తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు హస్తినకేగి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో భేటీ అవ్వడం ఏపీలో అధికార వైసీపీ కాళ్ల కింద భూమి కదిలిపోయినట్లైంది. గత నాలుగేళ్లుగా తాము ఆడింది ఆటగా, పాడింది పాటగా సాగేందుకు కేంద్రంలోని మోడీ సర్కార్ అన్ని విధాలుగా అండదండ అందించిన ధీమాతో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన జగన్ సర్కార్ కు.. ఇక ఈ చివరి సంవత్సరం అంటే ఎన్నికల ఏడాదిలో అలాంటి వెసులుబాటు ఉండదన్న సంకేతాలను ఈ భేటీ ఇచ్చిందనడంలో సందేహం లేదు.
అయితే మీడియాలో, సామాజిక మాధ్యమంలో వస్తున్నట్లుగా పొత్తుల చర్చలు కాదు కానీ.. అసలు ఏపీలో ఏం జరుగుతోందన్న విషయాన్ని విపక్ష నేత, దార్శనికుడు అయిన చంద్రబాబు ద్వారా నేరుగా తెలుసుకునే ఉద్దేశంతోనే బీజేపీ అగ్రనాయకత్వం చంద్రబాచును హస్తినకు ఆహ్వానించి భేటీ అయ్యిందని ఏపీ బీజేపీ శ్రేణుల్లోని ఒక వర్గం బలంగా చెబుతోంది. జగన్ సర్కార్ విషయంలో ఏపీ బీజేపీ నాయకత్వం కేంద్రానికి పూర్తి సమాచారం ఇవ్వడం లేదని ఆ వర్గం చెబుతోంది.
ప్రధాని మోడీ విశాఖ పర్యటన సందర్భంగా రాష్ట్ర నాయకత్వానికి జగన్ సర్కార్ పై వాడవాడలా చార్జిషీట్ లు రూపొందించమని విస్పష్ట ఆదేశాలు జారీ చేసినా.. పార్టీ హై కమాండ్ పూనుకునేవరకూ ఆ కార్యక్రమం కార్యరూపం దాల్చని విషయాన్ని ఆ వర్గం ఈ సందర్భంగా గుర్తు చేస్తోంది. అలాగే.. ఏపీలో బీజేపీ నాయకుల మీద అధికార పార్టీ శ్రేణులు దాడులకు పాల్పడినా పార్టీ రాష్ట్ర నాయకత్వం పెద్దగా పట్టించుకోకపోవడాన్ని సీరియస్ గా తీసుకున్న బీజేపీ అగ్రనాయకత్వం ఈ సారి నేరుగా విపక్ష నేత నుంచి వివరాలు తెలుసుకోవాలని భావించిందని అంటున్నారు. అందుకే ముందుగా అమిత్ షా తో మాత్రమే బాబు భేటీ అని చెప్పినా.. పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కూడా వచ్చి కలవడంతో వారి మధ్య బేటీ రాజకీయపొత్తుల గురించి కాకుండా.. రాష్ట్రంలో అధికార పార్టీ అరాచకత్వాలపైనే సాగిందని అంటున్నారు.
దీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న రెవెన్యూ నిధులను విడుదల చేసినా కేంద్రంలోని బీజేపీ సర్కార్ పట్ల రాష్ట్రంలో ఇసుమంతైనా సానుకూలత రాకపోవడం.. అలాగే రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల నుంచి ఈ సొమ్ముల విడుదల ద్వారా గట్టెక్కుతుందని మోడీ సర్కార్ భావించినా.. మళ్లీ యధావిథిగా అప్పుల కోసం జగన్ సర్కార్ తిప్పలు పడటం.. కనీసం ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి కొనసాగుతుండటంతో... ఏదో తేడా జరుగుతోందని పసిగట్టిన బీజేపీ అగ్రనాయకత్వం చంద్రబాబుతో భేటీలో అందుకు సంబంధించి వివరాలను అడిగి తెలుసుకుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/babu-meet-shah-39-156336.html
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది