కటకటాలా.. పరారీయా.. అవినాష్ కు మిగిలిన దారులివే!?

Publish Date:May 19, 2023

Advertisement

వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డికి అరెస్టు నుంచి తప్పించుకోవడానికి దారులన్నీ మూసుకుపోయాయి. ఇక అరెస్టు తప్పించుకోవాలంటే ఆయనకు ఉన్న ఒకే ఒక్క దారి అజ్ణాతంలోకి వెళ్లడమే.   హైదరాబాద్ టు పులివెందుల, పులివెందుల టు హైదరాబాద్ భారీ కాన్వాయ్ తో ఆయన పెడుతున్న పరుగుతు చూస్తుంటే అవినాష్ ఆవినాష్ పరారీ ప్రణాళికల్లోనే ఉన్నారని అనిపిస్తోందంటూ పరిశీలకులు విశ్లేషణలు సైతం  భావిస్తున్నారు.

అంతే కాదు మధ్యలో ఒక సారి తల్లిని హైదరాబాద్ కు తరలిస్తుంటే ఆయన బెంగళూరు వెళ్లేందుకు నిర్ణయించుకున్నారని కూడా వార్తలు వచ్చాయి. ఎవరిని డైవర్ట్ చేయడానికి, ఎవరిని కన్ఫ్యూజ్ చేయడానికి ఈ లీకులు ఇస్తున్నారో అర్ధం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదని అంటున్నారు. తల్లి గుండెపోటుతో బాధపడుతుంటే.. మెరుగైన వైద్య చికిత్స అందించాలని నిజంగా భావిస్తే ఆమెను పులివెందుల నుంచి బెంగళూరు తరలించాలి. ఎందుకంటే పులివెందుల నుంచి హైదరాబాద్  418 కిలోమీటర్లు అయితే, అదే పులివెందుల నుంచి బెంగళూరు 211 కిలోమీటర్లు. కనీసమైన ఇంగిత జ్ణానం ఉన్నవారెవరైనా తీవ్ర అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలంటే పులివెందుల నుంచి హైదరాబాద్ కు అదీ రోడ్డు మార్గంలో తరలించరు.

కచ్చితంగా బెంగళూరుకే తీసుకు వెడతారు. కానీ ఘనత వహించిన కడప ఎంపీ అవినాష్ రెడ్డి మాత్రం గుండెపోటుకు గురైన తన తల్లికి మెరుగైన వైద్యం కోసం అంబులెన్సులో రోడ్డు మార్గంలో పులివెందుల నుంచి హైదరాబాద్ కు తీసుకువస్తున్నారు. ఆ అంబులెన్స్ వెంటే తాను కాన్వాయ్ లో హైదరాబాద్ కు వస్తున్నారు. ఆ కాన్వాయ్ ని తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే, ఆయన అనుచరులూ అనుసరిస్తున్నారు. ఉదయం నుంచీ ఒకదాని వెంట ఒకటిగా వేగంగా చోటు చేసుకుంటున్న సంఘటనలు క్రైం సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపించేవిగా ఉన్నాయి. అసలు తల్లిక అనారోగ్యం అంటూ ఆయన పులివెందులకు బయలు దేరిన క్షణం నుంచే ఆయనలోనూ ఆయన అనుచరులలోనూ అరెస్టు ఆందోళన ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. అందుకే అవినాష్ పులివెందుల ప్రయాణాన్ని రిపోర్ట్ చేస్తున్న మీడియా ప్రతినిథులపై దాడి చేశారు.

పులివెందుల మార్గ మధ్యంలో అవినాష్ కాన్వాయ్ ను అనుసరిస్తున్న సీబీఐ వాహనాలపై దాడికి సైతం సమాయత్తమయ్యారు.  సీబీఐ అవినాష్ రెడ్డిని అరెస్టు చేయాలంటే స్థానిక పోలీసుల సహకారం అవసరం. ఏపీలో ఆ సహకారం అందదని వివేకా హత్య కేసు దర్యాప్తు ఏపీలో సాగుతున్న సమయంలోనే తేటతెల్లమైంది. కడపలో, పులివెందులలో సీబీఐ అధికారులకే రక్షణ లేని పరిస్థితి అప్పట్లో కళ్లకు కట్టినట్లు కనిపించింది. సీబీఐ వాహనాలపై దాడి, అధికారులకు బెదరింపులు, వారిపైనే ప్రైవేటు కేసులు ఇలా కేసు దర్యాప్తు అడుగు ముందుకు కదలకుండా నిలువరించిన పరిస్థితి. కేసు విచారణ ఏపీ నుంచి తెలంగాణకు మారిన తరువాతే స్పీడందుకుంది. సూత్రధారులు, పాత్ర ధారుల నిగ్గు తేల్చే దిశగా వేగంగా కదిలింది.

దాంతో ఇక బెదరింపులకు అవకాశం లేదని గ్రహించిన  అవినాష్ అండ్ కో.. కేసు దర్యాప్తు వేగం తగ్గించేందుకు న్యాయస్థానాలను ఆశ్రయించారు. అక్కడ తాత్కాలికంగానే ఊరట లభించింది. సిబీఐ దర్యాప్తులో జోక్యం చేసుకోజాలమని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పడమే కాకుండా.. అవినాష్ అరెస్టుకు ప్రతిబంధకాలేమీ లేవని సీబీఐకి రూట్ క్లియర్ చేసింది.  దీంతో  దారులన్నీ మూసుకుపోయిన అవినాష్ ఇప్పుడు రోడ్ల మీద పరుగులు తీస్తున్నారు. ఆగితే అరెస్ట్ తప్పదన్న నిర్ణయానికి వచ్చారు. ఎంత ప్రయత్నించినా ఏం చేసినా ఆయనకు  సీబీఐ ఎదుట హాజరై అరెస్టు కావడం.. లేదా అజ్ణాతంలోకి వెళ్లి దాక్కోవడం అన్న రెండు దారులే మిగిలాయని అంటున్నారు. ఏపీలో అరెస్టు చేయడానికి అవసరమైన బందోబస్తు అక్కడి పోలీసుల నుంచి దక్కే అవకాశం లేకపోవడంతో ఆయనను హైదరాబాద్ చేరనిచ్చి అక్కడ సీబీఐ అరెస్టు చేసే అవకాశాలున్నాయని అంటున్నారు.

ఒక వేళ అక్కడ కూడా సరైన భద్రతా చర్యలు లేవని భావిస్తే కేంద్ర బలగాలను రప్పించైనా అరెస్టు చేయాలన్న పట్టుదలతో సీబీఐ ఉందని, అందుకు సీబీఐ ప్రధాన కార్యాలయం నుంచి అవినాష్ ను అరెస్టు చేయాలన్న ఆదేశాలు రావడమే నిదర్శమని పరిశీలకులు చెబుతున్నారు. అవినీష్ గత నాలుగు నెలలుగా ఆడుతున్న దోబూచులాట కారణంగా దేశంలోని అత్యున్నత దర్యాప్తు సంస్థ  సీబీఐ  తెలుగు రాష్ట్రాల ప్రజల ముందు ఒక జోకర్ గా నిలబడే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే అవినాష్ ను ఎలాగైనా అరెస్టు చేసి తమ ప్రతిష్ట కాపాడుకోవాలని సీబీఐ భావిస్తోంది. 

By
en-us Political News

  
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
 బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై  చార్జ్‌షీట్‌  విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్  ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు.  తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే..  మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి  సొంత నియోజకవర్గానికే  ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.  
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో  గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన  బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది.  పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న  నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి. 
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.
ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అభ్యర్థి అని కుండబద్దలు కొట్టారు. ఆ విషయాన్నే తమిళనాడు కాంగ్రెస్ శాసనసభాపక్ష  నాయకురాలు తారాహై కత్‌బర్ట్  మరింత క్లారిటీ ఇస్తూ.. విజయ్ ప్రధాని అవుతారంటూ కొందరు ప్రచారం చేయడం కేవలం టీవీకే శ్రేణుల ఉత్సాహం వల్ల జరుగుతున్న ప్రచారమే తప్ప, అది ఆ పార్టీ అధికారిక వైఖరి కాదన్నారు.
రాజకీయ క్షేత్రంలో ముందస్తు ఊహాగానాలు, భవిష్యత్ ఎన్నికల అంచనాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి. ఈ నేపథ్యంలో సపోజ్ ఫర్ సపోజ్  ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందన్న చర్చ జోరందుకుంది. రానున్న  రాజకీయ సమీకరణాలపై   చర్చోపచర్చలు మొదలయ్యాయి.
కొండా సురేఖపై వేటు తప్పదనీ, ఆమెకు క్యాబినెట్ నుంచి ఉద్వాసన తప్పదన్న ప్రచారం జోరుగా సాధింది. ఒక దశలో రేవంత్ కేబినెట్ లోకి సురేఖ స్థానంలో మరో ఫైర్ బ్రాండ్ నాయకురాలు విజయశాంతిని తీసుకోనున్నట్లు కూడా వార్తలు వినిపించాయి. 
 ప్రభుత్వ మద్దతుతో జరిగే ఏకగ్రీవ ఎన్నికలు ఉంటాయన్న ఆయన రాజకీయ పార్టీ కోణంలో ఏకగ్రీవాలు ఉండకూడదని జగన్ అన్నారంటూ బొత్స  వివరణపై వైసీపీ నేతలు పెదవి విరుస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.