ఇదేం రుబాబు రఘునందనా?

Publish Date:Mar 15, 2025

Advertisement

తిరుమల శ్రీవారి దర్శనానికి తెలంగాణ ప్రజా ప్రతినిథుల సిఫారసు లేఖల అంశం మరోసారి తెర మీదకు వచ్చింది. ఈ సారి బీజేపీ ఎంపీ రఘునందనరావు ఈ విషయాన్ని లేవనెత్తారు. తిరుమల గడ్డపై నిలబడి రుబాబు చేశారు. తెలంగాణ భక్తులను తిరుమల తిరుపతి దేవస్థానం నిర్లక్ష్యం చేస్తోందంటూ విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రజాప్రతినిథుల సిఫారసు లేఖలను టీటీడీ పరిగణనలోనికి తీసుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీకి, ఆంధ్రప్రదశ్ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు. అల్టిమేటమ్ జారీ చేసినట్లుగా మాట్లాడారు. ఈ వేసవి సెలవుల్లో తెలంగాణ ప్రజాప్రతినిథుల సిఫారసు లేఖలను టీటీడీ అంగీకరించకపోతే.. తెలంగాణ ప్రజాప్రతినిథులం అందరం తిరుమల వచ్చి చేయగలిగింది చేస్తామని హెచ్చరించారు. అసలాయన ఎక్కడి వారు, ఎక్కడకు వచ్చి ఏం మాట్లాడారు? అంటూ నెటిజనులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

గతంలో తెలంగాణ మంత్రి కొండా సురేఖ, మాజీ మంత్రి పద్మారావు వంటి వారు కూడా తిరుమలలో తెలంగాణ ప్రజా ప్రతినిథుల సిఫారసు లేఖలను అనుమతించాలంటూ డిమాండ్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదే విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి లేఖ కూడా రాశారు. ఆ లేఖపై సానుకూలంగా స్పందించిన ఏపీ సీఎం ఫిబ్రవరి నుంచి తెలంగాణ ప్రజాప్రతినిథుల లేఖలను తిరుమలలో పరిగణనలోనికి తీసుకుంటామని హామీ ఇచ్చారు. 

ఇప్పుడు తాజాగా మార్చి నెల సగం గడిచిపోయిన తరువాత కూడా తెలంగాణ ప్రజాప్రతినిథుల సిఫా రసు లేఖను టీటీడీ పరిగణనలోనికి తీసుకోవడం లేదంటూ రఘునందనరావు తిరుమలలో రుబాబు చేశారు. శుక్రవారం (మార్చి 14)న ఆయన తిరుమలేశుని దర్శించుకున్నారు. తెలంగాణ ప్రజాప్రతినిథి హోదాలో ఆయనకు టీటీడీ ప్రొటోకాల్ దర్శనం కల్పించింది. అయితే ఆయన సిఫారసు లేఖలకు అనుమతిపై ఏపీ సర్కార్, టీటీడీపై విమర్శలు గుప్పించడమే కాకుండా హెచ్చరిక కూడా జారీ చేశారు. వాస్తవానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో  రాష్ట్రంలోని మొత్తం 294 మంది ఎమ్మెల్యేలు, 42 మంది ఎంపీల సిఫారసు లేఖలను టీటీడీ అనుమతించేది. వారి సిఫారసు లేఖల మేరకు భక్తులకు దర్శనం కల్పించేది. అయితే రాష్ట్ర విభజన తరువాత  తిరుమలలో  తెలంగాణ ప్రజాప్రతినిథుల సిఫారసు లేఖలను అనుమతించాలా వద్దా అన్నది పూర్తిగా టీటీడీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయిం చుకోవలసిన అంశం. దీనిపై పొరుగు రాష్ట్రానికి చెందిన ప్రజాప్రతినిథులు రుబాబు చేయడం పూర్తిగా అనుచితం అంటూ నెటిజనులు ఓ రేంజ్ లో రఘునందనరావుపై విరుచుకుపడుతున్నారు. 

ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ లో కేవలం పది శాతం మంది భక్తులకు మాత్రమే రాష్ట్రప్రజాప్రతినిథుల లేఖల ద్వారా బ్రేక్, ప్రత్యేక ప్రవేశ దర్శనం లభ్యమౌతోంది. మిగిలిన 90శాతం మందీ కూడా సామాన్య భక్తులే. అయినా టీటీడీలో శ్రీవారి దర్శనం కోసం రాష్ట్రాల వారీ కోటా ఏమీ లేదు. మరి ఈ విషయంలో తెలంగాణ ప్రజాప్రతినిథులు తమ లేఖలను పరిగణనలోనికి తీసుకోవాలంటే హఠం చేయడం ఎంత వరకూ సబబు అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.  ఈ రాష్ట్రం, ఆ రాష్ట్రం అన్న తేడా లేకుండా తిరుమలేశుని దర్శనం కోసం టికెట్లు ఆన్ లైన్ లో అందుబాటులో ఉంటాయి. రాష్ట్రాల వారీ రిజర్వేషన్లు ఏమీ ఉండవు. అంటే తెలంగాణ భక్తులు కానీ మరో రాష్ట్రం భక్తులు కానీ తిరుమలేశుని దర్శనం విషయంలో వివక్షకు గురి కావడం లేదు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ వాసులకు ప్రత్యేక వెసులుబాటు కూడా ఏమీ లేదు. 

తెలంగాణ ప్రజా ప్రతినిధులు తిరుమల వచ్చిన సందర్భంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారికి ప్రొటోకాల్ దర్శనం కల్పిస్తోంది. ఇప్పుడు రఘునందరనావు కూడా కుటుంబ సమేతంగా  వతిరుమలలో  వీఐపీ దర్శనం చేసుకున్నారు. ఇక సిఫారసు లేఖలను కూడా అనుమతించాలని పట్టుబట్టడంలో అర్ధం లేదని నెటిజనులు విమర్శిస్తున్నారు. సామాన్య భక్తులకు సత్వర దర్శన భాగ్యం కల్పించడంపైనే టీటీడీ దృష్టి సారించాలని కోరుతున్నారు. రఘునందనరావు తిరుమలలో చేసిన రుబాబు ఆయన స్థాయికి తగినట్లుగా లేదని విమర్శలు గుప్పిస్తున్నారు.  

By
en-us Political News

  
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి సమక్షంలో శుక్రవారం దాదాపు ఐదుగంటల పాటు  సత్యప్రసాద్‌ తన వాంగ్మూలాన్ని నమోదు చేయించారు. ఈ ప్రక్రియలో పలువురు న్యాయవాదులు, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు   పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కీలక బాధ్యతలు నిర్వర్తించిన సత్యప్రసాద్, ఈ అక్రమ వసూళ్ల తంతు ఎలా సాగిందో సవివరంగా న్యాయమూర్తి ఎదుట చెప్పారు.
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.