Publish Date:Mar 15, 2025
హిందీ భాషను తమపై రుద్దకండి అంటూ చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదని నటుడు ప్రకాశ్ రాజ్ తాజాగా జనసేనాని పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ట్వీట్ చేశారు. దీనికి కౌంటర్ గా సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ ట్విట్టర్ వేదికగా ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ చూసిన జనాలు ఇది ఖచ్చితంగా ప్రకాశ్ రాజ్ కు కౌంటర్ ట్వీట్ అని తెలుస్తోంది.
మూవీఆర్టిస్ట్ అసోసియేషన్ ( మూవీ) ఎన్నికల్లో మా అధ్యక్ష పదవికి పోటీ పడిన ప్రకాశ్ రాజ్ కు అప్పట్లో జనసేనాని పవన్ కళ్యాణ్ మద్దత్తు పలికారు. తాజాగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ ట్విట్టర్ లో రియాక్ట్ కావడాన్ని పవన్ కళ్యాణ్ వీరాభి మాని అయిన బండ్ల గణేష్ స్పందించారు.
“కృతజ్ఞత లేకుండా బతకడం మానవత్వాన్ని కోల్పోవడమే, ద్రోహంతో బతకడం మనుష్యత్వాన్ని నాశనం చేసుకోవడమే. ఒక మనిషి జీవితంలో కృతజ్ఞత ఎంత ముఖ్యమో, ద్రోహం ఎంత ప్రమాదకరమో స్పష్టంగా తెలియజేస్తుంది. మనం ఎప్పుడూ కృతజ్ఞతతో జీవించాలి..!” అని ఆయన ట్వీట్ చేశారు. మా అధ్యక్ష పదవికి మంచువిష్ణుకు పోటీగా ప్రకాశ్ రాజ్ నిల్చున్నారు. అప్పట్లో జనసేనాని ప్రకాష్ రాజ్ వెంటే నిలిచారు. . పాత విషయాలను నెమరువేసుకున్న బండ్ల గణేష్ ట్వీట్ పొలిటికల్ గా హీటెక్కించింది.పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ చిత్రానికి బండ్ల గణేష్ నిర్మాత
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/bandla-ganesh-interesting-tweet-as-a-counter-to-prakash-raj-25-194461.html
హైదరాబాద్లోని గచ్చిబౌలిలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది.
పండుగ వేళ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంది.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది. సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది