బ్లూమింగ్‌టన్ తెలుగు అసోసియేషన్ సేవానిరతి
Publish Date:Dec 18, 2014
Advertisement
అమెరికాలోని బ్లూమింగ్‌టన్ తెలుగు అసోసియేషన్ తన సేవా నిరతిని చాటుకుంటోంది. ఇద్దరు చిన్నారుల అరుదైన వ్యాధికి శస్త్రచికిత్స కోసం డిసెంబర్ 20వ తేదీన బ్లూమింగ్‌టన్‌లోని వైడబ్ల్యుసీఎలో ‘బ్రేక్‌ఫాస్ట్ సేల్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. తమరా సెన్సర్ అనే వ్యక్తి ఇద్దరు కుమారులు మసోన్, ఆస్టిన్ అవయవ మార్పిడి చేయాల్సిన వ్యాధిని ఎదుర్కొంటున్నారు. అరుదైన ఈ వ్యాధికి శస్త్ర చికిత్స చేయాల్సిన అవసరం వుంది. దీని కోసం బ్లూమింగ్టన్ తెలుగు అసోసియేషన్ విరాళాల సేకరణ కార్యక్రమం నిర్వహిస్తోంది. డిసెంబర్ 20వ తేదీన ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ‘బ్రేక్‌ఫాస్ట్ సేల్’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. బ్లూమింగ్టన్ తెలుగు అసోసియేషన్, చిల్డ్రన్ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ ఆర్గనైజేషన్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి.
http://www.teluguone.com/news/content/bloomington-telugu-association-charity-program--22-41273.html
అమెరికాలో తెలుగు భాష అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్న సంస్థ సిలికానాంధ్ర. ఇప్పటి వరకు 6000 మందికి పైగా విద్యార్థులకు తెలుగు నేర్పిస్తున్న ఘనత సిలికానాంధ్ర సొంతం. తెలుగు విశ్వవిద్యాలయం గుర్తింపు పొందిన మనబడి
ప్రస్తుత విద్యాసంవత్సరంలో సిలికానాంధ్ర మనబడిలో 3000 మంది పిల్లలు చక్కగాతెలుగు వ్రాయటం , చదవటం , మాట్లాడటం నేర్చుకున్నారు. మరింతమంది రేపటి తరం పిల్లలకి ప్రణాళికాబద్ధంగా తెలుగు నేర్పించాలని చేసే ప్రయత్నమే సిలికానాంధ్ర మనబడి ప్రభంజనం 2014. సిలికానాంధ్ర మనబడి ప్రభంజనంలో భాగంగా , వచ్చే విద్యాసంవత్సరంలో 5000 మంది పిల్లలకి తెలుగు నేర్పించాలని లక్ష్యంగా





