బందరెళితే.. బందరే!

Publish Date:May 23, 2023

Advertisement

బందరు పోర్టు శంకుస్థాపన చివరికి ఒక ప్రహసనంగా తయారైంది. ఇప్పటికే రెండు సార్లు పునాదిరాయి పడిన బందరు పోర్టుకు మళ్లీ పునాదిరాయి పడింది. ఎన్నిసార్లు శంకుస్థాపనలు చేసినా నిర్మాణానికి నోచుకోకపోవడం బందరు పోర్టు ప్రత్యేకత. బందరు పోర్టు శంకుస్థాపన కథ కొంత విచిత్రంగానే ఉంటుంది. బందరులో పోర్టు నిర్మాణానికి తీర ప్రాంతం అనువైనదని వందల సంవత్సాల ముందే నిర్ణయించారు.  

అయితే తూర్పు తీర ప్రాంతంలో అనేక మేజర్ పోర్టులు ఉండటంతో  బందరు పోర్టు ఆలస్యమవుతూ వచ్చింది. 2009 ఎన్నికలకు ఏడాది ముందు అంటే 2008 ఏప్రియల్ 23వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి బందరు పోర్టుకు శంకుస్థాపన చేశారు. 2009 ఎన్నికలలో గెలిచిన వైఎస్ఆర్ అదే సంవత్సరం సెప్టెంబర్ 2న హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. అనంతరం జరిగిన పరిణామాల్లో మరో కాంగ్రెస్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బందరు పోర్టుకు సంబంధించిన కార్యక్రమాల్లో  పాల్గొన్నారు. 2014 ఎన్నికల ముందు జరిగిన హడావుడి పోర్టు నిర్మాణం వైపు సాగలేదు. పోర్టుకు సంబంధించిన స్థల సేకరణకు చర్యలు తీసుకోలేదు.

ఆ సమయంలో కృష్ణపట్నం పోర్టు కార్యకలాపాలు, అక్కడ నుంచి ముడి ఇనుప ఖనిజం ఎగుమతులు భారీగా జరుగుతూ ఉండడంతో మిగిలిన పోర్టుల జోలికి కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్లలేకపోయింది. రాష్ట్ర విభజన తరువాత  తెలుగుదేశం హయాంలో తిరిగి పోర్టుల నిర్మాణంపై దృష్టి కేంద్రీకరించారు. ఈ క్రమంలో 2019 ఫిబ్రవరి 7వ తేదీన అప్పటి ముఖ్యమం్రతి చంద్రబాబునాయుడు బందర్ పోర్టుకు శంకుస్థాపన చేశారు. అదే సంవత్సరం జరిగిన ఎన్నికలలో వైసీపీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్ల పాటు పోర్టు పనులను అటకెక్కించింది. సంక్షేమం పేరుతో డబ్బులు పంచడమే పాలన అంటూ ఖజానా ఖాళీ చేసిన జగన్ ప్రభుత్వం బందరు పోర్టు, భోగాపురం ఎయిర్ పోర్టు వంటి భారీ ప్రాజెక్ట్ ల గురించి ఆలోచించలేకపోయింది. వేల కోట్ల ఖర్చు అయ్యే ఇలాంటి ప్రాజెక్ట్ లు ప్రారంభించడం  జగన్ సర్కార్ కు అసాధ్యమే అయింది.

అయితే మే 22వ తేదీన బందరు పోర్టుకు శంకుస్థాపన చేసిన జగన్ గత ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.  అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అయినా పోర్టు పేరెత్తని జగన్ ఎన్నికల ముందు పోర్టు పనులు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్య పరిచారు.  గతంలో జరిగిన శంకుస్థాపనలకు ప్రత్యక్ష సాక్షి అయిన పేర్ని నాని ఈ సారి కూడా జగన్ త బందర్ పోర్టు పనులను మరోసారి ప్రారంభించారు.

అయితే 2008లో ప్రారంభించిన వైఎస్ఆర్ ప్రమాదంలో మరణించగా, 2014లో పనులు పర్యవేక్షించిన కిరణ్ కుమార్ రెడ్డి పదవికి దూరమయ్యారు.  2019లో శంకుస్థాపన చేసిన చంద్రబాబు అనంతర ఎన్నికలలో  ఓటమి పాలయ్యారు. తాజాగా అదే పోర్టును శంకుస్థాపన చేసిన జగన్ కు రానున్న ఎన్నికలలో ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో అని రాజకీయ విశ్లేషకులు ఆలోచనలో పడ్డారు.  ఏది ఏమైనా బందరు సెంటిమెంట్ ఈ సారి కూడా పని చేస్తుందని తెలుగుదేశం నేతలు గుసగుసలాడుకుంటున్నారు. 

By
en-us Political News

  
సీఎం అవినీతి బండారం మొత్తం బయటపడిందన్న కేటీఆర్ కాంగ్రెస్ సర్కార్ తీరు పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రజా రంజక పాలనను పూర్తిగా గాలికొదిలేసి కేవలం ప్రతిపక్షాలపై నిందలు వేయడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు.
తెలంగాణ షాబాద్ లో ఆరుగురిని అత్యంత కిరాతకంగా చంపిన రాజ్ కుమార్ కు, సొంత బాబాయిపై గొడ్డలి వేటు, సొంత తల్లీ, చెల్లిని గెంటేసిన జగన్ కూ మనస్తత్వ పరంగా పోలీకలు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.
పరిశ్రమల పేరుతో యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పి, వేల ఎకరాల విలువైన ప్రభుత్వ భూములను ఇలా కారుచౌకగా కేటాయించడంపై అప్పట్లోనే పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే, భూములు పొందిన తర్వాత గాలి జనార్ధన్ రెడ్డి అక్కడ ఉక్కు కర్మాగారాన్ని నిర్మించడంలో పూర్తిగా విఫలమయ్యారు. పరిశ్రమ పెట్టకపోగా, ఈ ప్రభుత్వ భూములను జాతీయ బ్యాంకుల్లో తాకట్టు పెట్టి దాదాపు 350 కోట్ల రూపాయల మేర రుణాలు పొంది బ్యాంకులను సైతం మోసం చేశారనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి.
ముందస్తు ఎన్నికల ప్రచారాలపైనా సీఎం స్పష్టత ఇచ్చారు. కొందరు ప్రచారం చేస్తున్నట్లుగా రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరిగే ప్రశక్తే లేదని స్పష్టం చేశారు. ఎవరో ఏదో అనుకున్నారని తాము ముందస్తుకు వెళ్లే ప్రసక్తే లేదన్నారు.
నిన్న మొన్నటి వరకూ వైసీపీకి, వివాదాస్పద యూట్యూబర్ ప్రశ్న రావణ్ కు అనుకూలంగా గళమెత్తిన జడ శ్రవణ్ కుమార్ అంత లోనే.. ఇలా యూటర్న్ తీసుకుని వైసీపీపై విరుచుకు పడటం విశేషం. తనకు వైసీపీ ఫండింగ్ చేస్తోందని వస్తున్న ఆరోపణలపై వివరణ ఇచ్చే క్రమంలో ఆయన వైసీపీ దోపిడీని ఎండగట్టారు. వైసీపీ తనకు ఫండింగ్ చేయడమేంటని ప్రశ్నించిన ఆయన ఆ పార్టీ నేతలు ఎంగిలి మెతుకులను కూడా వదలకుండా దోచేసుకుంటారని దుయ్యబట్టారు. జగన్ పాలనా కాలమంతా దోపిడీ రాజ్యమేలిందని విమర్శలు గుప్పించారు.
మొత్తం మీద రేవంత్ సభలో జగన్ ఫ్లెక్సీలు, బ్యానర్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. గతంలో కూడా తెలంగాణలో కేటీఆర్ సభలోనూ జగన్ ఫ్లెక్సీలు వెలిసన సంగతి తెలిసిందే. సొంత రాష్ట్రంలో కార్యక్రమాలు చేపట్టడంలో స్తబ్దుగా ఉంటున్న వైసీపీ శ్రేణులు తెలంగాణలో మాత్రం ఇతర పార్టీల సభలలో తమ అధినేత ఫ్లెక్సీలు, బ్యానర్లు ప్రదర్శించడం పట్ల రాజకీయవర్గాలలో విస్మయం వ్యక్తమౌతోంది.
మాజంలో వివాదాలకు కారణమైన ఒక వ్యక్తికి వైసిపి బహిరంగంగా మద్దతు ప్రకటించడం, మరీ ముఖ్యంగా మత విద్వేషాలు ప్రజ్వరిల్లేలా వ్యాఖ్యలు చేసిన వ్యక్తికి.. తనను తాను రావణుడినని చెప్పుకున్న వ్యక్తిని వత్తాసుగా వైసీపీ నిలవడం కోరి ప్రజా వ్యతిరేకతను కొని తెచ్చుకోవడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఈటల కాళేశ్వరం విషయంలో బీఆర్ఎస్ గళం ఎత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ జరుగుతున్న రాజకీయ పరిణామాలు, ఆరోపణలపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఘాటుగా స్పందించారు. కాళేశ్వరం కమిషన్ విచారణ నేపథ్యంలో ఈటల రాజేందర్ బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా మాట్లాడారు. దీంతో ఈటల మళ్లీ కారెక్కేస్తారా అన్న ప్రచారం అప్పట్లో జోరందుకుంది. ఆ తరువాత సద్దుమణిగింది.
ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాజకీయ పరిస్థితులు అత్యంత సంక్లిష్టమైన మరియు ఆసక్తికరమైన మలుపులు తిరుగుతున్నాయి.
ఉపా కింద నమోదైన ఈ కేసులో నిందితుడి తరఫున న్యాయపోరాటం చేసేందుకు వైసీపీ పార్టీ లీగల్ సెల్ విభాగానికి చెందిన ప్రముఖ సీనియర్ న్యాయవాది, మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి రంగంలోకి దిగారు.
ఈ సర్జరీల తరువాత పవన్ కల్యాణ్ కనీసం నెల రోజుల పాటు పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది.
ఇటీవల అనంతపురం జిల్లాలో మడకశిర ఎమ్మెల్యే ఎమ్ఎస్ రాజు, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మధ్య చోటుచేసుకున్న వ్యక్తిగత విమర్శలు, ఆరోపణల పరంపరపై మధుసూదన్ రెడ్డి, ప్రజాప్రతినిధుల మధ్య కేవలం రాజకీయ పోరాటం ఉంటే ఫర్వాలేదని, కానీ ఇరువర్గాలు కులాల ప్రస్తావన తెస్తూ కుంపట్లు రాజేయడం తీవ్రమైన ప్రమాదాలకు దారితీస్తుందని హెచ్చరించారు.
రావణ్ అరెస్టుపై వైసీపీ, ఇతరులు చేస్తున్న వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే నేరస్థులకు వైసీపీ ఇలా బాహాటంగా మద్దతు ఇవ్వడం దారుణమన్నారు. ప్రశ్న రావణ్ అనే వ్యక్తి ఎలాంటి వ్యాఖ్యలు చేశాడో, సమాజానికి ఎంతటి ముప్పుగా పరిణమించాడో ప్రజలంతా గమనించాలని కోరారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.