చొప్పదండి సోలార్ ప్లాంట్‌ను పరిశీలించిన బండి సంజయ్

Publish Date:Jun 17, 2026

Advertisement

 

కరీంనగర్ జిల్లా చొప్పదండి పర్యటనలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సహకార సంఘాలకు కీలక సూచనలు చేశారు. సహకార సంఘాల ఆధ్వర్యంలో సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకుంటే దీర్ఘకాలంలో భారీ స్థాయిలో ఆదాయం పొందే అవకాశం ఉందని తెలిపారు. ముఖ్యంగా 1 మెగావాట్ సామర్థ్యం గల సోలార్ ప్లాంట్ ద్వారా సంవత్సరానికి సుమారు రూ.50 లక్షల వరకు ఆదాయం ఆర్జించవచ్చని పేర్కొన్నారు.

పర్యటనలో భాగంగా ఆయన ముందుగా జన ఔషధి కేంద్రాన్ని సందర్శించి అక్కడి కార్యకలాపాలను పరిశీలించారు. తక్కువ ధరల్లో నాణ్యమైన మందులు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు జన ఔషధి కేంద్రాల సేవలను మరింతగా వినియోగించుకోవాలని సూచించారు.

అనంతరం చొప్పదండి శివారులో ఏర్పాటు చేసిన సోలార్ ప్లాంట్‌ను సందర్శించి, దాని పనితీరు, పెట్టుబడి వ్యయం, రుణ సదుపాయాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కుసుం (PM-KUSUM) పథకం ద్వారా సహకార సంఘాలను సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో భాగస్వామ్యం చేసేందుకు ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఈ పథకం కింద ప్రాజెక్టు వ్యయంలో 80 శాతానికి పైగా రుణ సదుపాయం నాబార్డ్ ద్వారా అందుబాటులో ఉంటుందని చెప్పారు.

ఒక మెగావాట్ సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు సుమారు రూ.3.80 కోట్ల వ్యయం అవుతుందని, ఇందులో సహకార సంఘం సుమారు రూ.40 లక్షలు మాత్రమే పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుందని వివరించారు. మిగిలిన మొత్తం రుణంగా లభిస్తుందని తెలిపారు. సాధారణంగా 4 శాతం వడ్డీ రేటు ఉండగా, ఈఎంఐలను సకాలంలో చెల్లించే వారికి 3 శాతం వరకు వడ్డీ రాయితీ లభిస్తుందని చెప్పారు. దీంతో తక్కువ వడ్డీతోనే ప్రాజెక్టును విజయవంతంగా అమలు చేయవచ్చన్నారు.

సోలార్ ప్లాంట్లలో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను డిస్కంలు యూనిట్‌కు సుమారు రూ.3 చొప్పున కొనుగోలు చేస్తాయని, దీని ద్వారా సహకార సంఘాలకు స్థిరమైన ఆదాయం లభిస్తుందని తెలిపారు. భూమి అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో సుమారు మూడు ఎకరాల స్థలం ఉంటే 1 మెగావాట్ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయవచ్చని సూచించారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు కొద్ది సహకార సంఘాలు మాత్రమే ఈ తరహా ప్రాజెక్టులను ప్రారంభించాయని, కరీంనగర్ జిల్లా చొప్పదండిలో ఏర్పాటు చేసిన ప్లాంట్ అందులో ముఖ్యమైనదని పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లాలో కూడా కొన్ని సోలార్ ప్లాంట్లు ఏర్పాటు అయ్యాయని తెలిపారు. మరిన్ని సహకార సంఘాలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.

వ్యక్తిగతంగా సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకునే వారికి కూడా రుణ సదుపాయం అందుబాటులో ఉందని, అయితే వడ్డీ రేటు కొంత ఎక్కువగా ఉంటుందని వివరించారు. భూమి ఉన్న రైతులు, సహకార సంఘాలు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటే దీర్ఘకాలికంగా స్థిరమైన ఆదాయ వనరును పొందవచ్చని బండి సంజయ్ సూచించారు.

By
en-us Political News

  
లో క‌ల్తీల నిరోధానికి స‌మ‌గ్ర చ‌ట్టాలు ఉన్న దేశాల‌ను సంద‌ర్శించి అక్క‌డి విధానాల‌ను అధ్య‌య‌నం చేయాల‌ని సీఎం అధికారుల‌కు సూచించారు. ఆయా అధ్య‌య‌నాల ఆధారంగా ఒక స‌మ‌గ్రమైన నివేదికను త‌యారు చేయాల‌న్నారు.
భూముల్లో రైతులు సాగు చేస్తున్న పంటలకు ఎలాంటి నష్టం కలగకుండా పనులు చేపడతామని రైతులకు హామీ ఇచ్చారు.
ర్యాలీ సందర్భంగా హైడ్రా జిందాబాద్, జై రేవంత్ రెడ్డి, జై రంగనాథ్ అంటూ నినాదాలు చేశారు. చేతుల్లో ప్లకార్డులతో ప్రభుత్వ భూములు, చెరువులు, పార్కులు, నాలాలు వంటి ప్రజా ఆస్తులను కాపాడేం దుకు హైడ్రా చేస్తున్న చర్యలను కొనసాగించాలని కోరారు.
ఒక్కొక్కరిగా ఐదుగురు మునిగిపో తుండగా చూసిన స్థాని కులు వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాలింపు చర్యల్లో ఐదుగురు జాలర్ల మృతదేహాలను వెలికి తీశారు.
నెల్లూరు కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న రావణ్‌ను పోలీసులు గన్నవరం కోర్టులో వర్చువల్ విధానంలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా న్యాయస్థానంలో ఇరుపక్షాల లాయర్ల మధ్య సుదీర్ఘ వాదనలు జరిగాయి. నిందితుడిపై ఉన్న తీవ్రమైన ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతున్నందున అతని రిమాండ్‌ను పొడిగించాలని ప్రభుత్వ పక్ష న్యాయవాదులు కోరారు.
సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన నిరాహార దీక్షను పోలీసులు బలవంతంగా భగ్నం చేయడాన్ని నిరసిస్తూ కర్ణాటక రాజధాని బెంగళూరులోని విద్యార్థులు ప్రత్యక్ష పోరాటానికి రెడీ అయ్యారు. సోనమ్ వాంగ్‌చుక్ పోరాటానికి మద్దతుగా తాము కూడా నిరశన దీక్ష చేపట్టనున్నట్లు బెంగళూరు యూనివర్సిటీ విద్యార్థులు ప్రకటించారు.
నీతి ఆయోగ్ ఈ ర్యాంకింగ్స్‌ను కేవలం ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా కాకుండా.. గత కొన్ని ఏళ్ల పారిశ్రామిక విధానాల ఆధారంగా లెక్కించింది. గత ప్రభుత్వ హయాంలో రాజధాని అమరావతి విషయంలో జరిగిన గందరగోళం, పారిశ్రామిక విధానాల్లో స్థిరత్వం లేకపోవడం, గతంలో ప్రారంభమైన ప్రాజెక్టులను నిలిపివేయడం వంటి చర్యలు రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీశాయి. పక్క రాష్ట్రాల్లో లాగా పాలసీ కంటిన్యూటీ లేకపోవడం పెట్టుబడిదారుల్లో అపనమ్మకాన్ని కలిగించిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
నడిరోడ్డుపై ఆమె దుస్తులు చించేసి, వివస్త్రను చేసి అవమానించారు. బాధితురాలు ఎంతగా వేడుకున్నా కనికరించకుండా పిడిగుద్దుల వర్షం కురిపించారు. స్థానిక మహిళలు అడ్డుకుని బాధితురాలికి దుస్తులు అందించారు. ఈ దారుణానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
తన భర్త పవన్ కల్యాణ్‌కు ఇటీవల భుజానికి శస్త్రచికిత్స జరిగిన నేపథ్యంలో ఆయన ఆరోగ్యం త్వరగా కుదుటపడాలని, స్వామివారి కృపాకటాక్షాలు ఉండాలని కోరుకుంటూ అన్నా లెజినోవా కాలినడకన తిరుమల చేరుకుని తిరమలేశుడిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె తన కుమారుడు మార్క్ శంకర్ పవన్ కల్యాణ్ పేరిట అన్నప్రసాదం ట్రస్టుకు 17 లక్షల రూపాయల విరాళాన్ని అందజేశారు.
వైసీపీ హయాంలో ముంబైకి చెందిన నటి కాదంబరి జెత్వానీ, తల్లిదండ్రులపై ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో ఫోర్జరీ, అక్రమ వసూళ్ల ఆరోపణలతో అక్రమంగా కేసు నమోదు చేశారనేది ప్రధాన ఆరోపణ. వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదు ఆధారంగా.. కేవలం 24 గంటల వ్యవధిలోనే ముంబై వెళ్లిన ఏపీ పోలీసులు ఆమెను, ఆమె తల్లిదండ్రులను అరెస్టు చేసి విజయవాడకు తరలించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు, యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందంటూ, వాటిని ఎండగట్టడమే ప్రధాన లక్ష్యంగా ఈ యువ సంగ్రామ సభకు బీఆర్‌ఎస్ సిద్ధమైంది. ఈ సభకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు పది వేల మందికి పైగా యువకులు, నిరుద్యోగులు, విద్యార్థులు పార్టీ కార్యకర్తలు హాజరవుతారని బీఆర్ఎస్ అంచనా వేసింది.
రాజకీయ నాయకులు వస్తారు.. వెళ్తారు. పార్టీలు మారతాయి, జెండాలు మారతాయి, జనం, నేల మాత్రం శాశ్వతం. అందుకే.. అందుకే ఈ రోజు ప్రపంచాన్ని ఒకటే అడుగుతున్నాం. పులివెందులను ఒక వ్యక్తి కళ్లతో చూడకండి. పులివెందులను ఒక కుటుంబం చరిత్రతో కొలవకండి.
ఈ దాడుల్లో ప్రాంగణంలో పెంచుతున్నపాతిక గంజాయి మొక్కలు బయటపడ్డాయి. అంతేకాకుండా, విక్రయానికి సిద్ధంగా ఉంచినట్లు అనుమానిస్తున్న ఎండు గంజాయిని కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకు న్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.