తెలంగాణలో పూర్వ వైభవం సంతరించుకొనేందుకు తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. ఆ క్రమంలో హైదరాబాద్‌లోనే కాకుండా.. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్నసభలకు జనం పోటెత్తుతున్నారు. దీంతో వచ్చే ఎన్నికల వేళ.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతోపాటు టీడీపీ నుంచి కూడా గట్టి పోటీ తప్పదనే విషయం బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌కు స్పష్టంగా అర్ధమైంది. ఆ క్రమంలో ఆయన ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్ఎస్ జోరు పెంచేందుకు జంకుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బీఆర్ఎస్ వర్గాల్లో కూడా దాదాపుగా ఇదే రకమైన చర్చ సాగుతోంది.
ఓ వేళ కేసీఆర్.. ఆంధ్ర రాజకీయాల్లో వేలు పెడితే.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు తెలంగాణలో తన ప్రతాపాన్ని ప్రదర్శించడమే కాకుండా.. అటు కాంగ్రెస్ కు లేదా ఇటు బీజేపీకి కానీ మద్దతు ఇస్తే.. భారీగా ఓట్లు చీలిపోయే ప్రమాదం ఉందని.. ఇఅదే జరిగితే కారు టైర్ పంక్చర్ అవ్వడం ఖాయమనీ పరిశీలకులు అంటున్నారు. దీంతో సైలెంట్‌గా ఉండి.. తెలంగాణలో మళ్లీ అధికారాన్ని నిలబెట్టుకొంటే.. ఆ తర్వాత సంగతి తరువాత చూసుకోవచ్చుననే ఆలోచనలో బీఆర్ఎస్ అధినేత ఉన్నారన్న చర్చ రాజకీయవర్గాల్లో హల్‌చల్ చేస్తున్నది. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు నగరంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభమైనా, ఆ కార్యక్రమానికి ఆ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరుకాకపోవడానికి కూడా కారణం అదేనని పరిశీలకులు అంటున్నారు. అలాగే విశాఖపట్నం వేదికగా బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభను నిర్వహించాలని ప్రణాళికలు సైతం సిద్ధం చేసినా ఇప్పుడా ఊసే ఎత్తడం లేదని చెబుతున్నారు.
అయితే ఏపీలో కేసీఆర్ అడుగు పెట్టకపోవడం వెనుక పెద్ద తతంగమే ఉందన్న చర్చ బీఆర్ఎస్ వర్గాల్లో మొదలైంది. ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై సీఎం కేసీఆర్ సొంతంగా... పలు సర్వేలు చేయించుకొన్నారని.. ఆ వివరాల ప్రకారం.. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో కేసీఆర్ పార్టీ పోటీ చేస్తే.. వచ్చే అనుకూల ఫలితాల కంటే.. తెలంగాణలో ప్రస్తుతం చేతిలో ఉన్న అధికారం కూడా చేజారే అవకాశాలు మెండుగా ఉన్నాయని... అదే విధంగా తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమ నేతగా, టీఆర్ఎస్ పార్టీ అధినేతగా కేసీఆర్... ఆంధ్రులను లక్ష్యంగా చేసుకొని చేసిన వ్యాఖ్యలు ఇంకా వారి మనస్సు పొరల్లో భద్రంగా ఉన్నాయని.. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీ పట్ల.. ఆ పార్టీ అధినేత కేసీఆర్ పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని సదరు నివేదికలు క్లియర్‌కట్‌గా స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
మరోవైపు రాష్ట్ర విభజనతో రాజధాని హైదరాబాద్‌ని ఆంధ్రులు కోల్పోయారని.. ఆ సమయంలో అంటే 2014లో జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. రాజధానిగా అమరావతిని ఎంపిక చేసి.. ఆ దిశగా ఆయన అడుగులు వేశారని.. అంతలో 2019 ఎన్నికలు రానే వచ్చాయని.. ఈ ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ అధినేత వైయస్ జగన్... ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం.. ఆ తర్వాత.. ఆయన ఏపీకి మూడు రాజధానులంటూ ప్రకటించడంతో.. రాజధాని అమరావతిని సైతం కోల్పోయిన పరిస్థితికి దాదాపుగా వచ్చేశామని.. దీంతో రాష్ట్ర విభజనకే కాదు.
గత ఎన్నికల్లో వైయస్ జగన్ గెలుపునకు పూర్తి సహాయ సహకారాలు అందించడంలో తెలంగాణ సీఎం కేసీఆర్ తన వంతు పాత్ర పోషించారని... ఈ నేపథ్యంలో గులాబీ బాస్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత సైతం వ్యక్తమవుతోందనే చర్చ సైతం సదరు సర్వే నివేదికల్లో స్పష్టమైనట్లు తెలుస్తోంది. అటువంటి వేళ గులాబీ బాస్ కేసీఆర్.. తెలంగాణ ఎన్నికల్లో గెలుపు కోసం కృషి చేసి.. ఆ తర్వాత ఎప్పటిలాగా లోక్‌సభ ఎన్నికలపై దృషి సారించే అవకాశాలు ఉన్నాయని కారు పార్టీలో ఓ ముచ్చట అయితే ముచ్చటగా సాగుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/babu-fear-in-kcr-39-156498.html
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.