధుల విడుదల కార్యక్రమం తాజాగా విజయనగరం జిల్లా కురుపాంలో జరిగింది. సీఎం వైఎస్ జగన్ పాల్గొన్న ఈ సభకు భారీ ఎత్తున స్కూలు విద్యార్దుల్ని, వారి తల్లితండ్రుల్ని తరలించారు.  పెద్ద సంఖ్యలో పిల్లలు హాజరైన ఈ సభలో  పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై  సీఎం జగన్ తీవ్ర విమర్శలు చేశారు.

 ఒక రాజకీయ సభకు విద్యార్థులను తరలించడం రాజ్యాంగానికి విరుద్ధం. పైగా చిన్నారులు ఉన్న ఒక సభలో పెళ్లిళ్లు, కాపురాలు అంటూ చేసిన వ్యాఖ్యలు మరింత దారుణం. దీంతో ఈ అంశంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. రాజకీయ సభలకు విద్యార్ధుల్ని తరలించవద్దంటూ గతంలో హైకోర్టు ఆదేశాలు జారీ చేయగా.. వీటిని ప్రభుత్వం ఉల్లంఘించిందని దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. స్ధానిక విద్యాశాఖాధికారి సమాచార హక్కు చట్టం ద్వారా ఇచ్చిన సమాచారం ఆధారంగా దాఖలైన ఈ పిటిషన్ పై శుక్రవారం( జూలై 28) హైకోర్టులో విచారణ జరిగింది. వాదనలు విన్న ధర్మాసనం విద్యార్థులను రాజకీయ సభలకు తరలించడం చట్టవిరుద్ధమని వ్యాఖ్యానించింది. ఏపీ విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ప్రవీణ్‌ ప్రకాశ్‌, హోంశాఖ కార్యదర్శి దీనిపై వివరణ ఇవ్వాలని కూడా ఆదేశించింది. 

దీనిపై స్పందించిన విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.. అమ్మ ఒడి సభకు విద్యార్థులు, తల్లిదండ్రులు రావడం తప్పు కాదని.. ఇంకా చెప్పాలంటే అసలు ఇలాంటి సభలకు పిల్లలు కాకుంటే సినీ నటులు వస్తారా? అని వెటకారంగా మాట్లాడారు. దీంతో మరోసారి బొత్స వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి.

అభం శుభం ఎరుగని అమాయక  చిన్నారుల ముందు ఈ సిగ్గులేని రాజకీయాలు మాట్లాడకూడదని, ఎంతో భవిష్యత్ ఉన్న విద్యార్థుల మెదళ్లలో ఈ కుళ్ళు రాజకీయాల బీజం పడకూడదనే.. రాజకీయ సభలకు విద్యార్థులను తరలించకూడదని కోర్టు చెప్పింది. కానీ, మన మంత్రి గారేమో చిన్నారులు కాకుండా సినీ స్టార్లు వస్తారా అని వెటకారంగా మాట్లాడడం చూస్తే వీళ్ళు మన రాజ్యాంగానికి ఏపాటి విలువ ఇస్తున్నారన్నది అవగతమౌతుంది. ఒకపక్క కోర్టులు ఇంతగా మొత్తుకుంటున్నా.. బోనులోకి పిలిచి వాయిస్తున్నా మాకు మేమే సుప్రీం, మేము రాసుకున్నదే రాజ్యాంగం అనేలా వైసీపీ నేతలు ప్రవర్తించడం సమాజానికే శ్రేయస్కరం కాదన్నది మేధావుల వాదన.

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.