Publish Date:Apr 18, 2025
బెట్టింగ్ యాప్‌లపై ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. బెట్టింగ్ యాప్‌ల వలన జీవితాలు నాశనం అవుతున్నాయని తనకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఎక్స్‌లో పెట్టిన ఒక పోస్టుపై లోకేష్ తీవ్రంగా రియాక్టయ్యారు.
Publish Date:Apr 18, 2025
ఏటీఎం లేని దేశం ఉంటుందంటే నమ్ముతారా? కానీ ఇంతకాలం ఏటీఎం లేని ఆ దేశంలో మొట్టమొదటి ఏటీఎం ఇప్పుడే ప్రారంభించారు. మన దేశంలో ఏటీఎం ప్రారంభించాలంటే ఏ బ్రాంచి మేనేజరో, ఇతర అధికారో వెళ్తారు. కానీ, పసిఫిక్ సముద్రంలోని ఓ ద్వీప దేశంలో దీని ప్రారంభోత్సవానికి.. ఏకంగా ప్రధానే హాజరయ్యారు.
Publish Date:Apr 18, 2025
పాస్టర్లకు నెలకు రూ. 5 వేలు చొప్పున గౌరవ వేతనం ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. దీంతో రాష్ట్రంలోని 8,427 మంది పాస్టర్లకు నెలకు రూ. 5 వేలు చొప్పున గౌరవ వేతనం విడుదల చేసేందుకు సీఎం చంద్రబాబు అధికారులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 2024, మే నుంచి నవంబర్ వరకు ఈ గౌరవ వేతనం విడుదల చేయనున్నారు. ఈ ఏడు నెలల కాలానికిగాను రూ. 30 కోట్లు కూటమి ప్రభుత్వం విడుదల చేసింది. ఈ ఏడు నెలలకు ఒకొక్క పాస్టర్‌కు రూ. 35 వేల చొప్పున లబ్ది చేకూరనుంది.
Publish Date:Apr 18, 2025
యూపీఐ పేమెంట్స్ పన్ను విధించడంపపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఇకపై యూపీఐ చెల్లింపుల మీద GST విధించనున్నారనే ప్రచారాన్ని కేంద్రం ఖండించింది. దేశంలో ఇకనుంచి రూ.2 వేలకు పైగా చేసే అన్ని రకాల యూపీఐ పేమెంట్స్ మీద కేంద్ర ప్రభుత్వం 18% GST విధించనున్నట్టు వస్తున్న వార్తలపై కేంద్ర ఆర్థిక శాఖ స్పందించింది.
Publish Date:Apr 18, 2025
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. అబిడ్స్, నాంపల్లి, బంజారాహిల్స్, మాదాపూర్, చైతన్యపురి, దిల్‌సుఖ్‌నగర్, వనస్థలిపురం, గాంధీభవన్, కార్వాన్, కుత్బుల్లాపూర్, మియాపూర్, గచ్చిబౌలి, నానక్‌రామ్‌గూడ, సికింద్రాబాద్, గాంధీ ఆసుపత్రి, మెట్టుగూడ తదితర ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది.పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో వాహనదారులు ట్రాఫిక్ జామ్‌ల కారణంగా తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.
Publish Date:Apr 18, 2025
తెలంగాణలో పెట్టుబడులు పెట్టి అభివృద్ధి చెందాలని జపాన్ పారిశ్రామిక, వ్యాపారవేత్తలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానం పలికారు. టోక్యో చాలా గొప్ప నగరం అని ఇక్కడి మౌలిక సదుపాయాలు, పర్యావరణ పరిరక్షణ, ఆవిష్కరణలు అద్భుతం అని సీఎం అన్నారు. ‘జపాన్ ప్రజలు సౌమ్యులు, మర్యాదస్తులు, క్రమశిక్షణ కలిగినవారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడానికి టోక్యో నుంచి చాలా నేర్చుకున్నాను’ అని సీఎం చెప్పారు తెలంగాణ మీకు హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతోంది. జపాన్‌ను ఉదయించే సూర్యుడి దేశం అని పిలుస్తారు. మా ప్రభుత్వ నినాదం ‘తెలంగాణ రైజింగ్’. ఈ రోజు తెలంగాణ జపాన్‌లో ఉదయిస్తోంది అని పేర్కొన్నారు.
Publish Date:Apr 18, 2025
ప్రధాని నరేంద్రమోడీ పర్యటన ఏర్పాట్ల పర్యవేక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంత్రల కమిటీని నియమించింది. ప్రధాని నరేంద్రమోడడీ మే 2న అమరావతికి రానున్న సంగతి తెలిసిందే.
Publish Date:Apr 18, 2025
ఏపీ వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి విజయవాడలోని సిట్ కార్యాలయానికి ఆయన వచ్చారు. ప్రస్తుతం సిట్ కార్యాలయంలో విచారణ కొనసాగుతోంది.
Publish Date:Apr 18, 2025
సహాయం అన్నది మాటల్లో కాదు చేతల్లో ఉండాలి అన్న విషయాన్ని పవన్ కల్యాణ్ నిరూపించారు. అడవి తల్లి బాట కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇటీవల అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటించారు.
Publish Date:Apr 18, 2025
హైదరాబాద్‌లోని ఎంఎంటీఎస్‌లో యువతిపై అత్యాచారయత్నం కేసులో ఇప్పుడు కీలక మలుపు చోటుచేసుకుంది. అసలు ఆమెపై అత్యాచారమే జరగలేదని పోలీసుల దర్యాప్తులో తేలింది. యువతి అధికారులకు అబద్ధం చెప్పినట్లు తెలిసింది
Publish Date:Apr 18, 2025
వేసవి ఉక్కపోతకు సామాన్యులు అల్లాడిపోకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక సరికొత్త పథకంతో ముందుకు రాబోతున్నది. అదే పీఎం ఏసీ యోజన.
Publish Date:Apr 18, 2025
సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని పట్నం హైవే హోటల్‌లో ఇద్దరు యువకులు తాగిన కూల్ డ్రింక్‌లో చనిపోయిన బల్లి కనిపించింది. హోటల్ యజమానిని ప్రశ్నించడంతో నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు. హోటల్ యజమాని తీరుపై సదరు యువకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు .ఆహార భద్రత అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు
Publish Date:Apr 18, 2025
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కానున్నారా? అన్న ప్రశ్నకు రాజకీయవర్గాలలో ఔననే సమాధానమే వస్తోంది. అయితే వీరి భేటీ ఎప్పుడు? ఎక్కడ జరుగుతుందన్న విషయంలో మాత్రం క్లారిటీ లేదు.