జనసేన గూటికి బొత్స?.. ఉత్తరాంధ్రలో వైసీపీ ఖాళీయేనా?

Publish Date:Aug 3, 2026

Advertisement

వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, శాసనమండలిలో వైపీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణకు ఫ్యాన్ గాలి ఉక్కపోతగా మారిందా? వైసీపీని వీడి జనసేన గూటికి చేరనున్నారా? అన్న ప్రశ్నకు రాజకీయవర్గాల జరుగుతున్న చర్చ, వైసీపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలను బట్టి ఔనన్న సమాధానమే వస్తోంది. 

2024  ఎన్నికలలో రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ  రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఆ ఎన్నికలలో ఘోర పరాజయంతో గద్దె దిగిన తరువాత వైసీపీ గ్రాఫ్ వేగంగా దిగజారిపోతోంది. తాజా సర్వేలు కూడా అదే విషయాన్ని తేల్చి చెబుతున్నాయి.

ఈ నేపథ్యంలో పార్టీని బలోపేతం చేసేందుకు వైసీపీ అధినేత దూకుడు పెంచినా ఫలితం ఉండటంలేదు. గత తప్పిదాల కారణంగా వైసీపీ నేతలు ఒకరి వెంట ఒకరు అన్నట్లుగా కేసుల ఉచ్చుల్లో చిక్కుతున్నారు. ఇక  తెలుగుదేశం కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో  అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతుండటంతో వైసీపీ నేతలలో నిరాశ నిస్ఫృహలు అలుముకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే బొత్స సత్యనారాయణ జనసేన గూటికి చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారన్న వార్తలు జోరందుకున్నాయి. 


రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి సర్కార్ కొలువుదీరి రెండేళ్లు అవుతోంది.   మిగిలిన పదవీ కాలంలో మరింత సమర్థవంతంగా పాలన అందిస్తూ  పట్టు  నిలబెట్టుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. అదే సమయంలో  వైసీపీ అధినేత కూడా పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు దూకుడు పెంచినా ఆశించినట్లుగా పుంజుకోలేకపోతున్నది.  దీనికి తోడు రాజధాని, భోగాపురం వంటి కీలక విషయాలలో జగన్ ఏకపక్ష వైఖరితో  వైసీపీ నేతలలో అసంతృప్తి పేరుకుంటోంది. దీంతో తమ రాజకీయ భవిష్యత్ విషయంలో ఆ పార్టీ నేతలు ఆలోచన చేస్తున్నట్లు రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది.  

ఈ నేపథ్యంలోనే   బొత్స సత్యనారాయణ వైసీపీని వీడి జనసేన గూటికి చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.  ఉత్తరాంధ్రలో దశాబ్దాలుగా  తనకంటే ప్రత్యేక పట్టు ఉన్న  బొత్స కుటుంబం  వైసీపీకి దూరం అవ్వడమంటూ జరిగితే.. వైసీపీకి అది కోలుకోలేని దెబ్బ అవుతుందని పరిశీలకులు అంటున్నారు.   ఉత్తరాంధ్ర  రాజకీయాల్లో   బొత్స కుటుంబం తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా  రాజకీయ పోరాటాలు సాగించింది. ఈ నేపథ్యంలో బొత్సకు తెలుగుదేశంలోకి  ఎంట్రీ లేకపోవడంతో బొత్స జనసేన వైపు దృష్టి సారించారంటున్నారు. ఇందుకు పవన్ కల్యాణ్ కూడా సుముఖంగా ఉన్నారనీ, చంద్రబాబు సైతం నో అబ్జెక్షన్ అన్నారని రాజకీయవర్గాలలో జోరుగా చర్చ జరుగుతోంది.  

 ఉమ్మడి రాష్ట్రంలో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసే ప్రక్రియలో అప్పడు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న బొత్స సత్యనారాయణ కీలకంగా వ్యవహరించారు.    చిరంజీవితో బొత్సకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.  అలాగే పవన్ కల్యాణ్ తోనూ సత్సంబంధాలున్నాయి. ఆ పరిచయంతోనే బొత్స పవన్ కల్యాణ్ తో చర్చించి జనసేన ఎంట్రీకి మార్గం సుగమం చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. 

AP Politics, AP News, YCP, Uttarandhra, Telegu News 

By
en-us Political News

  
పీకే తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాపై 20 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ నియోజకవర్గం నుంచి 1995 నుంచీ వరుసగా బీజేపీయే విజయం సాధిస్తూ వస్తోంది. నవీన్ కిషోర్ ప్రసాద్ సిన్హా వరుసగా నాలుగు సార్లు విజయం సాధించగా, ఆ తరువాత ఇదే నియోజకవర్గం నుంచి ఆయన కుమారుడు, ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ వరుసగా విజయం సాధిస్తూ వచ్చారు.
పాలనాపరమైన కఠిన నిర్ణయాలే కాకుండా.. రాష్ట్ర ఆర్థిక, సాంకేతిక వృద్ధి కోసం విజయ్ ప్రభుత్వం వెట్రి తమిళగం విజన్ పేరుతో వియయ్ కార్యాచరణ ప్రకటించారు. ఈ విజన్ కింద 50 వేల కోట్ల రాష్ట్ర పెట్టుబడి నిధి ఏర్పాటుకు ప్రతిపాదించడమే కాకుండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీకండక్టర్ల రంగాలలో ప్రభుత్వం నేరుగా కో ఇన్వెస్టర్ గా భాగస్వామ్యం వహించేలా నిర్ణయించారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం క్రెడిట్ విషయంలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేస్తున్నవన్నీ డ్రామాలేనని కేంద్ర మంత్రి పెమ్మసాని విమర్శించారు. 2015లోనే నాటి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు, అప్పటి కేంద్ర మంత్రిఅశోక్ గజపతిరాజు చొరవతో భోగాపురం ఎయిర్‌పోర్టుకు రూపకల్పన చేసిందనీ, 2 వేల 200 ఎకరాల భూసేకరణ కూడా పూర్తి చేసిందని స్పష్టం చేశారు.
భోగాపురం విషయంలో వైసీపీ అధినేత జగన్.. ఒకే సమయంలో క్రెడిట్ చోరీకీ, విమానాశ్రయం సాకారం కావడం పట్ల విమర్శలకు పాల్పడటం అపహాస్యం పాలౌతోంది.
దీంతో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ ముఖ్యమంత్రి విజయ్ కావేరి వివాదంలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. కావేరి జలాలు తమిళనాడుకు అత్యంత కీలకమనీ, ఇతర రాష్ట్రాల వ్యూహాలను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే ఏకాభిప్రాయ సాధన అవసరమని అన్నారు.
జగన్‌లో మార్పు వుంటుందా, వుండదా అన్న అయోమయంలో వైసీపీ నేతలు.. ఆయనలో మార్పు వుండదన్న నిశ్చయానికి వచ్చేస్తున్నారు.
రాజకీయాల్లో విజయం అనేది కేవలం నాయకుల ఉపన్యాసాల వల్ల మాత్రమే సాధ్యం కాదు. అధికారం, రాజకీయ వేధింపులు, ఆంక్షలు ఎన్ని ఎదురైనా వెరవక
అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ పరిధిలో దాదాపు రూ. 7.5 కోట్ల విరాళాల దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలపై పార్లమెంట్‌ ద్వారం వద్ద స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్ కాషాయ వస్త్రాలు ధరించి, పూజారి వేషంలో ఒక పెద్ద హుండీతో కూర్చుని సేకరించిన విరాళాలను జేబులో వేసుకుంటూ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు.
నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే విశాఖను గ్లోబల్ ఐటీ, ఇండస్ట్రియల్ హబ్‌గా మార్చాలనే ఆలోచనతో ఈ భోగాపురం ప్రాజెక్టుకు చంద్రబాబు బీజం వేశారనీ, అయితే.. కాలక్రమంలో ప్రభుత్వాలు మారాయి, ప్రాజెక్టు ప్రతిపాదనలు మడతపడ్డాయన్నారు.
సిదిరి అప్పలరాజు కుమారుడు బైక్ నిర్లక్ష్యంగా నడిపి ఒకరి మృతికి కారణమయ్యారన్న కేసు దర్యాప్తులో వెలుగు చూసిన అంశాల మేరకు ఇందులో ఎలాంటి రాజకీయ కుట్రలు లేవు. సీదిరి అప్పలరాజు చేసిన అతే.. ఆయనను చట్టపరంగా ఇబ్బందుల్లోకి నెట్టింది.
ఎప్పుడో ఓ సారి జైల్లో ఉన్న నేతకు పరామర్శ పేరుతో బయటకు వచ్చే సందర్భాలలో కూడా సదరు నేతను పరామర్శించడం కంటే.. బల ప్రదర్శనకు, తనకు జనం మద్దతు ఉందని నిరూపించుకునే ప్రదర్శనలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆయన అలా బయటకు వచ్చిన ప్రతి సారీ అభాసుపాలౌతూనే ఉన్నారు.
ఢిల్లీ వీధుల్లో రగిలిన ఆగ్రహ జ్వాలలు, పోలీసుల లాఠీఛార్జీలు, కన్నీటి ధారలు, నిర్బంధాలను సైతం లెక్కచేయక హక్కుల కోసం వీధిపోరాటానికి దిగిన యువత ఆక్రందనలు
రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ తమ అమూల్యమైన భూములను ఇవ్వద్దు, భోగాపురం విమానాశ్రయాన్ని అందరం కలిసి అడ్డుకుందాం" అంటూ జగన్ ఇచ్చిన పిలుపుల ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతూ భోగాపురం విషయంలో జగన్ ద్వంద్వ వైఖరిని ఎండగడుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.