బండి సాయి భగీరథ్ మళ్లీ చర్లపల్లి జైలుకు
Publish Date:Jun 26, 2026
Advertisement
పోక్సో కేసులో అరెస్టై చర్లపల్లి కేంద్ర కారాగారంలో ఉన్న బండి సాయి భగీ రథ్‌కు పరీక్షలు రాసేందుకు కోర్టు మంజూరు చేసిన మధ్యంతర బెయిల్ గడువు ముగియడంతో ఆయనను శుక్రవారం (జూన్ 24) తిరిగి జైలుకు తరలించారు. మహీంద్రా యూనివర్సిటీలో బీబీఏ కోర్సు చదివిన భగీరథ్ నాలుగు సబ్జెక్టుల్లో ఫెయిల్ కావడంతో.. వాటికి సంబంధించిన స్పెషల్ సప్లిమెంటరీ పరీక్షలను యూనివర్సిటీ ఇటీవల నిర్వహించింది. గత మే నెలలో జరిగిన సాధారణ సప్లిమెంటరీ పరీక్షల సమయంలో ఆయన పోక్సో కేసులో జైలులో ఉండటం తో పరీక్షలు రాయలేకపో యాడు. దీంతో విద్యా సంవ త్సరం నష్టపోకుండా ఉండేం దుకు యూనివర్సిటీ ప్రత్యే కంగా మరోసారి స్పెషల్ సప్లిమెంటరీ పరీక్షలను ఏర్పాటు చేసింది. ఈ పరీక్షలకు హాజరయ్యేందుకు భగీరథ్ ఈ నెల 19న కోర్టును ఆశ్రయించి మధ్యంతర బెయిల్ పొందారు. దీంతో ఈ నెల 20న చర్లపల్లి జైలు నుంచి తాత్కాలికంగా విడుదలైన ఆయన, యూనివర్సిటీ నిర్వహించిన స్పెషల్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షలు ముగియడంతో కోర్టు విధించిన మధ్యంతర బెయిల్ గడువు కూడా ముగిసింది. దీంతో భగీరథ్‌ను పోలీసులు మేడ్చల్, మల్కాజిగిరి కోర్టులో హాజరుపరిచారు. అనంతరం న్యాయస్థానం ఆదేశాల మేరకు ఆయనను తిరిగి చర్లపల్లి కేంద్ర కారా గారానికి తరలించారు.
http://www.teluguone.com/news/content/bandi-sai-bhagirath-back-to-cherlapally-jail-36-224229.html





