Publish Date:Jan 18, 2025
సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు ఇది తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు మనసా వాచా కర్మణా నమ్మి ఆచరించిన సిద్ధాంతం. రెండు రూపాయలకే కిలోబియ్యం.. పేదలకు జనతా వస్త్రాలు.. పేదలకు పక్కా ఇళ్లు.. వృద్ధులకు పెన్షన్ ..ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలలో ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. రాజకీయ చైతన్యాన్ని జనక్షేత్రానికి తీసుకువెళ్లిన ఘనత ఆయనదే. దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఎన్టీఆర్ చూపిన సంక్షేమ మార్గాన్నే అనుసరిస్తోంది. ఇది సత్యం. ఆయన ప్రవేశ పెట్టిన రెండు రూపాయలకే కిలో బియ్యం పథకం ఇప్పుడు దేశ వ్యాప్తంగా అమలు అవుతోంది. పేరు మారి ఉండొచ్చు. రూపాయికే కిలో బియ్యం ఇస్తుండొచ్చు కానీ ఆ పథకానికి ఆద్యుడు మాత్రం ఎన్టీఆరే. తాజాగా బీజేపీ కూడా ఎన్టీఆర్ బాటలోనే ఢిల్లీ ఎన్నికల కోసం తన మేనిఫెస్టోను విడుదల చేసింది. ఆ మేనిఫెస్టోలో వృద్ధులకు పెన్షన్లు ప్రకటించింది. ఇక తెలుగుదేశం ప్రభుత్వం ఎన్టీఆర్ పేరిట అన్న క్యాంటిన్లను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బీజేపీ కూడా ఢిల్లీ ఎన్నికల మేనిఫెస్టోలో అన్న క్యాంటిన్ల మాదిరిగా అటల్ క్యాంటిన్లు ప్రారంభించనున్నట్లు పేర్కొంది. ఆ క్యాంటిన్ల ద్వారా ఢిల్లీలో పేదలకు ఐదు రూపాయలకే నాణ్యమైన, రుచికరమైన భోజనం అందిస్తామని పేర్కొంది.
పేదల జీవితాల్లో సంక్షేమ వెలుగులు నింపిన ఎన్టీఆర్ దేశ రాజకీయాలలో ఆదర్శప్రాయుడిగా నిలిచారనడానికి ఇంత కంటే నిదర్శనం ఏం కావాలి. . ఇప్పుడు దేశ వ్యాప్తంగా అమలు అవుతున్న సంక్షేమ పథకాలన్నీ దాదాపు ఎన్టీఆర్ మస్తిష్కం నుంచి పుట్టినవేననడంలో సందేహం లేదు. కిలో రెండు రూపాయలకే బియ్యం పథకాన్ని ఆయన ప్రారంభిస్తే.. ఇప్పుడు అదే పథకం దేశ వ్యాప్తంగా అమలు అవుతున్నది. దేశంలో ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఎన్టీఆర్ సంక్షేమ బాటనే అనుసరిస్తోందనడంలో సందేహం లేదు. పార్టీలు సంక్షేమం పేరిట ప్రజలను సోమరులను చేస్తున్నాయనీ, దీని వల్ల దేశ ప్రగతి కుంటుపడుతోందని విమర్శలు గుప్పించిన పార్టీలు కూడా ఎన్టీఆర్ సంక్షేమ బాటనే అనుసరిస్తున్నాయంటే ఆయన సంక్షేమ పథకాలకు ప్రజలలో ఎంతటి ఆదరణ ఉందో ఇట్టే అవగతమౌతుంది.
ఎన్నికలలో ఓట్లు దండుకోవడానికి ఇచ్చే హామీలు దేశ భవిష్యత్ కు, ప్రగతికీ అత్యంత ప్రమాదకరమని విమర్శలు గుప్పించే బీజేపీ కూడా ఎన్టీఆర్ సంక్షేమ పథకాలను కొనసాగించక తప్పడం లేదంటే ప్రజాక్షేత్రంలో వాటి ప్రభావం ఎంత బలంగా ఉందో అవగతమౌతోంది. తాజాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ తన ఎన్నికల మేనిఫొస్టోను సంక్షేమ హామీలతోనే నింపేసింది. ఈ హామీలన్నీ ఎన్టీఆర్ ఎప్పుడో అమలు చేసినవే. . 60-70 ఏళ్ల మధ్య వృద్ధులకు నెలకు రూ. 2,500, 70 సంవత్సరాల పైబడి వారికి రూ.3 వేలు అందజేస్తామని బీజేపీ తన మేనిఫెస్టోలో పేర్కొంది. ఎన్టీఆర్ ఎప్పుడో వృద్ధులకు పెన్షన్ పథకాన్ని అమలు చేసిన సంగతి తెలిసిందే. కొసమెరుపేంటంటే ఎన్టీఆర్ పేరు మీద చంద్రబాబు సర్కార్ అన్న క్యాంటిన్లను ప్రారంభించి పేదలకు ఐదు రూపాయలకే నాణ్యమైన, రుచికరమైన భోజనం అందిస్తోంది. ఇప్పుడు బీజేపీ కూడా అదే బాటలో తాము ఢిల్లీలో అధికారంలోకి వస్తే మురికివాడలలో అటల్ క్యాంటిన్ల ద్వారా పేదలకు ఐదు రూపాయలకే భోజనం అందిస్తామని బీజేపీ మేనిఫెస్టో పేర్కొంది. ఇలా దేశంలోని ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజాదరణ పొందాలంటే ఎన్టీఆర్ సంక్షేమ మార్గాన్ని అనుసరించి తీరాల్సిందే. దేశ రాజకీయాలను ఇంతగా ప్రభావితం చేసిన నేత ఎన్టీఆర్ వినా మరొకరు లేరు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/bjp-follow-ntr-welfare-schemes-25-191495.html
వచ్చినది పోగాకు రైతుల కష్టాలు విని, వారికి అండగా ఉన్నానని సంఘీభావం తెలపడం. అయితే ఈ పర్యటనలో జనగ్ రైతులను కలవడం, వారి కనీస హామీ ధర డిమాండ్ల కోసం పోరాడటం కంటే, బల ప్రదర్శనకే ప్రాధాన్యత ఇచ్చారు. ఇక తన ప్రసంగం కూడా పరమ రొట్టకొట్టుడు పద్ధతిలో సాగింది.
2024 అసెంబ్లీ ఎన్నికలలో ఆముదాలవలస నియోజకవర్గం నుంచి ఓటమి పాలైనప్పటి నుంచీ తమ్మినేని రాజకీయంగా ఒకింత ఇన్ యాక్టివ్ గానే ఉంటూ వస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ కూడా తమ్మినేనిని ఆముదాలవలస నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పించి శ్రీకాకుళం పార్లమెంట్ పరిశీలక బాధ్యతలను అప్పగించారు. ఈ నిర్ణయం తమ్మినేనిలో తీవ్ర అసంతృప్తికి కారణమైందని ఆయన అనుచరులు చెబుతున్నారు.
వైఎస్ జగన్ ఆదేశిస్తే ఏమైనా చేస్తానంటూ సంచలన ప్రకటనలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచారు. అలాగే బోరుగడ్డ అనిల్ తన నోటి దురుసు, అనుచిత వ్యాఖ్యల కారణంగా తొమ్మిది నెలలపాటు జైలు జీవితం కూడా గడపాల్సి వచ్చింది.
తంజావూరు వేదికగా కావేరీ జలాల వివాదంపై మాట్లాడుతున్న సమయంలో ఉదయనిధి స్టాలిన్ సీఎం విజయ్, నటి త్రిషను ఉద్దేశించి పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. తమ అధినేత విజయ్‌ను అవమానించారంటూ టీవీకే శ్రేణులు తంజావూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడమే కాకుండా, జాతీయ మహిళా కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే చెన్నైలోని ఉదయనిధి నివాసానికి వెళ్లిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.
రాష్ట్రం వెనుకబాటుతనం నుంచి బయటపడాలంటే.. క్షేత్రస్థాయిలో ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. దశాబ్దాలుగా బీహార్ యువత ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి నెలకొందనీ, ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం సంక్షేమ పథకాలు, రాజకీయ పొత్తులతో కాలక్షేపం చేస్తే రాష్ట్ర భవిష్యత్ అంధకారం అవుతుందన్నారు.
రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లు, నిధుల కొరత నడుమ ఈ బడ్జెట్‌ను రూపకల్పన చేయడం ప్రభుత్వానికి సవాలుగా మారింది. ఒకవైపు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం, మరొకవైపు అభివృద్ధి లక్ష్యాలను సమర్థవంతంగా సాధించడం మధ్య సమతుల్యత పాటించాల్సి ఉంది. పరిమితమైన ఆర్థిక వనరులను దృష్టిలో ఉంచుకుని, ఏ రంగాలకు ఎంత మేరకు నిధుల కేటాయింపులు చేయనున్నారనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.
దేశంలో ఇటీవల వెలువడిన ఉప ఎన్నికల ఫలితాలు భారత రాజకీయ యవనికపై కొత్త సమీకరణాలకు నాంది పలుకుతున్నాయి.
వైసీపీలో నెలకొన్న నిస్తేజాన్నీ, నిరుత్సాహాన్నీ ఆసరాగా చేసుకుని, ఆ పార్టీకి పట్టు ఉన్న ప్రాంతాలలో కూడా తెలుగుదేశం కూటమి పాగా వేస్తోంది. ప్రధానంగా వైసీపీకి కంచుకోటగా భావించే రాయలసీమలో వైసీపీ బలాన్ని ఛేదిస్తూ, అభివృద్ధి మంత్రంతో క్షేత్రస్థాయిలో బలం పెంచుకుంటోంది.
తెలంగాణలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఇకపై టీ-ఫైబర్ ద్వారానే ఇంటర్నెట్ సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ ఫలితాలు మోదీ బ్రాండ్ ను మసకబార్చాయి. మోడీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతకు నిదర్శనంగా నిలిచాయి. ఈ ఫలితాలు కేవలం ఉప ఎన్నికలో తగిలిన ఎదురుదెబ్బగా కంటే బీజేపీపై ప్రజా వ్యతిరేకత పెచ్చరిల్లుతుందన్న భావననే ఎక్కువగా ఆవిష్కరించాయి.
అమెరికాలోని బోస్టన్ విశ్వవిద్యాలయంలో అభిజీత్ విద్య ఎలా అభ్యసించాడనే అంశంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ సూరత్‌కు చెందిన ఆర్‌టీఐ కార్యకర్త అమిత్ తివారీ కేంద్ర ఎన్నికల సంఘం, పన్నుల శాఖతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. అలాగే.. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సమకూర్చిన 1 కోటి రూపాయ నిధులపై అనుమానాలు వ్యక్తం చేశారు.
ఎటువంటి ఆధారాలు లేకుండా, కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇటువంటి అసత్య, అవమానకర, ద్వంద్వార్థ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. సామాజిక మాధ్యమాల్లో సైతం ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా సినిమా, రాజకీయ రంగాల నుంచి ఉదయనిధి శైలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
నీళ్లు ఎక్కడికి చేరినా చేరకపోయినా.. అక్కడికి మాత్రం తప్పకుండా చేరాలంటూ వ్యాఖ్యానించారు. ఆ వెంటనే తాను మాట్లాడింది కావేరీ జలాల గురించేనని చెప్పినా, ఉదయనిథి స్టాలిన్ వ్యాఖ్యలు నటి త్రిషను ఉద్దేశించి చేసినవేనంటూ విమర్శలు వెల్లువెత్తాయి.