తెలుగు రాష్ట్రాలలో బీజేపీ త్రిముఖ వ్యూహం

Publish Date:Jun 13, 2023

Advertisement

కర్నాటక ఎన్నికలు బీజేపీకి కొత్త పాఠాలు నేర్పించాయి. పెళ్లికి, తద్దినానికి ఒకే మంత్రం పఠించే బీజేపీకి కర్నాటక ఫలతాలు చేదు జ్ణాపకాలను మిగిల్చాయి. దీంతో ఉత్తరాది వ్యూహాలు దక్షిణాదిలో వర్కౌట్ కావని అర్ధం చేసుకున్న బీజేపీ ఇప్పుడు కొత్త వ్యూహాలకు పదును పెడుతోంది. తెలంగాణ బీజేపీ రథ సారథి బండి సంజయ్ పార్టీ బండిని స్పీడుగా తోలుతున్నాడని అధిష్ఠానం భావిస్తూ వచ్చింది. తీరా ఇప్పుడు  చూస్తే అదంతా డొల్లేనని తేలిపోయింది.

 అధిష్ఠానం పెట్టిన చీవాట్లతో బండి చప్పుడు చేయకుండా కూర్చున్నారు.  గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ది కూడా పులేషం అని తేలిపోవడం, ఎంఐఎంతో సంబంధాలు క్రమంగా దెబ్బతినడంతో బీజేపీ ఈ సారి టీడీపీతో కలిసి వ్యూహరచనకు దిగింది. ఆంధ్రప్రదేశ్ లో కూడా బీజేపీ పరిస్థితి ఆశాజనకంగా లేదు. అక్కడ నాయకులు ఎక్కువ కావడంతో పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. తెలంగాణలో నలుగురు ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారన్న తృప్తి ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఆ తృప్తి కూడా లేకపోవడంతో అన్ని సమస్యలకూ పరిష్కారంగా తెలుగుదేశం పార్టీని బీజేపీ ఎంచుకుంది.  తెలుగుదేశం అధినేత చంద్రబాబును ఢిల్లీకి పిలిపించుకుని మంతనాలు చేసింది. బీజేపీకి దగ్గరగా మసలుతున్న జనసేన ఈ విషయంపై ఇంత వరకూ స్పందించ లేదు. ఆంధ్రకంటే ఆర్నెళ్లు ముందుగా జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించాలని బీజేపీ, టీడీపీలు భావిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.

ఇరు పార్టీలూ ఈ అంశంపై ఇంత వరకూ ప్రకటన విడుదల చేయలేదు. మరో వూపు 460 లోక్ సభ స్థానాల గెలుపును టార్గోట్ చేస్తూ నితీష్ కుమార్ దేశ వ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ, జాతీయ పార్టీలను ఏకం చేస్తున్నారు. ఆ కూటమిలో టీడీపీ, బీఆర్ఎస్ ఉంటాయా లేదా అనేది ఇంకా తేలలేదు. మరో వైపు 2024 ఎన్నికలలో 460 సీట్లను గెలవాల్సిందేనంటూ మోడీ ఇచ్చిన ఆదేశాలపై బీజేపీ అధిష్ఠానం పావులు కదుపుతోంది. ఇప్పటికి ఉన్న సమాచారాన్ని బట్టి 250 స్థానాలలో బీజేపీ విజయం సాధించగలదని ఆ పార్టీ బలంగా నమ్ముతోంది.  మిగిలిన 210 స్థానాల సాధించి మోడీ కళ్లలో ఆనందం చూడడానికి అమిత్ షా, నడ్డాలు ఎన్డీయే భాగస్వామ్య పక్షాలతో మంతనాలు జరుపుతున్నారు. తమిళనాడులో డీఎంకే మినహా అన్ని పార్టీలు, కర్నాటకలో జేడీఎస్, ఆంధ్రాలో వైసీపీ, టీడీపీ,  జనసేన పార్టీ, తెలంగాణలో     టీడీపీలతో సన్నిహితంగా  ఉండాలని బీజేపీ భావిస్తోంది.  కేరళలో సింగిల్ డిజిట్ స్థానాలు వస్తాయని బీజేపీ నమ్మకంతో ఉంది.

 దక్షిణాదిలో కర్నాటక నుంచి పాతిక మంది, తెలంగాణ నుండి నలుగురు సభ్యులు లోక్ సభకు ఎన్నిక కాగా, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లలో బీజేపీ ఖాతా తెరవలేకపోయింది. ఇంతటి దారుణమైన పరిస్థితుల్లో ఉన్న బీజేపీకి చంద్రబాబునాయుడు ఆపద్బాంధవుడిగా కనిపించారు. అమిత్, షా నడ్డాలు కూడబలుక్కొని టీడీపీ అధినేతను ఢిల్లీకి పిలిపించుకుని వ్యూహరచనకు శ్రీకారం చుట్టారు. దక్షిణాదిలో బీజేపీ పట్ల ఉన్న ఆదరణ సరిగ్గా అంచనా వేయగలిగిన చంద్రబాబు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో వ్యూహాన్ని పదునుపెట్టే పనిలో ఉన్నారని పరిశీలకులు భావిస్తున్నారు. 

By
en-us Political News

  
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.