కర్నాటకలో రేకలు రాలిన కమలం

Publish Date:Apr 20, 2023

Advertisement

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా, నామినేషన్ల గడువుకు ఒక రోజు ముందే అభ్యర్ధుల ఎంపిక కసరత్తును, దిగ్విజయంగా పూర్తి చేసింది. ఐదుగురు సభ్యులతో కూడిన చివరి జాబితాను  గురువారం (ఏప్రిల్ 20) విడుదల చేసింది. అలాగే  కొన్ని నియోజక్ వర్గాల్లో ముందు ప్రకటించిన అభ్యర్ధుల స్థానంలో కొత్తవారిని తెర మీదకు తెచ్చింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై పోటీ చేస్తున్న షిగ్గావ్ నుంచి తమ అభ్యర్థిగా మహ్మద్ యూసఫ్ సవనూర్‌ను ప్రకటించిన కాంగ్రెస్, తాజాగా ఆయన స్థానంలో స్థానికుడైన యాసిర్ అహ్మద్ ఖాన్ పఠాన్‌ను బరిలోకి దింపుతున్నట్లు ప్రకటించింది. 

షిగ్గావ్ ఎమ్మెల్యేగా బొమ్మై ఇప్పటికే మూడుసార్లు విజయం సాధించారు. షిగ్గావ్ నియోజకవర్గంలో లింగాయత్‌లు, ముస్లిం ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉంటారు. దీంతో నామినేషన్లు దాఖలు చేయడానికి తుది గడువు ముగియడానికి ఒక్క రోజు ముందు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని మార్చడం ఆసక్తికరంగా మారింది. కాగా, తుది జాబితాలో రాయచూర్ టికెట్ మహ్మద్ షలీమ్‌కు ఇచ్చిన కాంగ్రెస్.. సిడ్లఘట్ట నుంచి బీవీ రాజీవ్ గౌడ, సీవీ రామన్ నగర్ నుంచి ఎస్.ఆనంద్ కుమార్, అర్కాల్‌గుడ్ నుంచి హెచ్‌పీ శ్రీధర్ గౌడ, మంగళూరు సిటీ నార్త్ నుంచి ఇనాయత్‌ అలీని పోటీలో నిలిపింది.

నిజానికి, కాంగ్రెస్ పార్టీలో, ఏ పంచాయతీ లేకుండా సజావుగా అభ్యర్ధుల ఎంపిక సాగడం   ఐక్యతకు సంకేతంగా పరిశీలకులు భావిస్తున్నారు. అలాగే హస్తం పార్టీకి ఇదొక శుభ సంకేతంగా పేర్కొంటున్నారు. అదలా ఉంటే, ఎలాగైనా అధికారం నిలుపుకోవాలని ఆశిస్తున్న అధికార బీజేపీలో అభ్యర్ధుల ఎంపిక ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇంచు మించుగా మూడింట ఒక వంతు (75) టికెట్లు కొత్త వారికి ఇచ్చిన కమలం పార్టీలో క్రమశిక్షణ కట్టుబాట్లు కట్లు తెంచుకున్నాయి. కమలం రేకలు రాలిపోతున్నాయి.  టికెట్ ఆశించి భంగపడిన నాయకులు ఒకరివెంట ఒకరు క్యూ కట్టి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. 

బీజేపీ టికెట్ పై ఆరు సార్లు  ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ షట్టర్, మాజీ ఉప ముఖ్యమంత్రి  లక్ష్మణ్ సవాడీ తదితర బీజేపీ నేతలు ఇప్పటికే హస్తం గూటికి చేరగా.. తాజాగా బీజేపీ ఎమ్మెల్సీ విశ్వనాథ్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. 2017 వరకు కాంగ్రెస్‌లో ఉన్న ఆయన తర్వాత జేడీఎస్ తరఫు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆపరేషన్ కమలంలో ఆయన కీలక పాత్ర పోషించారు. రాజకీయ కారణాలతో తాను పార్టీ మారుతున్నట్లు ఆయన తెలిపారు. రెండు పర్యాయాలు మంత్రిగా పని చేసిన ఆయన 2017 వరకు కాంగ్రెస్ పార్టీ సభ్యుడు.

అనంతరం ఆయన జేడీఎస్‌లో చేరి హున్సూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆపరేషన్ కమలంలో భాగంగా.. 2019లో జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అనంతరం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. 2019 డిసెంబర్లో జరిగిన ఉపఎన్నికల్లో ఓడిన ఆయనకు 2020 జులైలో ఎమ్మెల్సీ పదవి దక్కింది. ఇప్పుడు ఆయన మళ్ళీ సొంత గూటికి చేరారు. 

అదలా ఉంటే, ఫిరాయింపుల ప్రభావం ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ షట్టర్, మాజీ ఉప ముఖ్యమంత్రి  లక్ష్మణ్ సవాడి ప్రభావం ఏ మేరకు ఉంటుందనే విషయంలో రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. జగదీశ్ షట్టర్ అయితే 25 నియోజక వర్గాల్లో బీజేపీ అభ్యర్ధులను ఓడిస్తానని ప్రకటించారు. అయితే, బీజేపీ నాయకులు మాత్రం జగదీశ్ షట్టర్  , జనసంఘ్’రోజుల నుంచి పార్టీలో ఉండి  ఎమ్మెల్యే టికెట్ కోసం కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని ఆయన కుటుంబ సభ్యులే జీర్ణించుకోలేక పోతున్నారని..ఆయన కుటుంబ సభ్యులు సైతం ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేసేందుకు సిదంగా ఉన్నారని అనటున్నారు.

అలాగే, సుదీర్ఘ కాలంగా ఆయనతో కలిసి పనిచేసిన పార్టీ స్థానిక నాయకులు , కార్యకర్తలు, జగదీశ్  షట్టర్ స్వతంత్ర అభ్యర్ధిగా పొటీకి దిగి ఉంటే ఆయనపై ఉన్న అభిమానంతో ఆయనను గెలిపించుకునే వారమని, పోయిపోయి కాంగ్రెస్ లో చేరి ఆయన తప్పు చేశారాణి అంటున్నారు. అలాగే  కాంగ్రెస్ పార్టీలో అంతా బాగుంది అనుకునేదుకు లేదని, ప్రస్తుతం తుపాను ముందు ప్రశాంతత ఉన్నా, ముందుముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చెప్పలేమని అంటున్నారు. ముఖ్యంగా ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఎలాంటి ప్రకంపనలు చోటు చేసుకుంటాయి అనేది కూడా చూడవలసి ఉందని పరిశీలకులు అంటున్నారు.

By
en-us Political News

  
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.