బీహార్ సీఎం నితీష్ యూటర్న్.. ప్రశ్నార్థకంగా విపక్షాల ఐక్యత?

Publish Date:Feb 15, 2023

Advertisement

సార్వత్రిక ఎన్నికల వేడి పెరుగుతున్న కొద్దీ విపక్షాల ఐక్యతారాగం శృతి తప్పుతోంది. కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించడమే లక్ష్యంగా బీజేపీయేతర పార్టీల ఐక్యత ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్న చందంగా సాగుతోంది. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలు ఎన్నికల సన్నాహాలలో మునిగిపోయి.. కేంద్రానికి వ్యతిరేకంగా తమతమ తమ అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. అదే సమయంలో కేంద్రంలోని మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా జట్టుకట్టేందుకు ప్రయత్నాలు కూడా షురూ చేశాయి.

అయితే బీజేపీయేతర పార్టీలలో సైద్ధాంతిక విభేదాలను పక్కన పెడితే.. ఆయా పార్టీలలో పరస్పర విశ్వాసం, నమ్మకం కొరవడిన పరిస్థితి కనిపిస్తోంది. విపక్షాల ఐక్యతకు కెటలిస్టుగా ఉంటారనుకున్న బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్  ఇప్పుడు  యూటర్న్ తీసుకున్నారన్న వార్తలు.. విపక్షాల ఐక్యతకు పెద్ద అవరోధంగా మారాయి. నితీష్ కుమార్  అమిత్ షా ల మధ్య ఫోన్ సంభాణన కు సంబంధించి వార్తలు రాజకీయ ప్రకంపనలు సృష్ఠిస్తున్నాయి.  ఎన్డీయే కూటమి నుంచి గత ఏడాది బయటకు వచ్చి.. బీజేపీకి వ్యతిరేకంగా గళం ఎత్తిన నితీష్ అంతలోనే ప్లేట్ ఫిరాయించారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.  నితీష్ కుమార్ తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో కలిసి బీజేపీ వ్యతిరేక శక్తులన్నిటినీ ఏకం చేసేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నారన్న ప్రచారం జరుగుతున్న తరుణంలో బీహార్ సీఎం కమలం గూటికి చేరేందుకు అడుగులు వేస్తున్నారన్న ప్రచారం విపక్షాల ఐక్యతకు ఆదిలోనే హంసపాదుగా మారింది.

కేంద్రం ఇటీవల 12 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిచిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే బీహార్ కూ కొత్త గవర్నర్ ను నియమించింది. బీహార్ కొత్త గవర్నర్ గా విశ్వనాథ్ రాజేంద్ర అర్లేకర్ నియమితులయ్యారు. ఇంత వరకూ బానే ఉంది. బీహార్ కు కొత్త గవర్నర్ నియామకం విషయం చెప్పేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా సీఎం నితీష్ కుమార్ కు ఫోన్ చేశారు. ఈ విషయాన్ని స్వయంగా నితీష్ కుమారే మీడియాకు చెప్పారు. ఇక్కడే నితీష్, బీజేపీల కుమ్మక్కు అనుమానాలు వెల్లువెత్తాయి.

బీజేపీయేతర ప్రభుత్వం ఉన్న రాష్ట్రానికి కొత్త గవర్నర్ నియామకం విషయం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎందుకు ఫోన్ చేసి మరీ బీహార్ సీఎంకు చెప్పారన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. పైగా నితీష్ కుమార్ బీజేపీకి ఆషామాషీగా గుడ్ బై చెప్పలేదు. తన నేతృత్వంలో బీహార్ లో అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వాన్ని కూలదోసి, తాను స్వయంగా ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చి బీజేపీకి బద్ధ శత్రువైన ఆర్జేడీ, కాంగ్రెస్ లతో మహాఘట్ బంధన్ పేర సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నితీష్ కుమార్ కు అమిత్ షా ఫోన్ చేసి మరీ కొత్త గవర్నర్ నియామకం విషయం చెప్పడం వెనుక ఉన్న రహస్యం ఏమిటని రాజకీయ వర్గాలలో చర్చ జోరందుకుంది.

బీజేపీకి వ్యతిరేకంగా రాజకీయ పార్టీల ఐక్యత కోసం నితీష్ కుమార్ స్వయంగా జాతీయ స్థాయిలో పలువురు నేతలను కలిశారు. అవి ఎంత వరకూ సఫలమయ్యాయన్న విషయాన్ని పక్కన పెడితే.. జాతీయ స్థాయిలో విపక్షాల ఐక్యతకు గండి కొట్టేందుకు బీజేపీ నితీష్ కుమార్ ను మళ్లీ కమలం గూటికి అంటే ఎన్డీయేలోకి తీసుకువచ్చేందుకు పావులు కదుపుతోందా అన్న అనుమానాలు పొలిటికల్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. నితీష్ కుమార్ విషయంలో విపక్షాలలో అనుమానాలు వ్యక్తం అయ్యేలా చేస్తున్నాయి. ఎందుకంటే నితీష్ కుమార్ పరిస్థితులను బట్టి దోస్తానీ, కటీఫ్ లు చెప్పడంలో ఆరితేరిన దిట్ట అన్నది అందరికీ తెలిసిన విషయమే.

ఈ నేపథ్యంలోనే  నితీష్ కుమార్‌కు అమిత్ షా కాల్ పట్ల బీజేపీయేతర పార్టీల నేతలలో శంక మొదలైంది. అయితే జేడీయూ అధికార ప్రతినిథి మాత్రం నితీష్ మళ్లీ ఎన్డీయే గూటికి అంటూ వస్తున్న వార్తలను ఖండించారు. నితీష్ కుమార్, జేడీయూ సంకీర్ణ ధర్మానికి కట్టుబడి ఉన్నాయన్నారు. బీజేపీ ముక్త భారత్ కోసం నితీష్ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని వివరించారు. 

By
en-us Political News

  
జగన్ అక్రమాస్తులకు సంబంధించిన కేసులలో విచారణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయించింది.  సీబీఐ నమోదు చేసిన కేసులతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పరిధిలోని కేసులన్నింటినీ కూడా  రోజు వారీగా విచారణ చేపట్టాలని కోర్టు నిర్ణయించింది. 
 వివేకా హత్య కేసులో  మనీలాండరింగ్ అంశంపై జరుగుతున్న విచారణలో భాగంగా  కడప ఎంపీ, వైసీపీ సీనియర్ నేత  వైఎస్ అవినాశ్ రెడ్డి హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.  
గతంలో ప్రజారాజ్యం పార్టీలో పవన్ కల్యాణ్‌తో కలిసి రాధ పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆయన జనసేన చేరికపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  
తనపై నమోదైన   పరువునష్ట కేసును కొట్టివేయాలని కోరుతూ రాహుల్‌ గాంధీ గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఆయన చే పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. కేసును కొట్టివేయలేమని స్పష్టం చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
సరే పలు కేసులలో అరెస్టై కొన్ని నెలల పాటు జైలులో గడిపి బయటకు వచ్చారు. ఆ తరువాత అయితే పూర్తిగా అజ్ణాత వాసంలో ఉన్నారా అన్నట్లుగా వంశీ పూర్తిగా మౌనం వహించారు. ఇంత సుదీర్ఘ విరామం తరువాత ఏమైందో ఏమో కానీ.. ఒక్కసారిగా తాను రాజకీయంగా యాక్టివ్ అవుతున్నట్లు ప్రకటించారు.
కవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ, మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో  వేదికపై పంచుకుంటూ మెట్రో రైలులో ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి  రేకెత్తిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భిన్నమైన వైఖరిని ప్రదర్శించారు.  ప్రధాని మోదీతో ఆదివానం ఒకే వేదిక పంచకున్న తమిళనాడు సీఎం విజయ్.. ఆ బహిరంగ వేదికపైనే  రాష్ట్ర సమస్యలను, అలాగే  రావాల్సిన నిధులను ప్రస్తావించి అందరి దృష్టినీ ఆకర్శించారు. ప్రధాని వేదికపైనే ఆసీనులై ఉన్నప్పటికీ, ఏమాత్రం సంకోచించకుండా రాష్ట్ర ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని విజయ్ కుండబద్దలు కొట్టారు. 
 సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేయే ప్రభుత్వ విధానాలపై న్యాయపోరాటానికి దిగడం, తనకు జరిగిన అన్యాయంపై పార్టీ హైకమాండ్ కూ, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై అగ్రనేత రాహుల్ కు ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరికలు జారీ చేయడం సంచలనంగా మారింది.  
జగన్ అక్రమాస్తులకేసుల విచారణను వేగవంతం చేయాలని ఈడీ కోర్టును ఆశ్రయించడాన్ని సమర్ధించిన తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ఈ కేసులను  కేవలం రోజువారీ విచారణ కాకుండా, ప్రతి రోజూ, రోజంతా విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.  
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఇండియా కూటమి నేతల విజ్ణప్తికి నో చెప్పారు. తనను కలవాలంటూ ఇండియా కూటమి నేతలు చేసిన అభ్యర్థనను ఆయన తిరస్కరించారు. రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కావడం కుదరదని విస్పష్టంగా తేల్చేశారు.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి   కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి  జనసేన అధినేత, ఉప ముఖ్య మంత్రి  పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన మంత్రుల గైర్హాజర్ పొలిటికల్ చర్చలకు వేదికగా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.