Publish Date:Nov 24, 2024
దేశంలో సైబర్ క్రైమ్ లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. సైబర్ క్రిమినల్స్ బారిన పడుతున్న వారిలో ఉన్నత విద్యావంతులు, నిరక్షరాస్యులు అన్న తేడా లేకుండా అన్ని వర్గాలు, వయసుల వారూ ఉంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా సైబర్ నేరాలు ఊహించని రీతిలో పెరిగిపోతుండటం ఆందోళ నకరం. అయితే ఈ తరహా క్రైమ్ ల నిరోధంలో బ్యాంకులు మరింత క్రియాశీలంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బ్యాంకులు అప్రమత్తంగా ఉంటే వీటిని చాలా వరకూ నిరోధించవచ్చని ఇటీవల ఏపీలోని తిరువూరు, తెలంగాణ లోని మహబూబ్ నగర్ లలో జరిగిన ఉందంతాలు రుజువు చేశాయి.
ఇటువంటి సైబర్ క్రైమ్ లను దాదాపు 90 శాతం వరకూ బ్యాంకులలోనే నివారించే అవకాశాలు ఉన్నా యని సైబర్ పోలీసులు చెబుతున్నారు. బ్యాంకులు ఖాతా దారులకు ఇచ్చిన ఇంటర్ నెట్ బ్యాంకింగ్ సౌలభ్యాన్ని సైబర్ నేరగాళ్లు ఉపయోగించుకుని మోసాలకు పాల్పడుతున్నారు. అందుకే బ్యాంకులకు ఖాతా దారులను రక్షించే నైతిక బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. తిరువూరు,మహబూబ్ నగర్ లలో బ్యాంకు ఉద్యోగులు అప్రమత్తంగా వ్యవహరించడంతో 60లక్షల రూపాయల సైబర్ క్రైమ్ మనీ ట్రాన్స్ఫర్ ఆపగలిగారు. బ్యాంకులు అప్రమత్తంగా ఉంటే ఖాతాదారులను సైబర్ మోసాల నుంచి కాపడటం సులువు అని ఈ ఉందంతం రుజువు చేసింది. ప్రధాని నరేంద్రమోడీ తన మన్ కీ బాత్ కార్యక్రమంలో సైబర్ మోసాల గురించి ప్రస్తావించడమే ఇది ఎంత తీవ్ర ముప్పుగా పరిణమించిందో అర్ధం చేసుకోవచ్చు.
సైబర్ నేరాలను అరికట్టడంలో సౌదీ అరేబియా మొదటిస్థానంలో ఉంది.ఆ దేశం 2015లో 1.60 లక్షల సైబర్ నేరాలు జరిగినట్లు నమోదైనాయి.నేరాల నియంత్రణలో బహుముఖ వ్యూహం అనుసరించి 100 శాతం విజయం సాధించింది. 2017లో నేషనల్ సైబర్ సెక్యూరిటీ అధారిటీ ని స్థాపించి సైబర్ నేరాల నియంత్రణే లక్ష్యంగా వ్యూహాత్మకంగా వ్యవహరించి విజయం సాధించింది. బడ్జెట్లో నిధులు పెంచడం, విద్యా విధానంలో కోర్సు ప్రవేశపెట్టడం, పాశ్చాత్య దేశాల సాంకేతికత సహకార ఒప్పందాలు చేసుకోవడం ద్వారా సైబర్ నేరాల నియంత్రణలో సౌదీ అరేబియా ప్రపంచంలోనే నెంబర్ వన్ గా నిలిచింది. భారత్ లో కూడా ఇటీవల కాలంలో సైబర్ నేరాల సంఖ్య గణనీయంగా పెరుగుతుండడంతో సౌదీనీ ప్రమాణికంగా తీసుకుని చర్యలు చేపట్టాలి. అందుకు విశ్వవిద్యాలయాలలో కోర్సులు ప్రవేశపెట్టి, ప్రతి పోలీస్ స్టేషన్లో సైబర్ సెల్ ఏర్పాటు చేయాలి. అలాగే ఈ సైబర్ సెల్ లను బ్యాంకులతో అనుసంధానం చేయాల్సి. అదే సమయంలో బ్యాంకులూ అప్రయత్తంగా ఉండి నేరాలను అరికట్టేందుకు సహకారం అందించాలి.ఇలాంటి చర్యలకు ప్రభుత్వ తోడ్పాటు ఉంటే తప్పక సత్ఫలితాలు వస్తాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/banks-should-be-more-alert-to-control-39-188908.html
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.