14 ఏళ్లు.. 35 బంతులు.. 100.. పరుగులు.. వాహ్ వైభవ్ సూర్యవంశి
Publish Date:Apr 28, 2025
Advertisement
13 ఏళ్ల వయసులో బీహార్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ లోకి ఎంట్రీ హెచ్చరిక మీరు ఈ విన్యాసాలు దయ చేసి ట్రై చేయవద్దు.. ఇది నిపుణుల పర్యవేక్షణలో జరిగినది అంటూ ఒక్కో యాడ్ లో మనం చూస్తూ ఉంటాం. క్రికెట్ హెచ్చరికః మీకు కూడా 14 ఏళ్లు వచ్చాయి కదాని ఇలాంటి బీభత్సమైన ఇన్నింగ్స్ ఆడకండి. మీకన్నా వయసులో పెద్దవారైన క్రికెటర్లు వెంటనే రిటైర్మెంట్ తీసుకుంటారని ఈ హెచ్చరికను మార్చి రాయాల్సి ఉంటుంది. ఒక చిన్న కుర్రాడు.. కాదు కాదు 14 ఏళ్ల చిచ్చర పిడుగు.. చేసిన విధ్వంసానికి కొత్త పేరు కనిపెట్టాలేమో. అవేం సిక్సులు.. ఒళ్లంతా తిరిగిపోతూ ఏకంగా 11 సిక్సులు బాదడంతో.. ఒక్కొక్కరికీ దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందని చెప్పాల్సి ఉంటుంది. టాప్ ఫోర్ లో ఉన్న గుజరాత్ టైటాన్స్ కి చెందిన బౌలర్లను ఎక్కడో చిట్ట చివరున్న రాజస్తాన్ రాయల్స్ కి యంగ్ కిడ్ వైభవ్ సూర్యవంశీ వచ్చి వారికి నైట్ మేర్ చూపించాడు. విచిత్రమేంటంటే సూపర్ స్ట్రైకర్, హయ్యస్ట్ సిక్సర్స్ వంటి వాటితో పాటు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అంటూ మొత్తం నాలుగు అవార్డులు తీసుకున్న సూర్యవంశీతో పాటు ఇతడికి బౌలింగ్ వేసి పది డాట్ బాల్స్ వేసిన రషీద్ ఖాన్ కి హయ్యస్ట్ డాట్ బాల్స్ అవార్డు తీస్కోవడం. ఇదెలా విచిత్రమంటే.. ఇంత విధ్వంసంలో ఆ మాత్రం డాట్ బాల్స్ వేసిన ఒకే ఒక్కడు రషీద్. ఇక గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్ మన్ గిల్ ని రవి శాస్త్రీ ఎంత గుచ్చి గుచ్చి అడుగుతుంటే సిగ్గుతో ఆ బాలుడి గురించి ఏం మాట్లాడడే. ఇదిలా ఉంటే.. ఇట్స్ హిజ్ ప్లే గ్రౌండ్.. అంటూ డిజిటల్ స్క్రీన్ పై పడ్డం ఎంతటి సెన్సాఫ్ హ్యూమర్ ఉండాలో కదా అనిపించింది. నేను బౌలర్ని చూడను బాల్ ని మాత్రమే చూస్తా అంటూ పెద్ద పెద్ద బౌలర్లను ఊచ కోత కోసిన ఈ కుర్రాడికి ఐపీఎల్ మొత్తం పెట్టిన పేరు బాస్ బేబీ. సచిన్ టెండూల్కర్ పై అయినా పాకిస్థాన్ వెళ్లినపుడు చిన్న పిల్లాడికి ఎలా బౌలింగ్ వేయాలా అని జాలి చూపిస్తే.. ఇంత చిన్న పిల్లాడి చేత ఇంతటి ఇంటర్నేషనల్ బౌలర్లయిన మాకు ఎంతటి ఘోర పరాభవంరా నాయనా! అంటూ సిరాజ్, ఇషాంత్ శర్మ, రషీద్ ఖాన్, ప్రసిధ్ కృష్ణ పడ్డ బాధ వర్ణనాతీతం. వీరందరిలోకీ ప్రసిద్ ఒకింత అదృష్టవంతుడు.. 35 బాల్స్ కి వన్నాట్ వన్ బాదిన ఈ టోర్నడో, ఈ తుఫాన్ ని ఇలాగైనా నేను కంట్రోల్ చేశానన్న సంతృప్తిని మిగుల్చకున్నాడు ప్రసిద్.. ఇప్పుడు సమస్య ఏంటంటే ఇంత చిన్న వయసులో ఇతడు సెట్ చేసిన రికార్డులు ఈ వయసులో క్రికెట్ ప్రాక్టీస్ చేసే కుర్రాళ్లపై చాలా చాలా ప్రెషర్ పడుతుందంటున్నారు కామెంటరేటర్లు. ఈ కుర్రాడ్ని పిక్ చేసిన రాహుల్ ద్రావిడ్ కి ఎంత చెడ్డ పేరంటే.. ఇంత భీకర బౌలర్లకు ఈ వయసు పిల్లాడ్ని వదిలి బలి పెడతారా ఎక్కడైనా? అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. సోమవారం (ఏప్రిల్ 28) వైభవ్ సూర్యవంశి ఆనందానికి ఒక హద్దంటూ లేదు.. తన తండ్రి క్రికెటర్ కావాలనుకున్నారు. కానీ ఆయన కాలేక పోయారు. అందుకే ఆ కసి కొద్దీ బ్రియాన్ లారా ఇన్ స్పిరేషన్ తో తాను క్రికెట్ ని చిన్న నాడే సీరియస్ గా తీసుకున్నాననీ, 2 ఏళ్ల పాటు ఇంట్లోనే ఆడి, ఆ తర్వాత సమస్తిపూర్.. ఆపై పాట్నాలో ట్రైనింగ్ తీసుకుని.. ఆ తర్వాత బోర్డుకు ఆడాననీ చెప్పిన సూర్యవంశీ.. ఆపై ఐపీఎల్ లో అడుగు పెట్టి ఇదిగో బ్రయన్ లారా ఇన్సిపిరేషన్ తో ఇలా విధ్వంస రచనలో వంద మంది సెహ్వాగ్ లను, వేయి మంది రిషభ్ పంత్ లనీ దాటేశాడు.. ఆల్ ఫార్మాట్ క్రికెట్ లో కొత్త చరిత్ర లిఖించాడు. 16 ఏళ్లకే క్రికెట్ లో అడుగు పెట్టానని ఇప్పటి వరకూ విర్రవీగుతూ వచ్చిన సచిన్ ని అయితే ఎప్పుడో వెనక్కు నెట్టేశాడు వైభవ్ సూర్యవంశీ. తాను ఇండియన్ క్రికెట్ కి రెప్రజెంట్ చేయడమే లక్ష్యంగా ఆశిస్తున్న వైభవ్ త్వరలోనే ఆ ఫీట్ కూడా షురూ చేసి.. ఎందరు బౌలర్లకు నిద్ర లేకుండా చేస్తాడో చెప్పలేం. మూడో మ్యాచ్ కే తన ప్రత్యర్ధి బౌలర్లను ముప్పు తిప్పలు పెట్టి.. మూడు చెరువుల నీరు తాగించిన.. వైభవ్ ఫ్యూచర్ లో మరిన్ని విధ్వంసాలు సృష్టించి కొత్త క్రికెట్ చరిత్రను రాయాలని ఆశిస్తూ... బేబీ బాస్ ప్లే కిడ్.. బిగ్ క్రికెట్.. హ్యాపీ క్రికెట్ జర్నీ
అండర్ 19 యూత్ టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా పై 58 బాల్స్ లో సెంచెరీ
ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చిన అతి పిన్న వయస్కుడిగా రికార్డ్
టీ20 క్రికెట్ లో హాఫ్ సంచెరీ చేసిన యంగెస్ట్ ప్లేయర్ (14 సం. 32 రో.)
సీనియర్ క్రికెట్ లో సెంచరీ చేసిన యంగెస్ట్ ప్లేయర్
ఇక్కడ ఇది
ద వరల్డ్ క్రికెట్ ఈజ్
యూవర్ ప్లే గ్రౌండ్..
రా కన్నా..
http://www.teluguone.com/news/content/boss-baby-thr-youngest-crickter-who-scored-century-in-ipl-25-197116.html





