వాల్నట్స్ తింటే ఈ వ్యాధులు అన్నీ మాయం..!
Publish Date:Dec 27, 2025
Advertisement
వాల్నట్స్ లో పోషకాలు.. వాల్నట్స్ లో అత్యంత ప్రయోజనకరమైన పోషకాలు ఉంటాయి. వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ , యాంటీఆక్సిడెంట్లు చాలా పుష్కలంగా ఉంటాయి. వాల్నట్స్ లో చాలా పోషకాలు ఉంటాయి. వాల్నట్స్ తినడం వల్ల మెదడు పనితీరు మెరుగవుతుందని చాలామంది చెబుతారు. అయితే ఇది మాత్రమే కాకుండా చాలా రకాల వ్యాధులు కూడా నయం అవుతాయి. గుండె ఆరోగ్యం.. వాల్నట్స్ ను ప్రతిరోజూ ఆహారంలో భాగం చేసుకుంటే గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుందట. అంతేకాదు ఇది చెడు కోలెస్ట్రాల్ ను కూడా తగ్గిస్తుందట. రక్తపోటు.. రక్తపోటు సమస్యతో ఇబ్బంది పడేవారు రోజు వాల్నట్స్ ను తీసుకుంటూ ఉంటే చాలా మంచిది. రక్తపోటును నియంత్రించడంలో ఇది చాలా బాగా సహాయపడుతుంది. బరువు.. బరువు తగ్గడానికి ట్రై చేసేవారు వాల్నట్స్ తింటే చాలా మేలు. వాల్నట్స్ లో ఉండే ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు బరువు పెరగకుండా నిరోధిస్తాయి. తర్వాత బరువు తగ్గడంలో కూడా సహాయపడతాయి. మానసిక ఆరోగ్యం.. మానసిక ఆరోగ్యం కోసం చాలామంది ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే వాటితో పాటు వాల్నట్స్ ను కూడా తింటూ ఉంటే మానసిక ఆరోగ్యం బాగుంటుంది. ఇది మెదడు పనితీరుకు అవసరమైన ఒమెగా-3 ఆమ్లాలను కలిగి ఉండటం వల్ల మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే అల్జీమర్స్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. జీర్ణవ్యవస్థ.. జీర్ణవ్యవస్థ సరిగా లేకున్నా, జీర్ణాశయం పనితీరు మందగించినా చాలా సమస్యగా ఉంటుంది. జీర్ణవ్యవస్థను సరిచేసి తిరిగి ఆరోగ్యంగా చేయడంలో వాల్నట్స్ కీలకపాత్ర పోషస్తాయి. వాల్నట్స్ లో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. మలబద్దకాన్ని కూడా తగ్గిస్తుంది. వాపులు, నొప్పులు.. వాల్నట్స్ లో ఉంటే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ల7ణాలు వాపులను, కీళ్ల నొప్పులను తగ్గించడంలో సహాయపడతాయి. ఇవి కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తాయి. *రూపశ్రీ. గమనిక:
ఆరోగ్యం కోసం, శరీరానికి కావలసిన ప్రోటీన్, పోషకాల కోసం డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ తింటుంటారు. వీటిలో వాల్నట్స్ కూడా ముఖ్యమైనవి. ధర కాస్త ఎక్కువ అనే కారణంగా సాధారణ ప్రజలు వాల్నట్స్ కు దూరంగా ఉంటారు. అయితే వాల్నట్స్ ఆరోగ్యానికి చాలా బెస్ట్ అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. వాల్నట్స్ ను తీసుకోవడం వల్ల చాలా రకాల ఆరోగ్య సమస్యలు సులువుగా నయం అవుతాయని అంటున్నారు. ఇంతకూ వాల్నట్స్ ను తినడం వల్ల తగ్గే వ్యాధులు ఏంటి? వాల్నట్స్ లో ఉండే పోషకాలు ఏంటి? తెలుసుకుంటే..
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
http://www.teluguone.com/news/content/benefits-of-walnuts-34-211646.html




