ఈ మూడు ఆహారాలు తింటే చాలు.. బాడీ స్టామినా అదే పెరుగుద్ది..!

Publish Date:Jan 24, 2025

Advertisement

 

శరీరాన్ని కాపాడటంలో స్టామినాది చాలా ముఖ్యమైన పాత్ర.  ఇది శరీరాన్ని తొందరగా అలసిపోకుండా చేయడంలో,  పెద్ద పెద్ద పనులను సునాయాసంగా చేయడంలో, ఏదైనా శారీరక ఇబ్బంది ఏర్పడినా దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడంలో సహాయపడుతుంది.  కానీ స్టామినా తక్కువ ఉంటే  శరీరం తొందరగా అలసిపోతుంది.  బాగా నీరసంగా అనిపిస్తుంది. ఎప్పుడూ శరీరానికి ఏదో జబ్బు పడ్డట్టు ఉంటుంది.  అయితే స్టామినాను పెంచుకోవడం తీసుకునే ఆహారం మీద ఆధారపడి ఉంటుంది.  కేవలం మూడు ఆహారాలు తింటూ ఉంటే చాలు.. శరీర స్టామినా ఊహించని విధంగా పెరుగుతుందట. ఇంతకీ ఆ ఆహారాలు ఏంటో తెలుసుకుంటే..

బాదం..

బాదం పప్పు స్టామినా పెరగడానికి బాగా సహాయపడుతుందట.  బాదం  పప్పులో ప్రోటీన్, విటమిన్-ఇ,  ఐరన్ వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరానికి అమితమైన బలాన్ని ఇవ్వడమే కాకుండా శరీరం బరువు పెరగకుండా చేస్తుంది.  మెదడుకు పదును పెడుతుంది.  ఎముకలను బలోపేతం చేస్తుంది.  

అరటిపండ్లు..

అరటిపండ్లలో విటమిన్లు సమృద్దిగా ఉంటాయి.  ఇందులో  ఫైబర్,  పొటాషియం ఉంటాయి.  ఇవి శరీరానికి శక్తిని ఇస్తాయి.  రోజూ ఒక అరటిపండు అయినా తింటూ ఉంటే బాడీ స్టామినా అనూహ్యంగా పెరుగుతుంది.  వ్యాయామం చేసేవారు,  ఫిట్ నెస్ ను తమ దినచర్యలో ఉంచుకునేవారు అరటిపండ్లు తప్పనిసరిగా తింటారు.  అరటిపండ్లు డోపమైన అనే హార్మోన్ ను ప్రోత్సహిస్తాయి.  ఇది అలసటను, పనిచేసేటప్పుడు నీరసం రాకుండా చేస్తుంది.

ఆకుపచ్చ ఆకుకూరలు..

ఆకుకూరలను  ప్రతిరోజూ తీసుకునేవారి శరీర స్టామినా మెరుగ్గా ఉంటుంది. ఇది శరీరానికి శక్తి పెంచడంలో బాగా సహాయపడుతుంది. ఆకుకూరలలో విటమిన్-ఎ, కాల్షియం, ఐరన్ వంటి పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా పాలకూర,  మెంతికూర,  మునగ ఆకు,  బచ్చలికూర ఆహారంలో తీసుకోవడమే కాకుండా.. ఆకుకూరల జ్యూస్ కూడా తీసుకోవచ్చు.

                                              *రూపశ్రీ.
 

By
en-us Political News

  
బిఎమ్ఐ.. దీన్నే బాడీ మాస్ ఇండెక్స్ అని అంటారు. ఎత్తుకు తగ్గ బరువు  ఉన్నారా లేదా తెలుసుకోవడంలో ఇది సహాయపడుతుంది. నేటి కాలంలో అన్ని వయసుల వారిలో అధిక బరువు , ఊబకాయం సమస్య వేగంగా పెరుగుతోంది.
ఇష్టమైన ఆహారం తింటూనే సులభంగా బరువు తగ్గాలనుకుంటున్నారా? సీనియర్ న్యూట్రిషన్ కన్సల్టెంట్ డాక్టర్ జానకి శ్రీనాథ్ సూచించిన అట్కిన్స్ డైట్ ప్లాన్ విశేషాలు తెలుగులో తెలుసుకోండి.
రోజంతా అలసటగా, నీరసంగా అనిపిస్తుందా? ఎంత విశ్రాంతి తీసుకున్నా శరీరంలో శక్తి లేకపోతే, అది కేవలం సాధారణ అలసట మాత్రమే కాకుండా Chronic Fatigue Syndrome (CFS) అనే ఆరోగ్య సమస్యకు సంకేతం కావచ్చు.
టి కాలంలో రోజులో మూడు పూటలా ఆహారం తీసుకోవడం కామన్.  ఉదయం టిఫిన్, మద్యాహ్నం భోజనం, రాత్రి భోజనం తప్పకుండా చేస్తారు.
మధుమేహం అనేది వేగంగా పెరుగుతున్న ఒక  వ్యాధి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, భారతదేశంలో మధుమేహ రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
కొందరికి కాలివేళ్లు , చేతివేళ్ల కీళ్లలో నొప్పి, మోకాళ్లు , చీలమండలలో వాపు, , నడవడంలో ఇబ్బంది వంటివి ఎదురవుతుంటాయి.  ఇవి యూరిక్ యాసిడ్ పెరగడానికి సంకేతాలు కావచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
మినుముల పులగం అనేది మన సంప్రదాయ ఆహారాల్లో ఎంతో విలువైనది. ఇది శరీరానికి అవసరమైన ప్రోటీన్, బలం, శక్తిని అందించే సహజమైన ఆహారం.
వర్షాకాలం వేడి నుండి ఉపశమనం కలిగించినప్పటికీ, వర్షం, నీరు నిలవడం, వరదలు వంటివి  వివిధ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి.
రుమటాయిడ్ ఆర్థరైటిస్ (Rheumatoid Arthritis) అనేది పెద్దవారికే వచ్చే వ్యాధి అని చాలామంది అనుకుంటారు. కానీ ఈ సమస్య పిల్లల్లో కూడా వచ్చే అవకాశం ఉంది.
ధూమపానం ఆరోగ్యానికి హానికరం.  ఈ విషయాన్ని పేపర్ లు,  టీవీ యాడ్స్ మాత్రమే కాకుండా ఏకంగా  సిగరెట్ ప్యాకెట్ ల పైన కూడా రాసి ఉంటుంది. ఇలా ఎవరు ఎంత చెప్పినా సరే..
గ్యాస్, అసిడిటీ, అజీర్ణం, కడుపు ఉబ్బరం సమస్యలకు ఇంట్లోనే వాము, ధనియాలు, జీలకర్ర, సోంపుతో ఆయుర్వేద చూర్ణం ఎలా తయారు చేయాలో డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ వివరించిన పూర్తి వీడియో.
మోకాళ్ల నొప్పి ప్రస్తుతం అన్ని వయస్సుల వారిలో కనిపిస్తున్న సాధారణ సమస్యగా మారింది. మెట్లు ఎక్కడం, నడవడం, ఎక్కువసేపు నిలబడటం వంటి రోజువారీ పనులు కూడా కష్టంగా అనిపిస్తాయి. ఈ వీడియోలో యోగా ఆచార్య ధాకారం గారు మోకాళ్ల నొప్పిని తగ్గించడంలో సహాయపడే ...
గాలి కాలుష్యం, ఆహార కాలుష్యం, నీటి కాలుష్యం.. ఇలా ప్రతిదీ కాలుష్యం కోరల్లో చిక్కుకుని ఉన్నాయి.  బయటకు వెళ్లినప్పుడు వాహనాల పొగతో పాటు ఎన్నో కారణాల వల్ల గాలి కాలుష్యం అవుతుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.