Publish Date:Jun 10, 2026
ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ గా మాట్లాడుతూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటన తెలుగు రాష్ట్రాలలో ఆ పార్టీ పొత్తుల వ్యవహారంలో ఒక క్లారిటీ ఇచ్చింది. ఆ క్లారిటీ జనసేనకు తెలంగాణలో కమలం అండ ఆశలను ఆవిరి చేసింది. అదే సమయంలో తెలంగాణలో ఒంటరిగా బలోపేతం కావాలని భావిస్తున్న తెలుగుదేశం ఆశలకు ఊపిరి పోసింది.
మొత్తంగా తెలుగు రాష్ట్రాలలో బీజేపీ వ్యూహం ఏమిటన్న విషయాన్ని అమిత్ షా తేటతెల్లం చేసేశారు. దేశవ్యాప్తంగా కూటమి రాజకీయాలు నడుస్తున్న తరుణంలో.. కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా తెలంగాణ రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలు జనసేనకు ఒకింత ఇబ్బందికలిగేలా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, జనసేన పార్టీలతో పొత్తుతో 2024 ఎన్నికల్లో లబ్ధిపొందిన బీజేపీ.. ఆ పొత్తు తెలంగాణలో పొసగదని కుండబద్దలు కొట్టేసినట్లైంది. తెలంగాణలో కమలంతో కలిసి చక్రం తిప్పాలని ఆశిస్తున్న జనసేనాని పవన్ కల్యాణ్ కు బీజేపీ నిర్ణయం ఒకింత నిరాశ కలిగిస్తుందనడంలో సందేహం లేదు.
అమిత్ షా చేసిన ఈ తాజా అధికారిక ప్రకటన ప్రకారం, రాబోయే రోజుల్లో తెలంగాణలో జరగబోయే అత్యంత ప్రతిష్టాత్మకమైన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలతో పాటు, 2028లో వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ ఒంటరిగానే బరిలోకి దిగనుంది. భవిష్యత్తులో కూడా ఇక్కడ ఎవరితోనూ పొత్తులు పెట్టుకునే అవకాశం లేదని కుండబద్దలు కొట్టేశారు. దీంతో తెలంగాణలో తెలుగుదేశం, బీజేపీలు ఒంటరిగానే బరిలోకి దిగాల్సి ఉంటుంది. బీజేపీ ఈ నిర్ణయం పట్ల తెలుగుదేశం లో హర్షం వ్యక్తం అవుతున్నది. పొత్తులు లేకుండా బలం పుంజుకోవాలని చూస్తున్న ఆ పార్టీకి ఇది స్వాగతించే విషయమే. ఎందుకంటే.. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి నాయకుల కొరత ఉంది కానీ కార్యకర్తల బలం, బలగం ఇప్పటికీ చెక్కు చెదరలేదనే చెప్పాలి. అందుకే విభజన తరువాత జరిగిన ప్రతి ఎన్నికలోనూ అన్ని పార్టీలూ తెలుగుదేశం క్యాడర్ మద్దతు కోసం వెంపర్లాడాయి. గత అసెంబ్లీ ఎన్నికలలో అంటే 2023లో కాంగ్రెస్, బీఆర్ఎస్ లు పోటీపడి మరీ తెలుగుదేశం జెండాను భుజాన మోశారు. కాంగ్రెస్ ఎలక్షన్ ర్యాలీలలో అయితే బాహాటంగానే టీడీపీ జెండాలు రెపరెపలాడాయి.
దీంతో తెలంగాణలో ఒంటరి పోరే అన్న బీజేపీ నిర్ణయం తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో సొంతంగా బలోపేతం కావడానికి అంది వచ్చిన అవకాశంగా భావిస్తోంది. వాస్తవానికి తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర, బలమైన క్యాడర్, విస్తృతమైన అభిమాన వర్గం ఉంది. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఓటు బ్యాంకు, మెకానిజం చాలా వరకు రేవంత్ రెడ్డికి అనుకూలంగా పనిచేసి.. కాంగ్రెస్ కు అధికార పీఠం దక్కడంలో కీలక పాత్ర పోషించాయి. అదే రాష్ట్రంలో తెలుగుదేశం బరిలో ఉంటే ఆ క్యాడర్, మెకానిజం తెలుగుదేశానికి బలంగా మారతాయి. ఇప్పటి వరకూ తెలంగాణలో జనసేన ముద్ర పెద్దగా కనిపించిన దాఖలాలు లేవు. తెలంగాణ రాజకీయాల్లో సత్తా చాటాలని పవన్ కళ్యాణ్ ఎంతో పట్టుదలగా ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఒంటరి పోరు జనసేనకు అంత సులువు కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/bjp-alliance-with-tdp-and-janasena-limited-to-ap-39-222480.html
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని.
అయితే ఆయన తాజాగా నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు, వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో కలకలం రేపింది.
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు. ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం.